గ్రామీణ యువతకు వక్త శిక్షణ – GSF & SPF రెండు రోజుల శిబిరం ప్రారంభం.
https://www.instagram.com/reel/DV40Y3ZCH8C/?igsh=d2cyeDcxMGNteWps
GSF & SPF సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వక్త రెండు రోజుల శిక్షణ శిబిరం శనివారం (14.03.2026) నాడు సాధన కుటీర్, వినోభానగర్, ఇబ్రహీంపట్నంలో ఘనంగా ప్రారంభమైంది.
వివిధ ప్రాంతాల నుండి వక్త శిక్షణ కోసం ఎంపికైన 50 మంది శిక్షార్థులు గత 10 రోజులుగా ఆన్‌లైన్ తరగతుల్లో పాల్గొన్నారు. ఆ శిక్షణలో పాల్గొన్న వారికి మాత్రమే ఈ రెండు రోజుల రెసిడెన్షియల్ శిబిరం నిర్వహించబడుతోంది.
ఈ శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరియు ప్రధాన వక్తగా ప్రముఖ సివిల్స్ కోచ్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర గారు, గౌరవ అతిథిగా విద్యావేత్త, కార్తికేయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ పాండు రంగారెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆకెళ్ల రాఘవేంద్ర గారు మాట్లాడుతూ శిక్షార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి కోసం అనేక ప్రాయోగిక సూచనలు చేశారు. వివిధ రంగాలలో గొప్ప నాయకులుగా ఎదగాలంటే నిరంతర అధ్యయనం, అభ్యాసం అవసరమని సూచించారు. ఉదయం నుండి Goal Setting, Body Language, Voice Modulation అంశాలపై శిక్షణ అందించారు.
మొదటి రోజు ముగింపు కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీమతి దేవిక గారు పాల్గొని, నేటి సమాజంలో సోషల్ మీడియా ప్రభావంపై శిక్షార్థులకు అవగాహన కల్పించారు.
GSF వ్యవస్థాపకులు సదా వెంకట్ రెడ్డి గారు మరియు వక్త బృంద సభ్యులు శ్రీ సంజయ్, బొడ్డు రవి, భాస్కర్, మహేష్ గార్ల పర్యవేక్షణలో ఈ శిబిరం నిర్వహించబడుతోంది.
ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వక్తగా ఎదగడానికి అవసరమైన వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు, సమాజంలోని ప్రముఖులతో ముఖాముఖి ఇంటరాక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి నెలా ఇలాంటి శిక్షణ శిబిరాలను నిర్వహించి గ్రామీణ ప్రాంతాల వారికి కూడా వక్త శిక్షణ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
https://www.facebook.com/share/p/1AyQWTvtG4/
No comments:
Post a Comment