Monday, June 13, 2022

GSF Sadhana Village libraries inauguration in villages



It is one of the greatest moments for all the students who are preparing for competitive examinations and also for book lovers. Today, i.e., on 12-6-22, the sadhana library coordination team inaugurated three sadhana village libraries on the same day. Going into the details, at 10 AM, Mantangowrelli sadhana village library is inaugurated by the Founder and Managing trustee of Gnana Saraswati foundation Shri. Sada Venkat Garu, which is attended by Village sarpanch Vijaya Lakshmi Garu and nearly 30 job aspirants. Speaking at the event, Sada Venkat Garu has inspired the students to utilize the library and achieve their goals. He has also emphasized that it is the students' responsibility to give back to society through finances or their time for the welfare of the needy deserving, and talented students. In the evening, at 6:00 PM sadhana village library is inaugurated at Kurmidda, where sada Venkat Garu appreciates the efforts of the sadhana village library regulatory team for their efforts to establish a library though there is a lack of basic amenities; participants in the program thanked Gnana Saraswati foundation for their help in selecting the village library. They promised that with the help of the foundation and the villagers, they would make sure that the village students would develop a reading habit in the children in the village. After the inauguration of the kurmidda library, the team visited gadda mallayagudam to inaugurate the village library. The library coordination team congratulated the sadhana village library team and addressed the job aspirants to utilize the library and achieve their goals.

Wednesday, June 8, 2022

News of GSF SVL.

News Paper Clippings of GSF SVL Inauguration Program on 07.06.2022 @ MondiGowrelly  Village, Yacharam Mandle, RR Dist.

Tuesday, June 7, 2022

SVL_ MondiGowrelly.

*పుస్తకాలకు మించిన మంచి మిత్రుడు ఈ లోకంలో లేరు,పుస్తకాలను చదవడం దినచర్యలో ఒక భాగం కావాలి:- GSF వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు* 
జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాధన విలేజ్ లైబ్రరీ మొండిగౌరెల్లి గ్రామంలో నేడు ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్యఅతిథి శ్రీ సదా వెంకట్ గారు ప్రారంభించినారు,సదా వెంకట్ గారు మాట్లాడుతూ ఎంపిక చేసిన మొండిగౌరెల్లి గ్రామానికి గ్రంథాలయ సామాగ్రి @ బుక్ రాక్స్ 2 , చైర్1 ,టేబుల్ 1 మరియు కాంపిటీటివ్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది.
 ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న యువకులకు మరియు బాలలకి ఉపయోగపడే విధంగా బాలసాహిత్యం ఈ గ్రంథాలయంలో అందుబాటులో ఉంటాయి.
వాటిని సద్వినియోగం చేసుకోవాలని, పుస్తకాలు కేవలం ఉద్యోగ సాధన కోసమే కాకుండా జీవితాన్ని సాధించడానికి చదవాలి,అదొక అద్భుత సాధనగా మన దినచర్యలో ఒక భాగంగా పుస్తక పఠనం చేయాలని అన్నారు,2014 సంవత్సరం నుండి ఈ గ్రంథాలయాల కోసం  ఫౌండేషన్ విశేష ప్రయత్నం చేస్తుంది,ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అవసరమైన పుస్తకాలతో పాటు దేశ చరిత్ర, రాష్ట్ర చరిత్ర పుస్తకాలు మరియు బాలలకు ఉపయోగపడే విధంగా బాలసాహిత్యం కూడా ఈ గ్రంథాలయoలో ఉంటుంది.ముఖ్యంగా బాల సాహిత్యంతో 2014-15 సంవత్సరాలలో సంచార గ్రంథాలయం మరియు 5 గ్రామాలలో గ్రంథాలయాల ఏర్పాటు కూడా జరిగింది.
అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ విడత 10 గ్రామాలలో ఉద్యోగాల ప్రయత్నంలో ఉన్న యువత కోసం మరియు బాల సాహిత్యంతో  సాధన గ్రామీణ గ్రంథాలయాలు ఏర్పాటు చేసిందన్నారు,అందులో భాగంగానే నేడు మొండిగౌరెల్లి గ్రామంలో సుమారు 20 నుండి 40 మంది వరకు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న
5 గురు నిర్వహణ సభ్యులుగా ( Regulatory Committee) గుర్తించి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది అని అన్నారు,ఈ గ్రంథాలయ ఏర్పాటుకు ఒక్క గ్రామానికి సుమారు 75 వేల రూపాయల ఖర్చుతో సామాగ్రి అందజేయడం  జరిగింది.
ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు రవి,పల్లె ప్రగతి స్పెషల్ ఆఫీసర్ నర్సింహా సార్, ఉపసర్పంచ్ మేకల యాదగిరి రెడ్డి,BJP మండలాధ్యక్షులు తాండ్ర రవీందర్,BSP మండల కన్వీనర్ గొడుకొండ్ల ప్రవీణ్,SMC చైర్మన్ కట్టెల ఆంజనేయులు,
ఉపాధ్యాయులు కొంగర జంగయ్య,మర్రిపల్లి మహేష్,కట్టెల రమేష్,వస్పరి మల్లేష్,పెండ్యాల మహేష్, గ్రామ యువజన సంఘాల సభ్యులు గుడాల వెంకటేష్, గడ్డం లింగం,శశిధర్, గ్రంథాలయ నిర్వహణ కమిటీ సభ్యులు గడ్డం రాజశేఖర్,మంతాపురం లోకేష్,నక్క మధు,బొడ్డు అనిల్  తదితరులు పాల్గొన్నారు.
:~ Regulatory Committee,
SVL ,Mondigowrelly.

