Thursday, November 24, 2022

పోత నీరు లేని పొప్పడి

చుక్క పోత నీరు లేకుండా పెరిగి, కాయలు కాస్తున్న పొప్పడి..
 ఆ మధ్య కురిసిన వర్షపు నీటినే ఏ మూలన దాచుకున్నదో పాపం..   కావాల్సిన నీరు అందకున్న తన ధర్మాన్ని పూర్తిగా నిర్వర్తిస్తున్నది.. కొన్ని అంతే... ఎవరు పట్టించుకున్నా, పట్టించుకోకున్నా తమ పనిలో తాము తనమునకలైపోవడమే ఉంటుంది.

పని పట్ల శ్రద్ద అవసరం


ప్రకృతికి ఎప్పటికీ ఋణపడే ఉండాలి.ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన పనికి కావాల్సిన ఉపకారణాలను తాను సమకూర్చుకుంటూనే ఉంటుంది.
 ఆ ఉపకరణం మనమే అయితే అద్భుతం,మహా అదృష్టం.
ఎవరు ఉన్నా, లేకున్నా నమ్మిన పని కోసం చిట్ట చివరి వరకు మనం అడుగులు వేస్తె, ఆ పని కోసం ఎప్పుడు ఎవరిని కలపాలో, ఎవరిని జరపాలో ఆ ప్రకృతి చూసుకుంటుoదనే మాట అక్షర సత్యం.

స్థలము పాతదే, మొక్కలూ పాతవే.. కాకుంటే కొంత శ్రద్ద చూపడం అంతే...
దానికే ఎంత మార్పు. పూర్తిగా నాశనం అయినాయి అనుకున్న మొక్కలు మళ్ళీ చిగురిస్తే, వాటి సంరక్షణ పట్ల కొద్దిగా శ్రద్దచూపి చుట్టూత ఉన్న కలుపును తీసి, పాదులు తీసి, నీరు పోస్తుంటే మల్లీ కాశ్మీరి గులాబీ వనం తయ్యార్, రోడ్డుతా క్రోటాన్ @ సాధన కుటిర్..
సాధకుల శ్రద్దకు జోహార్లు.
:~సదా వెంకట్.

Sunday, November 6, 2022

GSF Saadri - కనుపాపలను కాపాడుకుందాం @Model School Arutla

*కనుపాపలను కాపాడుకుందాం*
-SHE Sessions for GIRLS.

జ్ఞానసరస్వతి ఫౌండేషన్ మహిళా విభాగం_ SAADRI( achiever) ద్వారా 05.11.22, శనివారం రోజున *ఆరుట్ల మోడల్ స్కూల్ లో* 
*SHE awareness sessions నిర్వహించింది.*
 *ప్రముఖ సైకాలజిస్ట్, NLP practitioner, educational counceller , శ్రీ దీప్తి కౌన్సిలింగ్ సెంటర్ వ్యవస్థాపకురాలు prof. జ్యోతి రాజ్* గారు కనుపాపలను కాపాడుకుందాం అంటూ 300 మంది బాలికలకు (6 th intermediate) *girl child Abuse పై  awareness sessions నిర్వహించారు*.
బాలికలు వారి సమస్యలను జ్యోతి రాజ్ గారితో పంచుకుని సలహాలు తీసుకున్నారు.
 SAADRI incharge శ్రీమతి ప్రమోద గారు, SAADRI advisary committe member శ్రీమతి కృష్ణవేణి గారు 200 బాలురకు (6th to inter) లింగ వివక్షత పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పిల్లలచే లింగ వివక్షతకు సంబంధించి రకరకాల activities ని చేయించారు.ఈ కార్యక్రమంలో సాద్రి సభ్యులు శ్రీమతి సంధ్య,శ్రీమతి మాధవి,  పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా *ప్రిన్సిపల్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ బాలికల్లో ఆత్మవిశ్వాసం, సమాజం పట్ల బాధ్యత, సమస్యలు వాటి పరిష్కార మార్గాల పట్ల ఆలోచనలు ఇలాంటి awareness sessions నిర్వహించడం తప్పనిసరని అన్నారు*.

కార్యక్రమoలో భాగంగా *బాలురచే లింగ సమానత్వం కోసం ప్రతిజ్ఞ చేయించారు*.
విద్యార్థులకు మార్గదర్శనం చేసిన శ్రీమతి జ్యోతి రాజ్ గారికి GSF_SAADRI తరపున ప్రత్యేక ధన్యవాదాలు.

మంచి సమన్వయoతో  విద్యార్థులకు అవసరమైన SHE sessions కోసం సహకరించిన పాఠశాల యాజమాన్యానికి శుభాభినందనలు.

:~ Team SAADRI