Monday, May 19, 2025

SPORTS MEET @ SADHANA CAMP

*జ్ఞానసరస్వతి ఫౌండేషన్ లో ఘనంగా స్పోర్ట్స్ మీట్* 
జ్ఞానసరస్వతి ఫౌండేషన్ పల్లె ఆణిముత్యాల సాధన శిబిరంలో భాగంగా 18.05.2025 రోజున వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్న క్రీడా  శిబిరాలలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు మరియు ఫౌండేషన్ లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ  కబడ్డీ అంతర్జాతీయ క్రీడాకారుడు, ఒలంపిక్ అసోషియేషన్ మాజీ కార్యదర్శి & KHELO INDIA Jury committe member జగదీష్ యాదవ్ గారు మాట్లాడుతూ సరైన సమయంలో ప్రతిభను గుర్తించి, క్రీడాకారులలో నైపుణ్యాన్ని పెంపొందించి ,దేశానికి ప్రతిభావంతులైన క్రీడాకారులను అందించాలన్న సంకల్పంతో నిరంతరం కృషి చేస్తున్న GSF వ్యవస్థాపకులు శ్రీ సదా వెంకట్ గారిని  అభినందించారు. 
తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆటలకి కావాల్సినంత విశాలమైన క్రీడా ప్రాంగణం మరియు అన్ని వసతులను సమకూర్చి అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని  క్రీడాకారులు ఉపయోగించుకొని, ఉత్తమైన  క్రీడాకారులుగా ఎదగాలని అశాభావం వ్యక్తం చేసారు. 
శిక్షణ పొందుతున్న క్రీడాకారులను అత్యుత్తమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దడంతో పాటు జాతీయ ,అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ,
జ్ఞానసరస్వతి ఫౌండేషన్ కి అవసరమైన తోడ్పాటు  అందిస్తుందని తెలియజేశారు.
తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్ని ఇలాంటి వయసులోనే క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం అవసరం, మేము కేవలం కబడ్డీ ఆట ద్వారా మాత్రమే సమాజo గుర్తింపు పొందాo. GSF సాధన కుటీర్ ద్వారా ద్వారా జరుగుతున్న ఈ పని రేపటి క్రీడాకారులకు చాలా ఉపయోగం అన్నారు. 
  ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ సదా వెంకట్ గారు మాట్లాడుతూ ఆర్థిక వెనకబాటు కారణంగా &  సరైన సమయంలో ప్రోత్సాహం లేకుండా ఏ క్రీడాకారుడు కూడా తమ ప్రతిభను కోల్పోవద్దని అలాంటి వారిని గుర్తించి, సరైన సమయంలో ప్రోత్సహించి వారి ప్రతిభను గుర్తించి సమాజానికి,దేశానికి అందజేయాలనే సామాజిక బాధ్యతగా  ఫౌండేషన్ ఈ పనిలో నిమగ్నం కావడం జరిగింది, పల్లెలోని నిరుపేద ప్రతిభావంతుల ప్రతిభ సమాజానికి పరిచయం చెయ్యడం GSF ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
 కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ భూలోక రావు, రంగారెడ్డి కబడ్డీ అధ్యక్షులు శ్రీ రవికుమార్ గారు, శ్రీ సుధాకర్ రెడ్డి గారు రంగా రెడ్డి జిల్లా  ప్రధాన కార్యదర్శి, ch. సుధాకర్ రెడ్డి (Retd IRS) శాంతి రెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు.
వివిధ జిల్లాలలో camps లో శిక్షణ పొందుతున్న 12 జట్లు ఈ  టోర్నమెంట్ లో పాల్గొన్నాయి.
:~ GSF.

No comments:

Post a Comment