Wednesday, March 18, 2026

Day 2 @ VAKTHA B4

ముగిసిన రెండు రోజుల వక్త శిబిరం
https://www.instagram.com/reel/DV7sJ4QjNvu/?igsh=Y2I0ZzZ6cmloOTIw

GSF & SPF సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 14 &;15 తేదీలలో నిర్వహించిన వక్త రెండు రోజుల శిక్షణ శిబిరం  15.03.2026, ఆదివారం సాయంత్రం సాధన కుటీర్, వినోభానగర్, ఇబ్రహీంపట్నంలో ముగిసింది.
 
వివిధ ప్రాంతాల నుండి వక్త శిక్షణ కోసం ఎంపికైన *50 మంది శిక్షార్థులు గత 10 రోజులుగా online తరగతుల్లో పాల్గొన్నారు. ఆ శిక్షణలో పాల్గొన్న వారికి మాత్రమే ఈ రెండు రోజుల *Residential Camp*  నిర్వహించబడిoది. 
ఈ శిబిర ముగింపు కార్యక్రమంలో *Senior High Court Advocates కాసింశెట్టి కరుణా సాగర్, సంగo బాలాజీ* మరియు
 *ముఖ్య అతిథి శ్రీ రావుల కృష్ణ గారు ,Asst.Professor, Education,HCU* మాట్లాడుతూ శిక్షార్థులకు Communication Skills  అభివృద్ధి కోసం అనేక ప్రాయోగిక సూచనలు చేశారు.
 శిక్షణలో భాగంగా వక్త బృందం ద్వారా *GOAL SETTING,           BODY LANGUAGE,      VOICE MODULATION,  TIME  MANAGEMENT,  CONTENT PREPARATION,   TYPES OF SPEECHES* అనే అంశాలపై శిక్షార్థులు నిరంతర అభ్యాసం చేస్తూ ఉపన్యాసకులు నేర్చుకోవాల్సిన జాగ్రత్తలను ముఖాముఖిగా శిక్షార్థులకు తెలియజేసినారు.
 ముగింపు కార్యక్రమంలో GSF వ్యవస్థాపకులు సదా వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ వక్త శిక్షణలో నేర్చుకొన్న అన్ని అంశాలపై నిరంతరం అధ్యయనం మరియు అభ్యాసం చేసి SKILLS పెంపొందించుకావాలని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో వక్త బృంద సభ్యులు *పోలే సంజయ్, బొడ్డు రవి, గౌర భాస్కర్*  ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

*ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వక్తగా ఎదగడానికి అవసరమైన వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు, సమాజంలోని ప్రముఖులతో ముఖాముఖి  కార్యక్రమాలు నిర్వహిoచడం పట్ల  శిక్షణలో పాల్గొన్నా శిక్షార్థులు ఆనందాన్ని వ్యక్త పరిచారు.*. 

ఈ శిబిరంలో జరిగిన శిక్షణ ద్వారా తమలో అద్భుతమైన మార్పులు జరిగి అనేక మెలుకువలు తెలుసుకున్నామని తెలిపారు. 
*ప్రతి నెలా ఇలాంటి శిక్షణ శిబిరాలను నిర్వహించి గ్రామీణ ప్రాంతాల వారికి కూడా వక్త శిక్షణ అందుబాటులోకి తీసుకువస్తామని నిర్వాహకులు  తెలిపారు.*
https://www.facebook.com/share/p/1DBQNAfjTD/
:~ team VAKTHA

No comments:

Post a Comment