Sunday, April 30, 2023

పల్లె ఆణిముత్యం @ పెయింటింగ్

#పల్లెఆణిముత్యo_మన సాయి కుంచె నుండి మరో అద్బుత చిత్రం*..
#సాధనకుటీర్ #అన్నపూర్ణమండపం లో అన్నపూర్ణమ్మ చిత్రం...
ఎంతో మంది పల్లె ఆణిముత్యాల #ప్రతిభ ప్రపంచానికి చాటడానికి జరిగే ప్రయత్నంలో అవదుల్లేని నిరంతర అన్న ప్రసాదం అన్నపూర్ణమ్మ చలవే*...
*గత సంవత్సరం లాక్ డౌన్ సమయంలో మొదలైన #సాధనకుటీర్ సుందరీకరణ పనులలో అనేక చిత్రాలతో అద్బుత కళాకండాలను అందించిన సాయి & టీం ఇప్పటికీ అదే ప్రయత్నంలో ఉన్నది. *ఈ అన్నపూర్ణమ్మ చిత్రంతో పాటు #సాధనకుటీర్ లోని కొన్ని వృక్షాలలో మన #దేశభక్తులచిత్రాలను గీసి, వారి జ్ఞాపకాలను మనకు అందించే పనిలో సాయి & బృందం. శుభం.. #శుభాకాంక్షలు💐💐.... 

#RuralGenius  #RuralTalent
Painting
#GSF_SadhanaKuteer.

Saturday, April 29, 2023

సాధన గ్రంథాలయం @ సాధన కుటీర్

INAUGURATION of
Sadhana #LIBRARY @ #SadhanaKuteer.
On 29.04.2019
కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.
సాహిత్య భాండాగారం, ఉపన్యాస ఘనాపాఠి, గొప్ప వ్యాఖ్యాత..
ఎందరో మంచి మంచి ఉపన్యాసకులకు ప్రేరణ..
అనేక ధార్మిక, సామాజిక, చారిత్రక పుస్తకాల రచయిత.... 
తాను రాసిన సాహిత్యంపైననే చాలా మంది Phd చెస్తున్నారు. అయినా.. ఇతరుల పట్ల ఇసుమంత కూడా చిన్నచూపు చూపని విశాల హృదయులు ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి గారు.
అనేక ధార్మిక ఉపన్యాసాల ద్వారా సమాజలో చైతన్యం నింపుతున్న చైతన్య శిఖరం...
కళాశాల, విశ్వవిద్యాలయాల స్థాయిలో బోదన ద్వారా అనేక మందికి మార్గదర్శకులై ఉండి కూడా 10 వ తరగతి లోపు విద్యార్థులకూ అంతే ఆసక్తితో, ఉత్సాహంగా బోదన చేశారు.
జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ నిర్వహిస్తున్న సాధన శిబిరం సందర్శిoచి, విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస అంశాలలో అనేక మెలుకువలు తెలిపారు.
కసిరెడ్డి గారి చేతులమీదుగా సాధన కుటీర్ లో చిన్న గ్రంథాలయాన్ని ప్రారంభం చేసుకోవడం జ్ఞానసరస్వతి ఫౌండేషన్ సబ్యులకు ఆనందదాయకం. కసిరెడ్డి గారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.
గ్రంథాలయ ఏర్పాటుకు సహకరించిన మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు.
::~Team GSF

Thursday, April 27, 2023

Sadhana Camp- 2018

#SADHANACAMP Students enjoying with  #YOGA Under guidance of Sri.Ramesh Guruji_Sahaja Ananda Yoga Say...
@  #GSF #SADHANAKUTEER, VinobhaNagar, IBRAHIMPATNAM.
#PalleAaniMutyalu frm #GovtSchools.

Monday, April 24, 2023

SADHANA CAMP _ 2019

FB Reminder of 24.04.2019.


