Sunday, August 10, 2025

శ్రమదాన పక్షం & మొక్కను బ్రతికిద్దాం.

GSF కార్యకర్తలకు,  పూర్వ విద్యార్థులకు & శ్రేయోభిలాషులకు సాదర స్వాగతం.
ప్రతీ సంవత్సం ఆగస్టు నెలలో నిర్వహించే శ్రమదాన పక్షం ఈ సారి ఆగస్టు 16 తేదీ నుండి 31వరకు కొనసాగుతుంది. 
కనీసం 3గం.ల సమయం ఇచ్చే అవకాశం ఉన్నవారు తమకు వీలైన రోజు సాధన కుటీర్ లో శ్రమదానం చేయవచ్చు.

 అదే విధంగా సాధన కుటీర్ లో అన్ని రకాల పండ్ల మొక్కలు ఉండాలన్న సదాశయంతో మొక్కలు నాటి బ్రతికించే వ్యవస్థ చేయబడింది.
పాలేకర్ 5 లెహర్ (60×60) పద్ధతిలో 80 మొక్కలు నాటే అవకాశం ఉన్నది.
 భారత  ప్రధానమంత్రి గారి అభ్యర్థన మేరకు *అమ్మ పేరున ఒక మొక్క*  నాటే ఉత్సవంలో పాల్గొని సాధన కుటీర్ లో మొక్క నాటాలని ఆహ్వానిస్తున్నాం, అవకాశాన్ని అందిస్తున్నాం.

ఈ ఉత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, లేదా *మొక్క కోసం ₹ 351/- విరాళం* చేసి ఈ మహోత్సవంలో బాగస్తులు కాగలరు.
(సంవత్సరం పైన వయసున్న మొక్క)
Google pay or Phone Pay Numbers 9550560027 & 7799051594.
 సామూహికంగా మొక్కలు నాటే తేదీ 24 లేదా 31న ఉండవచ్చు.. ముందస్తుగా తెలుపుతాము.
(*అవకాశం ఉన్న వారు వ్యవసాయ పనిముట్లు కూడా అందివ్వవచ్చును*)
:~ సదా వెంకట్, GSF.

No comments:

Post a Comment