Friday, May 9, 2025

దేవీ నిన్నే మనసున తలిచెద

#భారతమాతకు జయకారం చేస్తే మనకు మనం చేసుకున్నట్టే.
 మన కుటుంబానికి, మన లక్ష్యానికి జయకారం చేసుకున్నట్టే అంటూ.... 
చదువు, ఆటలు, మన ఎదుగుదలతో పాటు మనందరికీ  దేశభక్తి తప్పక ఉండాలని విద్యార్థులకు  భారత మాత తత్వాన్ని వివరిస్తూ ఆమె సన్నిధిలో పాడుకున్న పాట. 
శ్రీ అరిoదం గారు ( Retd HM) విద్యార్థులతో పాడించారు.
విద్యార్థులకు అమ్మతత్వం గురించి అద్భుతంగా వివరించి, మన అమ్మతో పాటు దేశమాత పట్ల కూడా బాధ్యతగా ఉండాలని తెలుపుతూ పాటల రూపంలో వివరించారు.

Tuesday, May 6, 2025

Main Khelunga / మై ఖేలుoగా

#SadhanaCamp 2025 @GSF #SadhanaKuteer
As part of the ongoing #SadhanaCamp Organized by the Gnana Saraswathi Foundation(GSF),
 an interactive session was held on April 6, 2025, at the #GSF_SadhanaKuteer. The session was graced by the esteemed presence of Sri #RakaSudhakar garu, who inspired the #SadhanaCamp students  with his motivational address.
Sri.Raka Sudhakar  garu emphasized that no matter the #challenges one faces, unwavering determination is the key to realizing one’s #dreams. To illustrate this, he shared the inspiring journeys of renowned sports personalities such as #SachinTendulkar, #Jaiswal, and the #Koh_Panyee football team from Thailand—highlighting their perseverance and dedication.
To boost the confidence of the students, he introduced the empowering slogan "#MainKhelunga"—encouraging them to remain steadfast in their passion for sports. He urged them to face every obstacle with courage and to always affirm with conviction: "#MainKhelunga" ("I will play")
#SadhanaKuteer Resonated with the Slogan #MainKhelunga'"

He also stressed that true fulfillment lies in serving the nation selflessly rather than pursuing personal gains. In alignment with this message and considering the current socio-political environment, he distributed copies of his book "#Unknown_KashmiriFiles" to the .

The session was attended by #GSF Founder Sri 
#SadaVenkat garu, #GSF_SAADRI Incharge Smt Pramoda garu, along with several GSF members and supporters, making it a memorable and enriching experience for all 
K Raka Sudhakar Rao

 Sada Venkat

క్రీడా మైదానానికి పూజా కార్యక్రమం

Worship at the Sadhana Sports G.
It is the #custom and #tradition of Indians to seek permission from #MotherEarth before starting any work. 
Sportsmen #bowing down to the sports ground as part of the #Sadhanacamp-2025 at #SadhanaKuteer... taking permission from #MotherEarth.
ఏ కార్యం మొదలు పెట్టినా నేల తల్లి అనుమతి తీసుకోవడం భారతీయుల ఆచారం, ఆనవాయితీ. 
#సాధనకుటీర్ లో
 #సాధనశిబిరంలో  బాగంగా క్రీడా మైదానానికి మ్రొక్కుతూ... నేల తల్లి అనుమతి తీసుకు
న్న #క్రీడాకారులు.