Day 7/21_90 @ 24.04.2019
#SadhanaCamp for #RuralGenius

@ #GSF #SADHANAKUTEER
పల్లె ఆణిముత్యాలు.
ప్రతిభను గుర్తించి ప్రొత్సహిస్తే  అద్బుతాలు సృష్టించగల ఆణిముత్యాలు పల్లెల్లో ఉన్నారు.
 వారి ప్రతిభ అరణ్య రోదనలా, సంద్రంపై కురిసిన వానలా కాకూడదు. సరైన సమయంలో గుర్తించి ప్రోత్సహించి అండగా ఉంటే రేపటి సమాజానికి కరదీపకలవుతారు. వారికి అండగా ఉండడం మన సామాజిక భాద్యత.  100 మందికి ఒకేసారి సహాయ పడలేక పోవచ్చు. సరైన సమయంలో, అవుసరం కోసం ఒక్కరికి అండగా ఉన్నా చాలు. అలాంటి ప్రయత్నంలో జ్ఞానసరస్వతి ఫౌండేషన్ కొంతవరకు కొనసాగుతుంది. .
ప్రతిభను గుర్తిద్దాం_ప్రతిభావంతులకు చేయూతనిద్దాం.
ఎంపిక చేసిన పల్లె ఆణిముత్యాల కోసం  సాధన శిబిరం. 

NGOs Meet for a CAUSE

FB post of 24.04.2017
Participated on behalf of Gnana Saraswathi FOUNDATION at  #ENVIRONMENT SUSTAINABLE DEVELOPMENT SEMINAR @ KUNTLUR. Eminent personalities & Various Orgs particptd in the seminar. Thx to Organizers #Initiation _ CGR team_ Prof. purushotham Reddy garu, Dileep Reddy garu (Ex RTI Commissioner). congrats to Participants_ #Innovative Movement.
_________________________________
సమాజాహితం కోసం  నిజాయితీగా వెచ్చించిన ప్రతీ క్షణం, ప్రతీ పైసా గుణించదగ్గదే.. కాస్త ఆలస్యమైనా వాటి ఫలితాలు ఖచ్చితంగా సమాజానికి అందుతాయి.  SALUTE to VOLUNTERY.      Every Second and every paisa is so valuable  & countable which was spent honestly for Society. the fruits of that work vl b returned on right time in different ways... SURELY

Sunday, April 23, 2023

బాల్యమురా -అమూల్యమురా @నాగరాజు

SadhanaCamp Students enjoyed with Music @ Folk Songs.
by NAGARJU garu Famous Lyric Writter & Singer. 
Fame of బాల్యమురా అమూల్యమురా.. తిరిగి చెరలేని తీరమురా..
బాల్యమురా అమూల్యమురా... తిరిగి చేరలేనీ తీరమురా..అంటూ అందరి బాల్యాన్ని జ్ఞాపకం చేసేలా పాటతో అలరించిన నాగరాజు గారు కరీంనగర్ నుండి పల్లెఆణిముత్యాల కోసం సాధనకుటీర్ కి వచ్చారు..
 నాకుగేండ్ల క్రితం రోజుకు 5సార్లయినా మీడియా ద్వారా విన్నపాట అది. ప్రత్యక్షంగా వినడం గొప్ప అనుభూతి.

సుమారు 4 గంటల పాటు, తను రాసిన అన్ని పాటలను  శిబిరానికి పరిచయంతో విద్యార్థుల తన్మయత్వం.. 
సర్టిఫికేట్ల కోసం చదివిన చదువు తక్కువే అయినా, సమాజాన్ని, సామాజిక అవసరాలను అసాంతం చదివిన మనిషే. రాత్రి 2 గంటల వరకు జరిగిన చర్చల ద్వారా నేను తెలుసుకున్న విషయం అది.
ఒక సాహిత్య అభిలాషి.. అంతకుమించి ఓ పుస్తకపఠకదారి.

