Saturday, December 31, 2022

#SAADRI's SHE Sessions

GSF SAADRI's SHE Sessions on 30/12/22 at Manchal mandal of Two Govt.Schools.
Awareness session on Girl Child Abuse
at ZPHS Lingampally  by Smt.Haritha,   Gender equality session by Smt.Sandya, 
Girl child abuse session at ZPHS Bodakonda* by Smt.Pramodha.
Smt .Sandhya,
Smt.Rajeswari of *SAADRI members* participated in the session.
Thanx for the  coordination of   Sri.Seetharamulu  Nayak garu HM  (Bodakonda) Sri.Bhaskar Reddy garu  HM ( Lingampally).
Thanks to GSF SAADRI SHE Team and Special thanks to Mr.Ramesh for co ordination.
*Team SAADRI_A women Wing of GSF*

Thursday, December 29, 2022

Successfully completed tournament cum selections of sadhana sports academy

Successfully Completed Tournament cum Selections of Sadhana Sports Academy
TTWRS Team-1,Team-2 and ZPHS Nandhiwanaparthy secured 1st, 2nd and 3rd places respectively. Out of 150 students, 30 were selected for the Sadhana Residential Camp.

In the tournament cum selection process, which was held for two days, 75 students each were selected out of 120 students from #KABADDI and #VOLLEYBALL at the Rangareddy District level, which has been divided into three zones as said by #SadaVenkat, the Founder and Managing Trustee of GSF. The experts will provide the selected students Training in their Respective Fields during the vacation.





And also added that such tournaments and training camps will help bring up the HIDDEN TALENT of Rural Genius and encourage it further. the students felt grateful for the efforts put in by GSF and supported Physical Education teachers.

Wednesday, December 28, 2022

GSF_SAC Sports _Volleyball Selection

*
ప్రతిభను గుర్తిద్దాం -ప్రతిభవoతులకు చేయూతనిద్దాం* అనే ఆశయ స్పూర్తితో..

కేవలం ఆర్ధిక బీదరికం కారణంగా విద్యార్థులు తమ ప్రతిభను కోల్పోరాదు, అలాంటి వారికి సమాజం అండగా నిలబడాలనే సామాజిక బాధ్యతతో 
పల్లెల్లోని ఆర్ధిక నిరుపేద ప్రతిభావoతులను వారికి అభిరుచి ఉన్న అంశంలో గుర్తిoచి ప్రోత్సహించాలనే సదాశయంతో *జ్ఞానసరస్వతి ఫౌండేషన్ SAC-(Sports, Academics, Cultural) కార్యక్రమం యోజన చేసింది.
అందులో భాగంగా ఎంపిక చేసిన విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి, ఆయా అంశాలలో  నిష్ణాతులచే శిక్షణ ఇవ్వాలని GSF సంకల్పిoచిoది.

SAC- Sportsలో భాగంగా క్రీడాకారుల ఎంపిక:
మొదటి విడతగా రంగారెడ్డి జిల్లాస్థాయిలో వాలీబాల్, కబడ్డి ఆటలలో క్రీడాకారులను గుర్తిస్తున్నది.
Event3  ఇబ్రహీంపట్నం జోన్ లోని హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, మంచాల & యాచారం మండలాల ప్రభుత్వ బడుల విద్యార్థులకు టోర్నమెంట్ cum సెలక్షన్ డిసెంబర్ 28 & 29 తేదీలలో, వినోబా నగర్ లోని సాధన కుటీర్ లో నిర్వహిస్తున్నది.
28వ తేది జరిగిన ప్రారంబోత్సవ కార్యక్రమంలో 
గౌరవ అతిథులుగా తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు శ్రీ రాఘవరెడ్డి గారు,
రంగారెడ్డి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘo అధ్యక్షులు శ్రీ బాస్కర్ రెడ్డి గారు, సంఘం కోశాధికారి శ్రీ వెంకటేష్ గారు పాల్గొన్నారు.
ప్రారంభ ఉత్సవానికి 16పాఠశాలల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పోటీలతో పాటు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేశారు. రేపటితో IBP Zone ఎంపిక పూర్తవుతుoది..
రoగారెడ్డి జిల్లాను 3జోన్ లు విభజించి ఎంపిక చేసిన విద్యార్థులో 
వాలీబాల్ నుండి 75 మరియు కబడ్డి నుండి 75 మంది విద్యార్థులను శిబిరాల కోసం ఎంపిక చేస్తారు.
ఈ ఎంపిక కార్యక్రమానికి  శంకర్, వెంకటేష్, జిలాని, కుమార్ PET ల బృందo నిర్వహణ బాధ్యత వహిస్తున్నది.

Wednesday, December 21, 2022

SHE Sessions by SAADRI


GSF_SAADRI Conducted SHE Sessions fr GIRL Students of Govt Schools @Manchal mandal  on 21.12.2022.

Awareness session on Girl Child Abuse at ZPHS Rangapur & Gender equality session at ZPHS Loyapally by Smt.Pramodha, Girl child abuse  by Smt Sandhya ,Smt.Karua. Health & Hygiene session by *Smt Soujanya, Girl safety  session by Smt.Arunasri, Kumari.Saritha at ZPHS Japal.
Thanx for the  coordination of Smt.Vimala garu HM ( Rangapur), Sri.Francis garu HM (Loyapally)& Sri.Jayanandu garu HM ( Japal)*
Thanks to GSF SAADRI SHE Team and Special thanks to Mr.Bhupal for
co-ordination.
Team SAADRI_A Women Wing of GSF.