Tuesday, April 29, 2025

పల్లె ఆణిముత్యాలకు విద్యారణ్య స్వామీజీ ఆశీస్సులు

జ్ఞానసరస్వతి ఫౌండేషన్.
సాధన శిబిరo -2025.
(ఎంపిక చేసిన ప్రభుత్వ బడుల విద్యార్థుల కోసం)
Apr 26 నుండి May 20వరకు.
Day 3/25
*సాధన శిబిర విద్యార్థులను ఆశీర్వదించిన శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ*...
ఎంపిక చేసిన ప్రభుత్వ బడుల విద్యార్థులకు,
GSF సాధన కుటీర్ లో నిర్వహించబడుతున్న 25రోజుల సాధన శిబిరాన్ని సందర్శించి, 
సాధన కుటీర్ లో నూతనoగా ఏర్పాటు చేసిన అన్నపూర్ణ మండపం పూజ నిర్వహించారు. 
అనంతరం విద్యార్థుల ద్వారా శిబిరంలో జరిగే విషయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆశీ: ప్రసంగం చేస్తూ.. విద్యార్థులు ఈ వయసులోనే తమకు ఇష్టమైన అంశంలో శ్రద్ధ వహించి, సాధన చేస్తే ఉన్నతంగా రాణిస్తారు. చదువుతో పాటు ఆటలు, సంస్కారం చాలా అవసరం అని తెలిపారు..
ఎన్ని ప్రతిభ ఉన్న దానికి సంస్కారం తోడు లేకపోతే ఉపయోగం ఉండదు. గత కొన్ని సంవత్సరాలుగా  ఇలాంటి శిబిరాలలో చదువుతో పాటు సంస్కారం అందించే ప్రయత్నం GSF నుండి జరుగుతుందని తెలిపారు. 
అనంతరం అన్నపూర్ణ మండపం ఏర్పాటుకు సహకరించిన శ్రీ సత్యనారాయణ గారిని సత్కరించారు. 
సత్యనారాయణ గారు మాట్లాడుతూ GSF ద్వారా పల్లె బడుల విద్యార్థుల  వికాసం కోసం ఒక మహా యజ్ఞంలా సాగుతున్న పనిలో నాకు అవకాశం అదృష్టంగా బావిస్తున్నానని తెలిపారు. 
GSF ద్వారా జరిగే కార్యక్రమాలకు ప్రారంభం నుండి స్వామీజీ ఆశీస్సులు లభించడం అదృష్టంగా భావిస్తున్నామని GSF సదా వెంకట్ గారు తెలిపారు.
అదేవిధంగా సాధన కుటీర్ లో అన్నపూర్ణ మండపం ఏర్పాటు సహకారం అందించిన శ్రీ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలిపారు.
:~ GSF

Wednesday, April 16, 2025

సహృదయ సహకారం

అనుగ్రహిస్తున్న దైవానికి, కనుకరిస్తున్న ప్రకృతికి శిరసా ప్రణామాలు🙏.. సహకరిస్తున్న సహృదయులకు హృదయ పూర్వక ధన్యవాదాలు..
పల్లె ఆణిముత్యాల ఆతిథ్యానికి సిద్ధమైన అన్నపూర్ణ మండపం..
పల్లెల్లోని ఆర్థిక నిరుపేద ప్రతిభావంతుల నిగూడ ప్రతిభను సరైన సమయంలో గుర్తించి, చేయూత అందించాలనే సదాశయ  సంకల్పoతో ఏర్పాటైoదే  *పల్లె ఆణిముత్యాల ప్రగతి సౌధం సాధన కుటీర్*. 
2008 సంవత్సరంలో ప్రారంభమై తన శక్తి మేరకు ప్రభుత్వ బడుల వికాసం కోసం పనిలో కొనసాగుతున్న జ్ఞానసరస్వతి పౌండేషన్ కోసం పకృతి ప్రసాదంగా Vinobha Devolopment Society (VDS) ద్వారా 2013 సంవత్సరంలో అందినదే వినోబానగర్ లోని స్థలం అదే ఇప్పుడు  సాధన కుటీర్.
అనేక మంది సహృదయుల సహకారంతో కొద్ది కొద్దిగా అభివృద్ధి చేసుకుని ప్రభుత్వ బడుల వికాసం కోసం పనిలో ఉన్నది.. 2020 లో వచ్చిన కరోనా కల్లోల సమయంలో పూర్తి సమయాన్ని ఉపయోగించుకుని అత్యంత అద్భుతంగా సుందరీకరించిని, నిత్య ప్రేరణా శక్తిగా భారత మాత విగ్రాహావిష్కరణ చేసుకుని, ఆణిముత్యాల  కార్యక్రమాల కోసం సిద్ధమమైoది..
అనుకోని సంఘటనగా  కొందరు ఈర్యపరుల అక్రమ దాడి కారణంగా సాధన కుటీర్ లో పురాతన కట్టడాలతో పాటు, Bothrooms, అన్నపూర్ణ మండపం కూడా అక్రమంగా కూల్చబడ్డాయి.
  నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా, ఏ కార్యానికి ప్రకృతి తలవంచి సహరిస్తుందనేది GSF నిత్య చైతన్య నినాదం.. అదే ప్రకృతి నియమం కూడా. 
GSF అక్షరాల ఆ నినాదాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తుంది..  ఇక్కడ శిబిరాలలో పాల్గొనే విద్యార్థులచే అదే నిత్యం ఉచ్చరింపజేస్తుంది..
అది నినాదమే కాదు,  ప్రకృతి అద్వితీయ ప్రసాదమని అనేక సందర్భాలలో నిరూపితమవుతున్నది..
అక్రమంగా కూల్చబడ్డ కుటీర్ 
గౌరవ న్యాయస్థానం (లోకాయుక్త) ఆదేశంతో పూర్వస్థితికి చేరుకుంటుంది.  
పల్లె ఆణిముత్యాల వికాస కార్యక్రమాల కోసం అవసరమయ్యే సౌకర్యాలు ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకుంటున్నది సాధన కుటీర్. 
అందులో భాగంగా పల్లె ఆణి ముత్యాలు *భోజన వసతి కోసం సిద్ధమవుతున్న అన్నపూర్ణ మండపం*.
సహాయం చేసేవాళ్ళు రెండు రకాలు...
అడిగితే చేసేవారు ఒకరు, అడక్కుండానే మన అవసరాన్ని గుర్తించి చేసేవారు..
అడక్కుండా ఆపదలో/అవసరంలో చేసే వారు అరుదుగా ఉంటారు..
అలాంటి సహకారం అద్భుతం అంతేకాకుండా అరుదుగా జరుగుతుంది.