గ్రందాలేం రాయకపోయినా, రాసిన అన్నీ పదాలు, పంక్తులూ పండితులకు, పామరులకూ సులభంగా తలకెక్కేలా ఉన్నాయి..  తన బతుకుకోసం పానలు, పట్కారాలు పట్టినా... సమాజ చైతన్యంకోసం అక్షరమూటలను భుజానెత్తుకున్న సాహసి... ఓ సాదా'రణ" సాహిత్య పిపాసి. 
అన్ని పరిస్తితులకు తగ్గట్టు అలవోకగా అక్షరాల కూర్పు చేసి,  పదునైన మాటలతో పసందుగా పాటలు పాడే నాగరాజు గారు సాధన శిబిర విద్యార్థులకోసం రావడం, పాడటం..... మల్లీ వస్తాననటం అందరికీ గొప్ప అనుభూతే.

అందరి ఆశీస్సులు మెండుగా అంది సాహిత్య చైతన్యంతో సమాజానికి ఇంకా ఉపయోగపడాలని ఆశిద్దాం..

Saturday, April 22, 2023

Sadhana Camp - 2019


Facebook Post of 22.04.2019
Inauguration of GSF
 SADHANA CAMP for RURAL GENIUS @ SADHANA KUTEER
–జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పల్లె ఆణిముత్యాలకు శిక్షణా శిభిరం.
– మన  చదువు,మన కళ  నలుగురికి ఉపయోగపడాలి– స్టేట్​ రీసోర్స్ సెంటర్ , డైరక్టర్​   డాక్టర్​ బండి సాయన్న

–ఉన్నత లక్ష్యాన్ని ఎన్నుకోవాలి– యువ సామాజిక కార్యకర్త శ్రావ్యా రెడ్డి
మన చదువు నలుగురికి ఉపయోగపడాలని స్టేట్​ రీసోర్స్ సెంటర్ , డైరక్టర్​   డాక్టర్​ బండి సాయన్న తెలిపారు.  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వినోభానగర్​లోని జ్ఞానసరస్వతి ఫౌండేషన్_ #GSF  సాధన కుటీర్ లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎంపికచేసిన 150 మంది విద్యార్థులకు పల్లె ఆణిముత్యాలకు సాధన శిబిరం పేరుతో 21 రోజుల శిక్షణను ఇవ్వడం జరుగుతోంది. మొత్తం 90 రోజుల శిక్షణలో మొదటి విడత 21రోజుల శిక్షణ.
ఈ శిక్షణ కార్యక్రమంలో  బాగంగా జ్ఞానసరస్వతి ఫౌండేషన్ విద్యార్థులకు  #చిత్రలేఖనం #PAINTING యోగ #YOGA పాటలు #SINGING, ఉపన్యాసం #SPEECH ,వ్యాసరచన #EssayWritting అంశాలలో  నిష్ణాతులచే శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. 
ఆదివారం పల్లె ఆణిముత్యాల శిక్షణ శిభిరానికి ముఖ్య​అతిధులుగా స్టేట్​ రీసోర్స్ సెంటర్ , డైరక్టర్​  డాక్టర్​ బండి సాయన్న, యువ సామాజిక కార్యకర్త శ్రావ్యా రెడ్డి లు హాజరై విద్యార్థులతో ముచ్చటించారు.
    Dr. బండి సాయన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎంత కష్టంలో ఉన్నా కష్టాన్ని నమ్ముకుంటే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చున్నారు. ప్రతి ఒక్కరూ ముళ్లబాటలోనే పూలవనానికి చేరుకోవచ్చున్నారు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కళ దాగి ఉంటుందన్నారు. తెలుగుబాష ఎంతో గొప్పదని తెలిపారు. మనం ఎంతచదివినా మన చదువు నలుగురికి ఉపయోగపడాలని తెలిపారు.- వేసవి సెలవుల్లో ఎన్నో విషయాలు నేర్చికోవచ్చు.. అందుకోసం  ఇలాంటి మంచి కార్యక్రమాలు  అవసరమన్నారు. ఈ చక్కని అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
 ----యువ సామాజిక కార్యకర్త శ్రావ్యా రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏంచుకోవాలన్నారు. అన్యాయాన్ని ఎవరైతే ఎదుర్కొంటారో వారే ధైర్యవంతులన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే స్వచ్చభారత్​ కార్యక్రమం లాంటివి అవసరం ఉండదన్నారు. ప్రభుత్వ పాఠశాలల విధ్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఈ క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వరియోగం చేసుకోవాలని సూచించారు. జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సదావెంకటరెడ్డి మాట్లాడుతూ ----పల్లె ఆణిముత్యాల ప్రతిభ ప్రపంచానికి చాటడం కోసమే ఈ కార్యక్రమని తెలిపారు. పల్లెబడుల విద్యార్థుల ప్రతిభకు సరియైన శిక్షణ,ప్రోత్సాహాన్ని అందించే కార్యశాలలు లేక వారి ప్రతిభ ప్రపంచానికి పరిచయం కావడం లేదన్నారు. పల్లెబడుల విద్యార్థుల్లో ఏంతో ప్రతిభ దాగిఉందన్నారు. కేవలం సానెపట్టే కార్యక్రమాన్ని మాత్రమే ఫౌండేషన్​ చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న సహృదయులందరికీ, శిక్షకులు, నిస్వార్థంగా పనిచేస్తున్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
 కార్యక్రమంలో #సాధన శిబిర నిర్వహణలో  A A A_ విభాగాల ఇంఛార్జీలు  దామోదర్​,నరేష్​,శ్రీశైలం సాద్రి ఇంచార్జ్ ప్రమోద మరియు ఆయా అంశాల శిక్షకులు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