Sunday, June 5, 2022

సాధన కుటీర్ ను సందర్శించిన జాతీయ బి.సి. కమిషన్ సభ్యులు శ్రీ తల్లోజి ఆచారి గారు..

జ్ఞానసరస్వతి ఫౌండేషన్ శిబిరాలలో పాల్గొన్న బి.సి విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు
సాధన కుటీర్ ను సందర్శించిన జాతీయ బి.సి. కమిషన్ సభ్యులు శ్రీ తల్లోజి ఆచారి గారు..
 ఏమాత్రం
ముందస్తు సమాచారం  లేకుండా అక్రమ నిర్మాణాలు అనే నెపంతో సాధన కుటీర్ లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక తరగతి గదులు,కొన్ని పురాతన కట్టడాలను కూల్చిన విధానం అక్రమంగా ఉన్నదన్నారు. నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న ఒక స్వచ్ఛంద సంస్థపై ఇది దారుణమైన చర్య అని అన్నారు...
తగిన విచారణ జరిపి,
 ఇలాంటి చర్యలో పాల్గొన్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని GSF సబ్యులు కోరారు.  
:~ team GSF.

Thursday, June 2, 2022

GSF met National BC Commission Chairman Sri Achari gaaru

జాతీయ బి.సి.కమీషన్ చైర్మన్ శ్రీ  ఆచారి గారిని కలిసిన జ్ఞానసరస్వతి ఫౌండేషన్ శిబిరాలలో పాల్గొన్న బి.సి. కులాల విద్యార్థులు.
 సాధన కుటీర్ అక్రమ కూల్చివేతపై తమ విన్నపాన్ని తెలిపి, సాధన కుటీర్ ని సందర్శించి  అక్కడ జరిగిన అక్రమ కూల్చివేతలను ప్రత్యక్షంగా చూసి  కమిషన్ ద్వారా సరైన న్యాయం,సహకారం అందించవలసిందిగా తమ విన్నపాన్ని అందించి  న  జ్ఞానసరస్వతి ఫౌండేషన్ లో శిబిరాలలో  పాల్గొన్న బి.సి కులాలకు చెందిన విద్యార్థులు.

ప్రభుత్వ పాఠశాలలో చదివే తమలాంటి అనేక  మంది విద్యార్థుల నిగూడ  ప్రతిభను సరైన సమయంలో గుర్తించి ప్రోత్సహిస్తూ, చేయూత అందిస్తున్న GSF సాధన కుటీర్ ని అక్రమంగా ధ్వంసం చేయడం ద్వారా అనేక మంది గ్రామీణ ఆర్ధిక నిరుపేద విద్యార్థులకు అన్యాయo జరుగుతుంది..  తమలోని నైపుణ్యాలను శిబిరాలలో  నిష్ణాతులైన శిక్షకుల ద్వారా మెరుగుపరుచుకునే అవకాశం ఉండేది.
కావున గ్రామీణ ప్రతిభావంతులకు సరైన సమయంలో అండగా నిలుస్తున్న GSF సాధన కుటీర్ కు B.C. Commission ద్వారా సరైన న్యాయం జరగాలని అభ్యర్ధన చేశారు. స్పందిoచిన చైర్మన్ గారు త్వరలో సాధన కుటీర్ ను సందర్శించి అన్ని విషయాలు తెలుసుకుంటానని తెలిపారు.

Tuesday, May 31, 2022

Inauguration of Sadhana Village Libraries

పుస్తకాలు చదవడం దినచర్యలో ఒక భాగం కావాలి:- Ex NCERT Member, విద్యాభారతి ఉన్నత విభాగం జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ మురళి మనోహర్ గారు.

పది గ్రామాలలో GSF Sadhana Village Libraries ప్రారంభం.


జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  సాధన విలేజ్ లైబ్రరీ ల ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు వినోభానగర్ లోని సాధన కుటీర్ జరిగింది.
 ఎంపిక చేసిన పది గ్రామాలకు గ్రంథాలయ సామాగ్రి @ బుక్ రాక్స్ 2 ,  చైర్ 1 ,టేబుల్ 1 మరియు కాంపిటీటివ్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది.
 MCKS FOOD for HUNGRY FOUNDATION సహకారంతో ఈ గ్రామీణ గ్రంథాలయాల ఏర్పాటు చేయడం  జరిగింది.
 ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న యువకులకు మరియు బాలలకి ఉపయోగపడే విధంగా బాల సాహిత్యం ఈ గ్రంథాలయంలో  అందుబాటులో ఉంటాయి.
 వాటిని సద్వినియోగం చేసుకోవాలని, పుస్తకాలు కేవలం ఉద్యోగ సాధన కోసమే కాకుండా జీవితాన్ని సాధించడానికి చదవాలి, అదొక అద్భుత సాధనగా మన దినచర్యలో ఒక భాగంగా పుస్తక పఠనం చేయాలని ముఖ్యఅతిథిగా విచ్చేసిన విద్యా భారతి  ఉన్నత విభాగం జాతీయ ఉపాధ్యక్షులు, Ex NCERT Member  శ్రీ మురళి మనోహర్ గారు పాల్గొన్న గ్రంథాలయ నిర్వహకులకు తెలిపారు.
GSF వ్యవస్థాపకుడు సదా వెంకట్ మాట్లాడుతూ 2014 సంవత్సరం నుండి ఈ గ్రంథాలయాల కోసం  ఫౌండేషన్ విశేష ప్రయత్నం చేస్తుoది, ముఖ్యంగా బాల సాహిత్యంతో 2014- 15 సంవత్సరాలలో సంచార గ్రంథాలయం మరియు 5 గ్రామాలలో గ్రంథాలయాల ఏర్పాటు కూడా జరిగింది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ విడత 10 గ్రామాలలో ఉద్యోగాల ప్రయత్నంలో ఉన్న యువత కోసం మరియు బాల సాహిత్యంతో  సాధన గ్రామీణ గ్రంథాలయాలు ఏర్పాటు చేసిందన్నారు. 
 ప్రతి గ్రామంలో సుమారు 20 నుండి 40 మంది వరకు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న గ్రామాలలో, 5 గురు నిర్వహణ సభ్యులుగా( Regulatory Committee) గుర్తించి, వారినే ఈ ప్రారంభోత్సవ కార్యానికి ఆహ్వానించారు.
ఈ గ్రంథాలయ ఏర్పాటుకు
 ఒక్క గ్రామానికి సుమారు 75 వేల రూపాయల  ఖర్చుతో సామాగ్రి అందజేయడం  జరిగింది. ఆయా  గ్రామాల్లో గ్రంథాలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ గ్రంథాలయం నిర్వహించబడుతుంది.

