Sunday, March 13, 2022

Sadhana Kuteer demolition-ఏదైనా కూల్చడం తేలికే- కూర్చడమేకష్టం.

 పల్లె ఆణిముత్యాల ప్రగతికోసం సాధన కుటీర్


https://youtu.be/ACQx2mmZdxU

(pls Watch full Video's)


ఏదైనా కూల్చడం తేలికే- కూర్చడమేకష్టం.


అత్యాశతో ఆశను(గోడలను)మాత్రమే కూల్చగలరు- ఆశయాన్ని కూల్చడం బ్రహ్మ తరమూ కాదు...

ఆశయం అంతర్నిహితమైనది- అగ్ని సమానమైనది.

కొందరి అందకారాన్ని దహిస్తుంది- కొందరికి జ్ఞాన జ్యోతవుతుoది.


ఫిబ్రవరి  28వ తేదీ GSF_  సాధన కుటీర్ పై  జరిగిన కుట్రపై సమాదానాలకై..


స్వామి వివేకానంద, డా.బి.ఆర్.అంబేద్కర్ మరియు డా. అబ్దుల్ కలాoజీల ఆశయాలను కొనసాగించడం తప్పు పనా? అది అవసరమా?  లేదా అని సభ్య సమాజం ఆలోచన చేయాలి.


కొందరి  అనాలోచిత చర్యలవల్ల GSF సాధన కుటీర్ కు జరగకూడని కొంత నష్టం జరిగింది. కరోనా కారణంగా రెండేళ్లగా GSF_సాధనకుటీర్ లో  పల్లె ఆణిముత్యాల 

సాధనశిబిరాలు జరగలేదు. ఈ సమయంలో పల్లె ఆణిముత్యాల శిబిరాలకోసం అవసరమైన ఏర్పాట్ల దృష్టితో #GSF_ #సాదనకుటీర్ ని తీర్చిదిద్దే ప్రయత్నం జరిగింది. 

 అకారణంగా, దుర్మార్గంగా కొందరి మూర్కపు దుశ్చర్య వల్ల ఇంకో యాడాది శిబిరాలు ఆగితే నష్టం ఎవరికి అనేది సమాజం ఆలోచిoచాలానే ఉద్దేశ్యంతో.....

 గత 13 ఏండ్ల కాలంగా GSF ద్వారా పభుత్వ/బడుల్లో చదివే పల్లె ఆణిముత్యాల వికాసంకోసం జరిగిన పనిని జరిగినట్టుగా సమాజానికి చూపే ప్రయత్నం చేస్తున్నాం.


దీనిలో మంచి, చెడు అనేది సభ్యసమాజమే గుర్తించాలి.


*స్వామి వివేకానంద,

 డా.అంబేద్కర్ & డా. కలాంజీల కలల కోసం ఆశయ స్పూర్తితో, ఒక నిర్దిష్ట కార్యాచరణతో నిత్య చైతన్యంగా 

పల్లె ఆణిముత్యాల వికాసంకోసం జరుగుతున్న పని సమాజానికి అవసరమా లేదా అని సభ్య సమాజం నిర్ణయం చేయాలి, చేస్తుందని ఆశిస్తున్నాము*..


ఏదైనా కూల్చడం తేలికే - కూర్చడమే కష్టం.


visit @ www.gsf.org.in.

No comments:

Post a Comment