Wednesday, April 19, 2023

Singer KARUNYA @ RG Camp

జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పల్లె ఆణిముత్యాల ప్రగతికోసం సాధన శిబిరం ప్రారంభం.

Post of 19.04.2018

రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం(వినోభ నగర్) జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాసం, వ్యాసరచన యోగ, పాటలు పాడుట మొదలగు వాటిలో నిష్ణాతులైన బోధకులచే నిర్వహించే 15 రోజుల ప్రత్యేక శిక్షణ శిబిరం ఈ రోజు ప్రారంభమయింది. ఈ సాధన శిబిరంలో పాల్గొన్న ఇండియన్ ఐడల్ ప్రముఖ గాయకుడు కారుణ్య, విశ్రాంత ఐఏఎస్ మరియు అవేర్ సంస్థల చైర్మన్ పూజ్యశ్రీ మాధవంజి,గాంధీ గ్లోబల్ ఫామిలీ రాష్ట్ర కార్యదర్శి పురుషోత్తం రెడ్డి , విద్యావేత్త ప్రదీప్ రెడ్డి, శ్లోక విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సదా వెంకట్ రెడ్డి, సభ్యులు వెంకటేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజ్యశ్రీ మాధవంజి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకూ చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతోగొప్పదని కొనియాడారు. ఈ విద్యార్థుల ప్రతిభ ఆమోగమని తెలిపారు. ప్రభుత్వ బడుల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని, ఈ శిక్షణా శిబిరంలో శ్రద్ధగా వింటూ వివిధ అంచెలంచెలుగా విద్యార్థులు ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రముఖ గాయకుడు కారుణ్య మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు aఅన్ని రంగాల్లో రాణించే విధంగా తోడ్పాటు అవసరమని అదే తోడ్పాటు జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ అందించడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఏంతో మంది విద్యార్థులు పాటలు పాడటం లాంటి ఇతర రంగాల్లో రాణించడనికి ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సదా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పల్లె బడుల్లో ఆణిముత్యాల్లాంటి విద్యార్థులు ఉన్నారని ఎలాంటి పేదరికం వారికి అడ్డురాకుండా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమం ఈ ఫౌండేషన్ చేస్తోందని తెలిపారు.
Start the camp for the development of village riots under the guidance of Jnana Saraswati Foundation
The 15 day special training camp was opened today by Ranga Reddy District Ibrahimatnam (Vinobha Nagar) Gnana Saraswati Foundation for painting, lecture, essaying yoga and singing for public school students. The Indian Idol is the leading singer of the Indian Idol and Composite IAS and Aware Companies Pujyasri Madhavaji, Gandhi Global Family Secretary purushottham Reddy, educationalist Pradeep Reddy, SLOKA Educational Institution Director Srinivas Reddy, Gnana Saraswati Foundation Founders Sada Venkat Reddy, Members Venkatesh, Teachers, students etc participated. Speaking on this occasion, Pujyasri Madhavanji said that this program is specially organized for the students of rural areas of the public schools. These students' talents are acceptable. The program is being organized for the public school students and it is said that the students will be able to help the students in different stages of listening carefully at this training camp. The famous singer is compassionate, saying that the scholarship in the field of education, along with education, is needed to support the Gnana Saraswati Foundation. It is said that this program is useful for performing excellence in other areas such as singing songs. The founder of the Gnana Saraswati Foundation, Sada Venkat Reddy, said that the foundation is going on to promote students' talent in government schools without any poverty allegation that there are students like Auntu in the villages.