యాచారం, మంచాల, వీరపట్నం మరియు కoదుకూరు మందళాలలోని
మొండిగౌరెల్లి,కుర్మిద్ద,మంతన్ గౌరెల్లి,
 గడ్డ మల్లయ్యగూడ, లోయపల్లి,ఆరుట్ల,మంచాల్,ఆకులమైలారం,బేగంపేట్ మరియు వినోభా నగర్ సాధన కుటీర్  గ్రామాల్లో  ఈ సాధన లిలేజ్ లైబ్రరీస్ ఏర్పాటు చేయడం జరిగింది.
 ప్రారంభోత్సవo అనంతరం గ్రంథాలయ నిర్వాహకులకు  సామాగ్రీ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్టోపస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు,MCKS FOOD for HUNGRY FOUNDATION ప్రతినిధి శాంతకుమారి,
సాధన లైబ్రరీ కోర్డినేటర్స్ డా.మహేందర్  ప్రొఫెసర్ వినయ్, శ్రీశైలం, పవన్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

:~ సదా వెంకట్, 
జ్ఞానసరస్వతి ఫౌండేషన్.

Friday, May 20, 2022

Every end brings NEW BEGINING

*Happy to organize free MEALS with LIBRARY Accommodation for 30 needy Unemployed Youth, Searching out Govt jobs at *Sadhana Kuteer* with the Support of MCKS Food for Hungry  Foundation.          GSF welcomes the needy young people who want to preference government jobs from various districts of Telangana.                  An introductory program will be set up with these members.

Every end brings a NEW BEGINING...

Thx to Nature for Valuable Support.
:~ GSF.

Saturday, May 7, 2022

GSF Alumni met Shri Vijay Sampla Hon’ble Chairman National Commission for Scheduled Castes Government of India


Today, we GSF Alumuni Students belonging to SC community have met Shri Vijay Sampla
Hon’ble Chairman National Commission for Scheduled Castes Government of India  in ITC, Hotel Kakatiya_Hyderabad and represented about the illegal and unauthorised demolition of GSF Sadhana Kuteer accommodation buildings by Ibrahimpatnam Municipal Authorities & others on 28.02.2022 without prior notice..

Further, we were threatened and terrorised to vacate campus immediately and furniture, Books and our personal belongings were thrown outside.. 

When approached Police and local administration and given complaint, no action was initiated by local administration and Police on perpetrators of crime.. 

Hence, today we GSF alumini SC students have met and requested National SC Commission chairman to direct the Administration and Police to take necessary action and do justice to us and Save GSF Sadhana Kuteer which is empowering Students from SC, ST & Backward classes..