Saturday, December 17, 2022

Hyderabad Runners Society visited Sadhana Kuteer


పల్లె ఆణిముత్యాల ప్రతిభను ప్రపంచానికి చాటాలనుకున్న సదాశయానికి ప్రకృతి అన్ని వేళలా అండగా నిలస్తున్నదనేది నిశ్చయం.
సాధన కుటీర్ సందర్సించిన హైదరాబాద్ రన్నర్స్ సొసైటి 
 ప్రతినిధులు.
ఫలితాలు ఆశాజనకoగా ఉంటాయని ఆశిద్దాం.
**********************
Nature is always standing by the heart of the Rural Genius (Palle Aanimutyalu) who want to show their talents to the world. Representativs of Hyderabad Runners Society visited Sadhana Kuteer
 . Let's hope the results are promising.

Tuesday, December 13, 2022

GSF Rural Genius 2023 Poster released by Sri Chukka Ramaiah Garu


GSF_RURAL GENIUS-2023
ప్రముఖ విద్యావేత్త,  మాజీ MLC శ్రీ చుక్కా రామయ్య ద్వారా పోస్టర్ ఆవిష్కరణ.

••పల్లెల్లోని ఆర్ధిక నిరుపేద విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సాహంచే కార్యక్రమం.

**SAC (Sports, Academics & Cultural) ద్వారా 12అంశాలలో, 6నుండి 9వ తరగతుల నుండి 900మంది విద్యార్థులను ఎంపిక చేసి, సాధన శిబిరాలలో నిష్ణాతులచే శిక్షణ అందిస్తారు.

**ఎంపికైన విద్యార్థులకు వివిధ స్థలాలలో, అనుకూల సమయంలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు.

**ఆర్ధిక నిరుపేదల ప్రతిభ సమాజపు ఆస్తి, సరైన సమయంలో చేయూతనిచ్చి, వారి ప్రతిభను సమాజానికి చాటడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
 రంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమ నిర్వహణ.


"ప్రతిభను గుర్తిద్ధాం_ ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూతనిద్దాం "అనే సదాశయంతో పల్లెల్లోని ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల నిగూఢ ప్రతిభను గుర్తించి వారిని పల్లె ఆణిముత్యాలుగా సమాజానికి అందిoచాలని
 GSF_SAC అనే కార్యక్రమాన్ని రూపొందిoచిoది.
SAC_Sports, Academics & Cultural అనే మూడు ముఖ్య విభాగాలలో 12అంశాలను గుర్తించి, ఆయా అంశాలలో విద్యార్థికి అభిరుచి ఉండి ప్రతిభ కనబరచిన ఆర్ధిక బీద విద్యార్థులను గుర్తించి నిష్ణాతులైన శిక్షకులచే శిబిరాల ద్వారా శిక్షణ అందిస్తున్నది.

2015 ప్రారంభమైన ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతున్నది. కరోనా కారణంగా రెండు సంవత్సరాలు జరగలేదు.
*2023 సoవత్సర శిబిరాల కోసం జిల్లా స్థాయిలో ఈ డిసెంబర్/జనవరి మాసాలలో విద్యార్థుల ఎంపిక జరుగుతుంది.
ఎంపిక జరిగిన విద్యార్థును పల్లె ఆణిముత్యాలుగా గుర్తించి వివిధ స్థలాల్లో, అనుకూల సమయంలో శిబిరాలు నిర్వహించి నిష్ణాతులచే శిక్షణ అందిస్తారు.

Rural GENIUS-2023  పోస్టర్  ప్రముఖ విద్యావేత్త, మాజీ MLC శ్రీ చుక్కా రామయ్య గారిచే ఆవిష్కరణ చేసి, వారి ఆశీస్సులు తీసుకున్న GSF సభ్యులు.

పల్లె బడుల్లో చదివే నిరుపేద విద్యార్థుల నిగూడ ప్రతిభను అన్ని అంశాలలో గుర్తించి ప్రోత్సాహించి సమాజానికి అందిoచే GSF ప్రభుత్వం అభినందనీయo. 2014 సంవత్సరం నుండి నేను ప్రత్యక్షంగా వీరి కార్యక్రమాలలో పాల్గొన్నాను.. అవసరమైన మేరకు సమాజం ఇలాంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని చుక్కా రామయ్య గారు అన్నారు.

GSF వ్యవస్థాపకులు శ్రీ సదా వెంకట్ గారు మాట్లాడుతూ..
2008 సంవత్సరం నుండి ప్రభుత్వ బడుల విద్యార్థుల సంపూర్ణ వికాసం కోసం GSF పనిచేస్తున్నది.  కేవలం ఆర్ధిక బీదరికం కారణంగా ఏ విద్యార్థి తన ప్రతిభను కోల్పోరాదు, అలాంటి వారికి సమాజం అండగా నిలబడాలనే  సదాశయంతో GSF కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.  
 ఈ SAC కార్యక్రమాల ద్వారా విద్యార్ధికి అభిరుచి ఉండి ప్రతిభ ఉన్న అంశంలోనే ప్రోత్సహస్తూ శిక్షణ అందిస్తామన్నారు.

 Singing, painting, Yoga, Speech, కబడ్డీ వాలీబాల్, STEM అంశాలలో విద్యార్థులను గుర్తిస్తారు. SAC అన్ని విభాగాలు కలిపి సుమారు 900మంది విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ అందిస్తారు.

పోస్టర్ ఆవిష్కరణలో GSF వ్యవస్థాపకులు శ్రీ సదా వెంకట్ గారు, GSF సభ్యులు శ్రీనివాస్ గౌడ్_Retd teacher, శ్రీ నరేష్, శ్రీమతి ప్రమోద, శ్రీశైలం మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.