Friday, April 15, 2022

మలకెక్కడన్న కలుద్దాం మ్యాక్సీ

ఎవరో పంపితే వచ్చినట్టుగా సాధన కుటీర్ వచ్చిoది,  మా తరువాత వచ్చిన మాలో ఒకటిగా కలిసిపోయింది. మాతోపాటే కలిసి తినేది.. కొన్నాళ్ళు నాతో పాటే కార్యాయంలోనే పడుకునేది...దాని పరివారం పెరిగాక వాటితో ఉండేది..కొన్ని 
విష సర్పాల నుండి మమ్మల్ని జాగృతo చేసి కాపాడింది....
నల్లటి కుక్కలు చాలా అరుదు అని దానిని కుక్క అని అంటే కూడా మనసు ఒప్పుకునేది కాదు.. స్వతహాగా నా నోటితో ఎప్పుడు దానిని మ్యాక్సీ అని తప్ప కుక్క అని పిలవలే... కుటీర్ లో అందరూ అంతే.. బయటి నుండి వచ్చే చాలా మంది  సందర్శకులకు అది నేస్తమే.. గత వారం నుండి కొంత ఇబ్బంది పడి, ఈ రోజు ఉదయం డాక్టర్ ని పిలుద్దామనుకునే లోపే జీవంలేని మ్యాక్సీగా కనబడింది...అనుబంధం పెరిగితే మనుషుల కంటే జంతువులే నయం అనిపిస్తుంది. కల్మషం లేకుండా మనతో ఉంటాయి..  పోయాక  కొంత బరువుగా అనిపిస్తుంది. *చలో మల్లెక్కడన్నా కలుద్దాం మ్యాక్సీ*

No comments:

Post a Comment