:~ GSF Alumni

 

Friday, April 15, 2022

మలకెక్కడన్న కలుద్దాం మ్యాక్సీ

ఎవరో పంపితే వచ్చినట్టుగా సాధన కుటీర్ వచ్చిoది,  మా తరువాత వచ్చిన మాలో ఒకటిగా కలిసిపోయింది. మాతోపాటే కలిసి తినేది.. కొన్నాళ్ళు నాతో పాటే కార్యాయంలోనే పడుకునేది...దాని పరివారం పెరిగాక వాటితో ఉండేది..కొన్ని 
విష సర్పాల నుండి మమ్మల్ని జాగృతo చేసి కాపాడింది....
నల్లటి కుక్కలు చాలా అరుదు అని దానిని కుక్క అని అంటే కూడా మనసు ఒప్పుకునేది కాదు.. స్వతహాగా నా నోటితో ఎప్పుడు దానిని మ్యాక్సీ అని తప్ప కుక్క అని పిలవలే... కుటీర్ లో అందరూ అంతే.. బయటి నుండి వచ్చే చాలా మంది  సందర్శకులకు అది నేస్తమే.. గత వారం నుండి కొంత ఇబ్బంది పడి, ఈ రోజు ఉదయం డాక్టర్ ని పిలుద్దామనుకునే లోపే జీవంలేని మ్యాక్సీగా కనబడింది...అనుబంధం పెరిగితే మనుషుల కంటే జంతువులే నయం అనిపిస్తుంది. కల్మషం లేకుండా మనతో ఉంటాయి..  పోయాక  కొంత బరువుగా అనిపిస్తుంది. *చలో మల్లెక్కడన్నా కలుద్దాం మ్యాక్సీ*

Sunday, April 10, 2022

GSF SAADRI 3rd Annual Event

GSF_SAADRI 3rd annual event celebratedted at Sadhana kuteer, VinobhaNagar,IBP. 








 GSF Founder Sri Sada Venkat addressed the event and explained the aims and objectives of GSF.

 Dr.Anjali, the Gynecologist, let out the importance of quality food and personal hygiene, particularly during puberty.

Shantha Kumari, the Pranic healer, elucidated the role of Superbrain yoga in daily life and shared boosting tips for self-confidence in students.

Smt.Madhavi, the Legal practitioner, recalled the unique role of women in shaping the nation, and she added that boys and girls are equal in different entities.

The key speaker, Major Jayasudha, applauded the work done by GSF in creating a platform for untapped talents from Rural areas, and she added that everyone should be optimistic about reaching the goal

Saadri team presented the annual report and upcoming events

On this occasion, Saadri conducted some competitions like smart snack making, skits, mono action, singing, elocution, essay writing, and Yoga for the college and school-going children in various categories and distributed prizes.

And distributed sanitary napkins to students. Guests and Saadri team members are felicitated with saplings.

The parade conducted by NCC cadets at the Bharatha matha statue highlighted the program.

Nearly 150 members took part in this celebration, including eminent personalities, Saadri members, School, college students, kishories, NCC cadets, GSF team members, and volunteers.

The program concluded with Bharatha matha harathi and the national anthem, followed by delicious lunch.

Thanks to everyone who involved  in the cause

~Team SAADRI_A women wing of GSF.

Sunday, March 20, 2022

Transforming the idea of farming to the future generations

 Transforming the idea of farming to the future generations





The GSF team of volunteers in sadhana kuteer had started organic farming of vegetables(*Tomato, Brinjal, Chillies, and cucumber) from the last three months. Meanwhile, they spent daily 2hours cleaning weed plants in the garden and sadhana kuteer premises. The main intention is to create a model of make farming for the students participating in Sadhana camps.

The volunteer's efforts paid off as we were cooking our vegetables.

Sunday, March 13, 2022

Sadhana Kuteer demolition-ఏదైనా కూల్చడం తేలికే- కూర్చడమేకష్టం.

 పల్లె ఆణిముత్యాల ప్రగతికోసం సాధన కుటీర్


https://youtu.be/ACQx2mmZdxU

(pls Watch full Video's)


ఏదైనా కూల్చడం తేలికే- కూర్చడమేకష్టం.


అత్యాశతో ఆశను(గోడలను)మాత్రమే కూల్చగలరు- ఆశయాన్ని కూల్చడం బ్రహ్మ తరమూ కాదు...

