జ్ఞానసరస్వతి ఫౌండేషన్ సాధన కుటీర్ లో జరుగుతున్న సాధన శిబిరాన్ని ససందర్శించిన కల్నల్ సతీష్ భరద్వాజ్ గారు..
శిబిర విద్యార్థులతో Interact అవుతూ వారిని ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు..సరైన సమయంలో ఒక లక్ష్యాన్ని ఎన్నుకుని దానికి ఇష్టంగా మలచుకొని, క్రమశిక్షణతో సాధన చేయాలని విద్యార్థులకు సూచించారు. గత 25 ఏండ్ల కిత్రం తన ఇష్ట పూర్వకంగా భారత సైన్యంలో చేరి ఇప్పటికీ అంతే సంతోషంగా పనిలో ఉంటానని తెలిపారు.అనంతరం GSF SAC ద్వారా జరుగుతున్న పని అద్భుతంగా ఉన్నది, విద్యార్థులకు సరైన సమయంలో మంచి దిశా నిర్దేశం చేస్తున్నారని అభినందించారు. ఇక్కడ నిత్య ప్రేరణా శక్తిగా భారత మాత ఉంచుకుని కార్యక్రమాలు చేయడం అద్భుతంగా ఉన్నదని కొనియాడారు. విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం తెలుపుతూ, అవకాశం ఉన్న ప్రతిసారి మీ సాధన శిబిరం కోసం వస్తానని విద్యార్థులకు మాట ఇచ్చారు. అనంతరం స్పోర్ట్స్ మీట్ కోసం వచ్చిన క్రీడాకారులను మైదానంలో కలుసుకుని అభినందించారు.
GSF తరపున సదా వెంకట్ గారు సతీష్ భరద్వాజ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జ్ఞాపిక అందించారు. సతీష్ భరద్వాజ్ గారితో పాటు అర్చన (Director, Nath peetors) గారు పాల్గొననారు.
No comments:
Post a Comment