Monday, March 6, 2023

సాద్రి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం.


జ్ఞానసరస్వతి పౌండేషన్ మహిళా విభాగం సాద్రి 4వ వార్షికోత్సవ సందర్భంగా 
ఇబ్రహీంపట్నం వినోభా నగర్ లోని సాధన కుటిర్ లో  మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది.   సరస్వతి మాతాకీ  పూల మాల వేసి  జ్యోతి ప్రజ్వలనే ప్రారంభమైనా కార్యక్రమం, విద్యార్థుల సాంసృతిక కార్యక్రమాలు, అతిథుల ఆత్మీయ సందేశాలు, విద్యార్థులకు బహుమతులతో కొనసాగి చివరకు జాతీయ గేయంతో ముగిసింది.

ఈ కార్యక్రమంనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ సైకాలజస్ట్ డా. చిన్మయి భరద్వాజ్ విద్యార్థినులతో మాట్లాడుతూ క్రమశిక్షణ, దెర్యం, ఆత్మ విశ్వాసం, మంచి వ్యక్తిత్వం తో ఉండాలని అన్నారు. ముందుగా ఎవరికి వారు వారిని ప్రేమించు కోవాలి,  అందరిలాగా  కాకుండా ఎవరికి వారు ప్రత్యేకగా ఉండాలి. కులం, వర్ణం, వర్గం అనే బేధాలు మీ మనస్సు లోని నుండి తీసివేసి అందరూ కలిసి మెలసి ఉండాలన్నారు.
మన ఆలోచనలు, మనం తీసుకునే  నిర్ణయాలు మన జీవితం మీద ఆధారపడి ఉంటాయి కాబ్బట్టి మీ యొక్క భవిష్యత్ కు మీరే సృష్టి కర్తలు కావున చక్కటి ప్లాన్ చేసుకొని ముందుకు సాగాలి అన్నారు.   స్థానక ఇబ్రహీంపట్నం SBI మనేజర్ నిఖిత మాట్లాడుతూ  భాషలు, నేర్చుకోవాలి, ముఖ్యం గా సెల్ఫ్ కంట్రోల్ తో ఉండాలి కోరారు. బయట ఆకర్షణలకు దూరంగా ఉండి  ఉన్నత మైన లక్ష్యంతో  ఆత్మ విశ్వాసంతో దెర్యంగా  అమ్మాయిలు ముందుకుపోవాలి అని అన్నారు. అన్ని రంగాలలో  మగ వారితో సమానం గా పోటీ పడి ముందుకు వెళ్ళాలి అని సూచించారు. కన్న వారికీ పుట్టి నా జన్మ భూమి  గర్వపడేలా ఎదగాలి అని అన్నారు..
ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన నల్లకoచ TSWRSCJ విద్యార్థినిల మరియు KGVB IBP విద్యార్థునిల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, IBP విద్యార్థినిల కరాటే ప్రదర్శన అద్భుతంగా జరిగింది.
సాద్రి 4వ వార్షికోత్సవం సందర్భంగా  నిర్వహించున వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు నిర్వహించే SHE కార్యక్రమంలో బాగాస్వాములు కావడానికి 25మంది  బృందంతో సాద్రి యూత్ పవర్ ఆవిష్కరణ జరిగింది.
మరో అతిథిగా పాల్గొన్న SMO, లెక్చరర్, Nature Cure హాస్పిటల్ డా. నాగలక్ష్మి గారు సాద్రి కార్యకర్తలకు విలువైన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఉద్యావేత్త శ్రీ రాంరెడ్డి గారు పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నా అతిథులకు సాద్రి ఇంచ్చార్జ్ శ్రీమతి ప్రమోద మరియు వారి బృందంచే సన్మానాలు చేశారు.
కార్యక్రమంలో సుమారు 300మంది పాఠశాల విద్యార్థినిలు, వివిధ కళాశాలాల విద్యార్థినిలు 25మంది మరియు సాద్రి బృందం సభ్యులు పాల్గొన్నారు.
చివరలో విద్యార్థులచే సంకల్పం చేయించారు GSF వ్యవస్తాపకులు సదా వెంకట్ గారు.
జాతీయ గేయంతో కార్యక్రమం పూర్తయింది.

No comments:

Post a Comment