పల్లెల్లోని ప్రతిభాకుసుమాల ప్రతిభ అరణ్య రోదనలా, సంద్రంపై కురిసిన వానలా మారకుండా పదుగురికి వెలుగునిచ్చే జాబిలిలా, బతుకునిచ్చే సంజీవనిలా తీర్చిదిద్దాలనే సదాశయంతో నిర్వహిస్తున్న పల్లె ఆణిముత్యాల సాధన శిబిరాల నిర్వహణకు సహక్కరిస్తున్న ప్రతీ శక్తికీ ప్రణామాలు*.
కేవలం ఆర్థిక బీదరికం కారణంగా ప్రతిభావంతుడు తన ప్రతిభను కోల్పోరాదు, అలాంటి వారికి సమాజం అండగా నిలబడాలి అనే సదాశయ సంకల్పoతో ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు వారికి అభిరుచి, ఉండి ప్రతిభ ఉన్న అంశoలో ఎంపిక చేసి నిరంతర సాధన శిబిరాలు నిర్వహిస్తున్నది జ్ఞానసరస్వతి ఫౌండేషన్.
ఈ విద్యా మహాయజ్ఞానికి అనుగ్రహిస్తున్న దైవానికి, కనికరిస్తున్న ప్రకృతికి శిరసా ప్రణామాలు🙏..
*తమ సంపద సమర్పణ ద్వారా సహకరిస్తున్న సహృదయులకు కృతజ్ఞతాభివందనాలు.* సమయ సమర్పణ ద్వారా శిబిరాలలో కార్యకర్తలుగా సేవలు అందిస్తున ప్రతీ వ్యక్తికి పల్లె ఆణిముత్యాల తరపున ధన్యవాదాలు.
విద్యార్థుల ఎంపిక విధానంలో సహరిస్తున జిల్లా విద్యాశాఖ అధికారులకు మరియు వ్యాయామ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు.
భవదీయ,
:~ *సదా వెంకట్, GSF - సాధన కుటీర్*
**************************
*పల్లె మట్టిలో దాగున్న అసంఖ్యాక ఆణిముత్యాలను గుర్తించి, మెరుగులు దిద్దే పవిత్ర కార్యంలో నేను సైతం అంటూ అందరం భాగస్వాములం అవుదాం.*
No comments:
Post a Comment