Sunday, January 29, 2023

భారతమాత పూజా మహోత్సవం

కుటీర్ లో భారతమాత పూజా మహోత్సవం.. పాల్గొన్న శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ.

 త్యాగమూర్తులను స్మరించుకుందాం- భావితరాలకు స్ఫూర్తినందిద్దాం అనే ఆశయ స్ఫూర్తితో జ్ఞానసరస్వతి ఫౌండేషన్ శిక్షణా శిబిరాలలో పాల్గొన్న విద్యార్థులతో జనవరి 28, 2021 భారతమాత ఆవిష్కరణ జరిగింది..
 జనవరి 29న రెoడవ వార్షికోత్సవo నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 300మంది పాఠశాల విద్యార్థులతో భరతమాత పూజా  మరియు 99వ వారం హారతి జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ మాట్లాడుతూ..
దేశం కోసo అన్నీ త్యాగం చేసిన మహనీయులను మనం ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలి, వారి ఆశయాల కోసo మనం పనిచేయాలి. అది విద్యార్థి వయసులో సంకల్పం తీసుకోవాలి అన్నారు.. ఈ కార్యక్రమంలో SSC Examination Retired అధికారి శ్రీ కుమార స్వామిగారు, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, మాజీ కబడ్డీ చాంపియన్ శ్రీ దేవిక బట్నాకర్ గారు పాల్గొన్నారు. కార్యక్రమoలో పాల్గొన్న 300మంది విద్యార్థులచే సదా వెంకట్ గారు మనం ఉన్నంతంగా ఎదగడానికి ప్రపంచం కావలి, మనం ఎదిగాక ప్రపoచానికి మనం కావాలి, అందుకే ప్రపంచం మనకోసం ఎదురుచూసేలా మనం ఎదగాలి అని విద్యార్థులచే సంకల్పం చేయించారు. అనంతరం పాల్గొన్న విద్యార్థులకు Exam Pads, pens అందిoచారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వెంకటేష్, శ్రీమతి ప్రమోద, రఘు, శ్రీశైలం, సంపత్ పాల్గొన్నారు.