Book Reading Technics. @RG Camp

#SadhanaCamp fr Rural Genius @ #Sadhana Kuteer.
19.04.2019.
Day 2/21..
 A session on Book Reading.
Simple Technics on Book Reading.
* Why to read a book
*How to read a book
* How we shd create  interest among book reading... etc.

సాధన శిబిరంలో *పుస్తక పఠనం పై మెలకువలు*..

** పుస్తకం ఎందుకు చదవాలి
** ఎలాంటి పుస్తకాలు చదవాలి
** చదివే పుస్తకం, ఏ విధంగా చదవాలి, చదివిన విషయాన్ని ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి అనే దానిపై మెలుకువలు.
Great efforts by team GSF & Faculty

Tuesday, April 18, 2023

SADHANA CAMP for RURAL GENIUS

Facebook Reminder of 18.04.2018

    #GSF_50 #RURALGENIUS
Started the  SADHANA CAMP for RURAL GENIUS Students frm Govt.Schools in #SINGING #PAINTING #YOGA #SPEECH #EssayWritting
@ #GSF_  #SADHANAKUTEER
#GSF Conducts a #90daysResidentialCampsDay 1/21 of 90:

    #GSF_50 #RURALGENIUS
Started the #SADHANACAMP for #RURALGENIUS Students frm Govt.Schools in #SINGING #PAINTING #YOGA #SPEECH #EssayWritting
@ #GSF_ #SADHANAKUTEER

#GSF Conducts a #90daysResidentialCamps spread Over two years, where in the selected students has to Spend 45 days in each year which divided in to 4 to 6 Spells including monthly camps usually centered during school vacation. 
Selected students are trained under the Supervision of experts in each of the respective Fields to Polish the Stones into Diamonds. 
Basic course in English & Games will also be taught to all the participants. 

SPELL 1 for 21Days r Started

Congratulations to Team #GSF for Efforts.
Thanks to All our #Supporters & Faculty.

Support the #RuralTalent

 #PalleAaniMutyalu
ప్రతిభను గుర్తిద్దాం_ ప్రతిభావంతులకు చేయూతనిద్దాం

పల్లె ఆణిముత్యాల ప్రతిభను ప్రపంచానికి చాటుదాం. spread Over two years, where in the selected students has to Spend 45 days in each year which divided in to 4 to 6 Spells including monthly camps usually centered during school vacation. 
Selected students are trained under the Supervision of experts in each of the respective Fields to Polish the Stones into Diamonds. 
Basic course in English & Games  will also be  taught to all the participants. 
SPELL 1 for 21Days r Started

Congratulations to Team #GSF for Efforts.
Thanks to All our #Supporters & Faculty.

Support the #RuralTalent

 #PalleAaniMutyalu

ప్రతిభను గుర్తిద్దాం_ ప్రతిభావంతులకు చేయూతనిద్దాం

పల్లె ఆణిముత్యాల ప్రతిభను ప్రపంచానికి చాటుదాం.