#GSF కార్యక్రమాలకు ఏ మాత్రం పూర్వ పరిచయం లేని శ్రీ భీమ సత్యనారాయణ గారు(సరూర్ నగర్ వాస్తవ్యులు,వ్యాపారవేత్త) పరిచయస్తుల నుండి  #సాధనకుటీర్ ద్వారా  జరిగే కార్యాలను తెలుసుకుని, ఒక్కసారి మాత్రమే  కుటీర్  సందర్శించి, ఇక్కడ కార్యక్రమాలు, సంస్థ ఆశయాలను తెలుసుకుని స్పూర్తి పొంది అన్నపూర్ణ మండప నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించారు*.  
వారికి మరియు వారికి సహకరించిన కుటుంబ సభ్యులకు GSF తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుందాం🙏. 
సమయానుకూలంగా వారికి GSF వేదిక ద్వారా పరిచయo చేసుకుందాం, అభినందించుకుందాం, సన్మానించుకుందాం.

ఆర్థిక నిరుపేద ప్రతిభావంతుల  నిగూడ ప్రతిభ సమాజపు ఆస్తి... వారికి సరైన సమయంలో చేయూత అందిద్దాం..సమాజానికి పరిచయం చేద్దాం.
:~ సదా వెంకట్, GSF.

Monday, March 24, 2025

HIDDEN TALENT


Hidden Talent ... 
A picture of a #SadhanaKuteer  woven from a brush by a 7th_grade Student who participated in a 
#SadhanaCamp -2025 @ A 3Days Preporatory Camp...
He also participated in the struggle for survival alongside his mother who worked in the houses and studied in a #Govtschool, revealing the *hiddentalent*  in him...
Society should provide help to such people at the right time...
నిగూడ ప్రతిభ...  
సాధన శిబిరంలో పాల్గొన్న 
7వ తరగతి విద్యార్థి కుంచె నుండి జాలువారిన సాధనకుటీర్ చిత్రం...
 బతుకు పోరాటంలో ఇండ్లల్లో పనిచేసే అమ్మకి తోడుగా తాను కూడా పాల్గొంటూ 
ప్రభుత్వ బడిలో చదువుతూ తనలో దాచుకున్న చిత్రలేఖన ప్రతిభ...
ఇలాంటి వారికే సమాజం సరైన సమయంలో చేయూత అందించాలి...
ప్రతిభనుగుర్తిద్దాం - ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూతఅందిద్దాం.
:~GSF

Tuesday, February 11, 2025

GSF SAC Selections 2025

GSF SAC Selections 2025 – Empowering Young Talent The Gnana Saraswathi Foundation (GSF) successfully conducted the GSF_SAC (Sports, Academics, Cultural) Selections – 2025 on February 11, 2025, at GSF Sadhana Kutir, Vinobanagar, IBP. This initiative aims to identify and nurture young talent in Kabaddi, Volleyball, Yoga, and Painting, providing them with structured training and holistic development opportunities. Fostering Talent Through Structured Training With the support of the Ranga Reddy District Education Department, around 400 seventh-grade students from various government schools participated in the selection process. Under the direct supervision of their physical education teachers, these students showcased their skills and passion for their respective fields. 50 students were carefully chosen in each category based on their potential and performance by GSF selection committee.
To ensure consistent growth and excellence, GSF has designed a three-year training program, where the selected students will undergo intensive coaching. Residential camps will be organized during 60 government holidays each year, accumulating 180 days of professional training over three years. This initiative will provide students with free training, accommodation, and necessary facilities, ensuring that financial constraints do not hinder their progress. Vision and Leadership Behind the Initiative GSF Founder Mr. Sada Venkat emphasized the foundation’s commitment to empowering young talent and fostering excellence in sports, arts, and cultural fields. He elaborated on the selection process, training methodology, and the broader vision of GSF_SAC, which is to provide a strong foundation for aspiring students to excel at regional, national, and international levels.
The event witnessed the presence of esteemed guests, including: ✅ Sri.Sudhakar Reddy (Retd. IRS, Former National Volleyball Player) ✅ Sri. Kumar Swamy (Retd. Dy. Commissioner, SSC Examination Board) ✅ Sri.Satyam garu (Businessman and Philanthropist) ✅ Smt. Pramoda (Saadri In-Charge) ✅ Sri. Venkatesh, PD (Coordinator for SAC Selections) ✅ Various school physical education teachers and Directors appreciated the work done by GSF Selections and Sadhana Camps.
Building a Brighter Future GSF expresses its sincere gratitude to all the educators, supporters, and volunteers who contributed to the success of this event. Their dedication ensures that young students receive the right guidance and resources to transform their talent into excellence. With initiatives like GSF_SAC, GSF continues to play a crucial role in shaping the future of talented students, breaking barriers and creating opportunities for success. Stay tuned for more updates on our journey to empower young minds! 📢 Follow us for more updates on upcoming selections and training camps! Instagram :

Monday, January 6, 2025

Visitors @ SSC - Spell 7

Sadhana_Sports_Camp _ 2024
SPELL 7, Dec 22 - 26,
At GSF_SadhanaKuteer.

INTERACTION with Sri.*Ch.Sudhakar Reddy garu, IRS Asst.Commissioner(Retd),.Former National Volleyball & Kabaddi Player*, 
National Volleyball Champions(Gold & Cilver).

https://www.facebook.com/share/p/1DfSCoBCV4/

Visitors @ SSC_Spell 7

Sri. G. Rama Raju garu
(Retd. Bank Manager),
GBRM Trust.

Smt.Sambrajyamma,
(Yoga Specialist),
Retd. Sr. Scientist, CRIDA - ICAR.

Smt. Ch. Sowbhagya Laxmi garu
(Former Kabaddi Player)
Retd. Principal, B.Ed Collage.

Visited the Sadhana Sports Camp and Blessed the Camp Students.

Paintings 2025

భారత్ మాతా కీ జై..

*https://youtu.be/TZ9NMNb9vu0?si=KNhk3-NHtFtQDUNR*
*అధ్బుతంగా కనిపించే ప్రతీ కార్య సఫలతలో  మెండైన శ్రద్ధ కనబడుతుంది*.... 
*శ్రద్ధతో చేసిన ప్రతీ కార్యo ద్వారా అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి*..
పల్లె ఆణిముత్యాల ప్రగతి కోసం కొనసాగుతున్న సాధన కుటీర్ లో ఒక పల్లె ఆణిముత్యం కుంచె నుండి అద్భుతాలు.
*సాధన కుటీర్ లో ఉన్న ప్రతీ చెట్టూ, ప్రతీ రాయిలో గత వైభవ సాధకులను సమాజానికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో  పాటు ఇక్కడ శిబిరాలలో పాల్గొనే విద్యార్థులకు నిత్య ప్రేరణా శక్తులుగా నిలచే విధంగా పెయింటింగ్స్ చేయాలనే సదాశయ సంకల్పం జరిగింది*..
2021లో ప్రారంభమై  కొన్ని చిత్రాలు వేయబడ్డాయి.. 
ఆ బండ రాళ్ళలో, చెట్లలో ఆ చిత్రాలకు ప్రాణం పోసింది కూడా ఒక పల్లే ఆణి ముత్యమే.. 
*చిత్రలేఖనం మీద ఉన్న ఆసక్తితో  2015లో తన 8వ తరగతిలో GSF సాధన శిబిరంలో పాల్గొని, నిరంతర సాధనలో ఉంటూ  BFA పూర్తి చేసి MFA కోసం సిద్ధమవుతున్న సాయి కుమార్*..