Monday, January 9, 2023

రాష్ట్ర స్థాయి Drop Ro Ball పోటీలు @ GSF_Sadhana Kuteer

ముగిసిన   తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్&   సీనియర్    *డ్రాప్   రోబల్  క్రీడా - పోటీలు మరియు ఎంపిక.
ఈనెల 7, 8 , తేదీలలో   *తెలంగాణ   రాష్ట్ర స్థాయి 1st  సబ్ - జూనియర్ &  సీనియర్    డ్రాప్ రోబల్ టోర్నమెంట్   ను  *ఇబ్రహీంపట్నంలోని    జ్ఞానసరస్వతి ఫౌండేషన్      సాధన కుటీర్ నిర్వహించబడ్డాయి*.
ఫౌండేషన్    వ్యవస్థాపకులు సదా  వెంకట్ రెడ్డి గారు, లయన్స్ క్లబ్ సభ్యులు     జూలూరు  వేణు గారు  ,    బుచ్చన్న  మరియు   తెలంగాణ రాష్ట్ర  డ్రాప్  రోబల్ అసోసియేషన్   కార్యదర్శి   ఎం.డి .రహమత్ లు ముఖ్య   అతిథులుగా    పాల్గొని క్రీడా పోటీలను కొబ్బరికాయ   కొట్టి ,రిబ్బన్ కట్ చేసి క్రీడలను ప్రారంభించడం  జరిగింది.
 రాష్ట్రస్థాయి  క్రీడా పోటీలకు, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి మరియు వరంగల్ జిల్లాల   నుండి  సుమారుగా 150కు పైగా  బాల-బాలికల   క్రీడాకారులు పాల్గొనడం జరిగింది.    ఈ క్రీడా పోటీలు   సింగిల్ ,  డబల్స్,   మిక్స్డ్ - డబల్,    సూపర్ - ఈవెంట్   విభాగాలలో    *ఉత్తమ   ప్రతిభ   కనబరిచిన క్రీడాకారులను    జాతీయస్థాయికి ఎంపిక చేయడం జరిగినది* .     బాలురు -విభాగములో ఫైనల్   కు చేరిన   రంగారెడ్డి జిల్లా   వర్సెస్ హైదరాబాద్  జిల్లాలు  తలపడగా ,  *రంగారెడ్డి జిల్లా మొదటి     స్థానంలో*, హైదరాబాద్ జిల్లా,రెండవ   స్థానంలో    నిలిచాయి.   అలాగే   *బాలికల  -విభాగంలో   ఫైనల్   కు  చేరిన   వరంగల్    వర్సెస్   రంగారెడ్డి   జిల్లాలు   తలపడగగా  , మొదటి   స్థానంలో   రంగారెడ్డి జిల్లా*,   రెండవ స్థానంలో    వరంగల్ జిల్లా   నిలిచాయి  .  
   అలాగే   *ఓవరాల్   ఛాంపియన్షిప్ గా    రంగారెడ్డి జిల్లా ట్రోఫీ  ని    కైవసం  చేసుకోవడం   జరిగింది.*
  జ్ఞానసరస్వతి   ఫౌండేషన్   వ్యవస్థాపకులు  శ్రీ సదా  వెంకట్ రెడ్డి గారు    క్రీడాకారులను ఉద్దేశించి   మాట్లాడుతూ, క్రీడలు   విద్యార్థులకు ఎంతో     అవసరం అని తెలిపారు.  అలాగే   క్రీడల  ద్వారా రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చే అవకాశం దక్కుడoతో పాటు వ్యక్తిగత శారీరక పరిపుష్టి క్రీడాకారుల పట్ల స్నేహ బావం, సోదర బావం పెంపొoదుతుందన్నారు. అన్ని పాఠశాలలో ఆటలను తప్పని సరి చేసి పర్యవేక్షణ చేసినాలసిన అవసరం ఉందన్నారు.
డ్రాప్ బాల్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో మంచి వసతి, భోజన ఏర్పాట్లు చేసిన GSF కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డ్రాప్ బాల్ అసోషియేషన్ టెక్నీకల్ ఎం.ఢీ. అక్బర్ బాబా మరియు హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ హరీష్, రాంగారెడ్డి జిల్లా ఇంచ్చార్జ్ ప్రభాకర్, వరంగల్ జిల్లా ఇంచార్జ్ రవికుమార్ మరియు టోర్నమెంట్ పీ ఈ టి లు సతీష్, అనూష, బాలమణి, కళ్యాణ్, శ్రీను, స్వప్న, నర్మిని, సులోచన, బాబీ, సంతోష్ ల్, కాశీరాo, శ్రీకాoత్ మరియు GSF సభ్యులు పవన్, సురేష్, శ్రీశైలం పాల్గొన్నారు.

Friday, January 6, 2023

DROP ro BALL Selections @ Sadhana Kuteer.

Drop ro Ball.
ఈ ప్రాంతంలో ప్రారంభోత్సవానికి వేదికైన సాధన కుటీర్.
అనుకోకుండా, అత్యవసర పరిస్థితులలో  ఆతిథ్యం ఇవ్వాల్సి రావడం కొంత ఇబ్బందే అయినా కూడా మంచి అవకాశమే.
అంతర్జాతీయ క్రీడనే అయినా ఈ ప్రాంతానికి పూర్తిగా కొత్త..
జాతీయ స్థాయి పోటీలకు గాను రంగారెడ్డి జిల్లా జట్టు కోసం విద్యార్థుల ఎంపిక సాధన కుటీర్  క్రీడా ప్రాంగణంలో జరుగుతుంది. వివిధ స్థలాల నుండి పాల్గొన్న ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలలు.
విద్యార్థులకు, ఆయా పాఠశాలల విద్యార్థులకు GSF తరపున శుభాభినందనలు💐, శుభాకాంక్షలు.      *https://youtu.be/q0zx3ExEOfo*
:~ GSF