Thursday, November 1, 2018

SADHANA CAMP_2018 INAUGURATION

Inauguration progrm of

#SADHANACAMP_2018

*--నిశ్శబ్ద ఉద్యమంగా కొనసాగుతున్న ఇలాంటి సంస్థల నిస్వార్థ సేవలు అభినందనీయం--తెలంగాణ ఉద్యోగస్తుల సంఘం మాజీ అధ్యక్షులు, శ్రీ దేవీ ప్రసాద్*

*--పల్లె అణిముత్యాల సాధన శిబిరం ప్రారంభం....*
ప్రభుత్వ బడుల్లో చదివే పల్లె అణిముత్యాల ప్రతిభకు సనేపట్టే మహోత్తర కార్యక్రమాన్ని గతకొన్ని సంవత్సరాలుగా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ చేపడుతోంది. పూర్వపు రంగారెడ్డి & నల్లగొండ జిల్లాల్లోని కొన్ని ప్రభుత్వ బడుల విద్యార్థులకు పాటలు, యోగ, చిత్రలేఖనం, వ్యాసరచన మరియు ఉపన్యాసం అంశాలలో
ఎంపిక చెసిన 60 మంది విద్యార్థులకు వారం పాటు జరిగే సాధన శిబిరం ఈ రోజు సాధన కుటీర్ లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉద్యోగస్తుల సంఘం మాజీ అధ్యక్షులు, శ్రీ దేవీ ప్రసాద్ గారు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఆద్యర్యంలో నిర్వహిస్తున్న ఈ సాధన శిబిరాల ద్వారా పల్లెల్లోని ప్రభుత్వ బడుల్లో చదివే నిరుపేద ప్రతిభావంతులకు తప్పక దశ దిశ కలుగుతుందని అన్నారు.
ప్రచారాలకు దూరంగా ఉంటూ, నిశ్శబ్ద ఉద్యమంగా కొనసాగుతున్న ఇలాంటి సంస్థల నిస్వార్థ సేవల గూర్చి ఇంత ఆలస్యంగా తెలుసుకున్నందుకు కొంత బాదగా ఉందన్నారు. మా వైపు నుండి తప్పకుండా ఇలాంటి నిస్వార్ధ సంస్థలకు సహకారం అదింస్తానన్నారు.
ప్రారంభోత్సవంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్, శ్రీ రాజేందర్ రెడ్డి గారు, ప్రముఖ సినీ గేయ రచయిత డా. వెనిగల్ల రాంబాబు గారు, ప్రముఖ పాత్రికేయులు తిరునగరి శ్రీనివాస్ గారు, గురుకుల విద్యాపీఠ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు మరియు ఆయా అంశాల శిక్షకులు పాల్గొన్నారు.

సాధన కుటీర్ లో సమావేశ మందిరం కోసం నూతనంగా నిర్మించిన "SHED" ని కూడా అతితులతో ప్రారంబోత్సవం చేసారు.
ఆ నిర్మాణానికి సహరించిన దాతలు శ్రీ కొండల్ రావు గారిని, మరియు TECHI RIDE  సంస్థ ప్రతినిధులను ఫౌండేషన్ ద్వారా సన్మానించారు.

పల్లె బడులలోని ఆర్థిక నిరుపేద ప్రతిభావంతులకు సమాజం అండగా ఉండాలనే ఆశయంతో గత 10 సం.రాల నుండి ఫౌండేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆశయానికి అండగా ఉంటూ సహాయ సహకారలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలకు మరియు నిస్వార్దంగా సేవలు అందిస్తున్న కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు.
వారం రోజుల కోసం నిర్వహించే ఈ శిబిరంలో సుమారు 25 మంది కార్యకర్తలు పుర్తిసమయం ఉండటం విశేషం.

No comments:

Post a Comment