ఆశయం అంతర్నిహితమైనది- అగ్ని సమానమైనది.

కొందరి అందకారాన్ని దహిస్తుంది- కొందరికి జ్ఞాన జ్యోతవుతుoది.


ఫిబ్రవరి  28వ తేదీ GSF_  సాధన కుటీర్ పై  జరిగిన కుట్రపై సమాదానాలకై..


స్వామి వివేకానంద, డా.బి.ఆర్.అంబేద్కర్ మరియు డా. అబ్దుల్ కలాoజీల ఆశయాలను కొనసాగించడం తప్పు పనా? అది అవసరమా?  లేదా అని సభ్య సమాజం ఆలోచన చేయాలి.


కొందరి  అనాలోచిత చర్యలవల్ల GSF సాధన కుటీర్ కు జరగకూడని కొంత నష్టం జరిగింది. కరోనా కారణంగా రెండేళ్లగా GSF_సాధనకుటీర్ లో  పల్లె ఆణిముత్యాల 

సాధనశిబిరాలు జరగలేదు. ఈ సమయంలో పల్లె ఆణిముత్యాల శిబిరాలకోసం అవసరమైన ఏర్పాట్ల దృష్టితో #GSF_ #సాదనకుటీర్ ని తీర్చిదిద్దే ప్రయత్నం జరిగింది. 

 అకారణంగా, దుర్మార్గంగా కొందరి మూర్కపు దుశ్చర్య వల్ల ఇంకో యాడాది శిబిరాలు ఆగితే నష్టం ఎవరికి అనేది సమాజం ఆలోచిoచాలానే ఉద్దేశ్యంతో.....

 గత 13 ఏండ్ల కాలంగా GSF ద్వారా పభుత్వ/బడుల్లో చదివే పల్లె ఆణిముత్యాల వికాసంకోసం జరిగిన పనిని జరిగినట్టుగా సమాజానికి చూపే ప్రయత్నం చేస్తున్నాం.


దీనిలో మంచి, చెడు అనేది సభ్యసమాజమే గుర్తించాలి.


*స్వామి వివేకానంద,

 డా.అంబేద్కర్ & డా. కలాంజీల కలల కోసం ఆశయ స్పూర్తితో, ఒక నిర్దిష్ట కార్యాచరణతో నిత్య చైతన్యంగా 

పల్లె ఆణిముత్యాల వికాసంకోసం జరుగుతున్న పని సమాజానికి అవసరమా లేదా అని సభ్య సమాజం నిర్ణయం చేయాలి, చేస్తుందని ఆశిస్తున్నాము*..


ఏదైనా కూల్చడం తేలికే - కూర్చడమే కష్టం.


visit @ www.gsf.org.in.

కూల్చింది గోడలే- చైతన్యాన్ని కాదు..

 



కూల్చబడ్డ పల్లె ఆణిముత్యాల  శౌచాలయాల గోడల్లోని ఇటుకలు నిండు చైతన్యంతో మరో స్ఫూర్తివంతమైన కార్యసాధనకోసం నిర్మిoచే గోడల్లోకి పోతున్నాయి....

కూల్చిన క్రమం అంతా జ్ఞాపకాలు ఇక్కడి గోడల్లో పదిలంగా దాస్తాము, మనదంటూ ఓ రోజు వచ్చాక ఆ జ్ఞాపకాలు  మల్లి అందిస్తాము అంటూ పోతున్నాయి.   ప్రతి  ఆదివారం  ఉదయం భారతమ్మకు హారతి కోసం పూసే పూల మొక్కలు ఇప్పుడు కూలిన ఆ గోడల కింద నలిగి, పైకి చూస్తుంటే వాటికి ఓదార్పుతో ఇటుకలు చెప్పిన స్ఫూర్తి మాటలవి...

కూల్చింది గోడలే- చైతన్యాన్ని కాదు..