*జనవరి 2021లో భారత మాత విగ్రహావిష్కరణ సందర్భంగా తాను వేసిన చిత్రాలకు 2025 మళ్ళీ రంగులు అద్దీ, సిద్ధం చేసిన వైనం అధ్బుతం*..   సాధన కుటీర్ లో 2018 సాధన శిబిరం నందు చిత్రలేఖనంలో తన ద్వారా శిక్షణ పొంది, ప్రస్తుతం BFA చేస్తున్న విశ్వ సాయి ఈ కార్యంలో తోడుండడం మరో అద్భుతం. సాధన శిబిరాల పూర్వ విద్యార్ధులిద్దరూ ఈ కార్యంలో పాల్గొనడం మహా అధ్బుతం.

ఈ పని కోసం ఎంతో మంది కళాకారులు అందుబాటులో ఉన్నా కూడా
.. అవి వేసిన  
సాయి ద్వారానే ఆ చిత్రాలకు మెరుగులు దిద్దాలనే నిర్ణయంతో... 
 సాధన శిబిరాలలో పాల్గొనే పల్లె ఆణిముత్యాల నిత్య ప్రేరణా శక్తులుగా ఉండే
 *భారత మాత* విగ్రహం మరియు *స్వామి వివేకానంద*, *Dr. అబ్దుల్ కలాం* గార్ల విగ్రహాలను అధ్బుతంగా తీర్చి దిద్దిన సాయి కుమార్  & విశ్వ సాయిలకు మనందరి తరపున శుభాభినందనలు... 
తాము అనుకున్న కళా రంగంలో మరిన్ని అద్భుతాలు సాధించాలని ఆశీర్వదిద్దాం.
:~ సదా వెంకట్, GSF.

Sunday, December 29, 2024

Women empowerment and Financial Enhancement by GSF Saadri at Kishori vikas prashikshana Varga





On December 26, 2024, Smt. Pramoda, Incharge of GSF SAADRI, addressed a session on "Women Empowerment and Financial Enhancement" for the participants of the Kishori Vikas Prashikshana Varga at Vaidehi Koushalam. The girls actively participated in the session, sharing their thoughts and perspectives.

Monday, December 2, 2024

అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక

మన సాధన కుటీర్ ఆతిథ్యానికి ప్రశంసల జోరు...
తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ భాషను, తెలంగాణలోని సాహిత్య అభిమానుల శ్రద్ధను హస్తిన వేదికగా అజరామరం నాటకం ద్వారా ప్రపంచానికి చాటలనే సదృఢ సంకల్పంతో అనంత సాహిత్య, సాంస్కృతిక వేదిక కృషి అధ్బుతం.
హస్తినలో(ఢిల్లీ)ప్రదర్శన చేసే నాటక అభ్యాసం కోసం రెండు రోజుల ఆతిథ్యం ఇచ్చే అవకాశం మన సాధన కుటీర్ కు దొరకడం  అదృష్టం...
నేటి రోజులలో సంపద కన్నా అత్యంత విలువైన సమయాన్ని తెలుగు భాష కోసం వెచ్చిస్తూ, అజరామరo నాటకంలోని పాత్ర దారులంతా గొప్ప విద్యావంతులే, వారిలో ఎక్కువ మంది ఉపాద్యాయ వృత్తిలో ఉన్నవారే. అయినా సాహిత్య అభిమానులై, కళా పిపాసులై అంతకు మించి సమాజ హితకారులై ఈ నాటకంలో  పాత్ర దారులైనారు.  వారి శ్రద్దకు ప్రణామాలు🙏. 
అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక ద్వారా ప్రదర్శన జరిగే అజరామరo నాటిక మంచి ఆదరణ పొంది, గొప్ప పేరు పొంది మన తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు దక్కాలని ఆశిద్దాం.
ఈ వేదిక ద్వారా జరిగే ప్రయత్నంలో మన సాధన కుటీర్ కు కూడా కొంత అవకాశం కల్పించిన సమితి రూప శిల్పి శ్రీ దోరవేటి గారికి మరియు వారి బృందానికి మనందరి తరపున ప్రత్యెక ధన్యవాదాలు.
:~ సదా వెంకట్.