Friday, February 27, 2026

కదంబ వృక్షం

కదంబ వృక్షం............!!
హనుమంతుడి పుట్టుకకు మూలం ఈ వృక్షం:
క్రిష్ణుడు గోపికల చీరలను దాచిన చెట్టు :
ప్రకృతిలో రాధాకృష్ణుల ముచ్చట్లన్నీ ఈ చెట్టు నీడలోనే:.

పలు రకాల బొమ్మల తయారీకి కూడా ఈ చెట్టు 
చెక్క పనికివస్తుంది. 
భగవద్గీతలో కూడా దీని గురించి ప్రస్తావించారు. రాధాకృష్ణులకు నచ్చే మొక్క ఇది... 
ఈ చెట్టు నీడలో పరిమళాలను ఆస్వాదిస్తూ 
వారి ప్రేమాయణం కొనసాగిందని, 
అందుకే దీనిని హిందువులు పవిత్రమొక్కగా భావిస్తారని సమాచారం. 

గోపికల చీరలను కృష్ణుడు తీసుకెళ్లి ఈ రుద్రాక్షాంబ చెట్టు మీదే ఉంచినట్టు కూడా మహాభారతంలో ఉందట. 
ఈ చెట్టు 45 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తరు నీరే సరిపోతుంది. ఉష్ణ మండల ప్రాంతంలో బాగా పెరిగే లక్షణాలను కలిగి ఉంటుంది.

ఇది ఆకురాల్చ‌దు. 
ఎప్ప‌టికీ ఆకుపచ్చగా ఉంటుంది. 
నీడను బాగా ఇస్తుంది. 
అడవులలో ఎక్కువ‌గా పెరుగుతుంది. 
దీని పూలు గుండ్రంగా ఉంటాయి. 
దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తుంటారు. 
దీని క‌ల‌ప‌ను బొమ్మల తయారీకి ఉప‌యోగిస్తారు.

పురాణాల్లో కదంబ వృక్షం :

ఈ కదంబవృక్షానికి పురాణాల్లో రెండు రకాల 
పేర్లు ఉన్నాయి.
ఉత్తరభారతం లో దీన్ని కృష్ణవృక్షమనీ, 
దక్షిణభారతం లో పార్వతీవృక్షమనీ అంటారు.

ఈ వృక్షానికి, కృష్ణుడికీ చాలా సంబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చటలు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు. 
అందుకే కృష్ణవృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి.

దక్షిణాదిలో అమ్మవారిని 'కదంబవనవాసిని' అంటారు. 
కదంబ వృక్షానికి 'ఓం శక్తిరూపిణ్యై నమః' అనే మంత్రంతో పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు.

గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబవృక్షానికి పసుపు, కుంకుమలు, పూలతో అర్చన చేయాలని, అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి.

హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం.. అంతేకాదు, సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం.

దక్షిణాదిలో అమ్మవారిని 'కదంబవనవాసిని'.. 
అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అంటారు. 
ఏది ఏమైనా అన్నాచెల్లెళ్ళు 'నారాయణా నారాయణి' లకూ, ఈ వృక్షానికీ చాలా సంబంధం ఉందని చెబుతారు.

హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం :
అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు. 
సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం. గార్దబాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భూమిమీద, మనుషులతో, జంతువులతో మరణంలేకుండా ఉండాలని 
వరం కోరతాడు. 
శివయ్య తథాస్సు అని అంతర్థానమవుతాడు.

వరగర్వంతో దేవలోకం చేరి ఇంద్రున్ని తరిమికొడతాడు గార్దబుడు. 
దీంతో దేవేంద్రుడు విష్ణుమూర్తిని వెంట పెట్టుకుని పరమేశ్వరుని చేరతాడు. 
గార్దబాసురుని చంపమని కోరతాడు శ్రీమహావిష్ణువు.

అయితే తాను వరమిచ్చిన విషయం చెబుతాడు శివయ్య. 
ఆ సమయంలో శ్రీమహావిష్ణువు ఓ సరదా మాట అంటాడు. 
నువ్వు గార్దబాసురుని చంపితే నేను దాసుడిగా ఉంటానంటాడు. 
దానికి శివయ్య నువ్వు గనుక గార్దబాసురుని చంపినట్టైతే నేనే దాసుడిగా మారతానని దానికి 
మరో మాట కలుపుతాడు. 
అయితే మోహినీ రూపంలోకి మారతాడు విష్ణుమూర్తి.

దక్షిణాన ఉన్న గార్దబాసురుని రాజ్యానికి సమీపంలోని వనానికి చేరతాడు. 
అదే సమయంలో విష్ణువుకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ వనానికే అందమైన కన్యరూపంలో వస్తుంది పార్వతీదేవి. 

అమ్మవారి అందానికి ముగ్దులైన రాక్షసులు 
ఆమె దగ్గరకు చేరతారు. 
మరోవైపు మోహినీ అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై వెంటపడతాడు కదంబాసురుడు. 
దీంతో కదంబాసురున్ని ఆకాశంలోకి ఎగరేసి.. తోడేలు రూపంలోకి మారి సంహరిస్తాడు.

ముఖం తోడేలు.. మొండెం మనిషి రూపంలో ఉండి… పరమేశ్వరుని వరానికి భంగం కలగకుండా చంపుతాడు. 
అలా సంహరిస్తున్న తరుణంలో అంతమొందించడానికి కదంబ వృక్షంగా మారి అగ్నిజ్వాలలతో రాక్షసులందరిని సంహరిస్తుంది అమ్మవారు. 
దీంతో గార్దబాసురుని సంహారం జరిగిపోయింది. అయితే సరదాగా అన్న మాట..మాటే కాబట్టి… రామావతారంలో హనుమంతుడిగా మారి శ్రీరామబంటుగా సేవలు అందించాడు శివుడు.

జ్యోతిష్య శాస్త్రంలో కదంబం :..
ఈ కదంబ వృక్షానికి పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు.

జ్యోతిష శాస్త్రం లో నక్షత్రాలు ఒక్కొక్క దానికి 
ఒక వృక్షాన్ని గుర్తించారు.
అందుచేత నక్షత్రవనం లో కదంబ వృక్షాన్ని
శతభిష నక్షత్ర స్థానంలో పెంచుతారు.

గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజ చేయాలి అంటారు. పసుపు, కుంకమలు పూలతో అర్చన చేయాలని చెబుతారు.

గ్రహదోషాలు ఉన్నవాళ్లు… కదంబ వృక్షానికి 
పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి.

కదంబ వృక్షం మంచి సువాసనతో మత్తెక్కించేటట్లు గా ఉంటాయి కదంబ పూలు. 
గుండ్రని టెన్నిస్ బంతుల ఆకారంలో మొదట్లో ఆకుపచ్చగా తర్వాత పసుపు బంగారు వర్ణంలో తర్వాత తెల్లగాను మారతాయి.

ఈ పువ్వులు పార్వతి దేవి పూజలు జరిగే 
చైత్ర, ఆషాడ,శ్రావణ ఆశ్వీజ మాసాల్లోనే 
కడిమి పూలు ఎక్కువ పూస్తాయి. 
ఆద్యాత్మిక పరంగానే కాక వాణిజ్య పరంగాను 
కడిమి చెట్టు ప్రత్యేకమే.

ఔషధ పరంగా ఈ కదంబ వృక్షం మనుషులకు ప్రకృతి ప్రసాదించిన వరం అంటారు ఆయుర్వేద వైద్యులు. ఈ చెట్టు ఆకులు షుగర్ వ్యాది నివారణకు ఉపయోగిస్తారు.

🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment