Tuesday, September 22, 2026

*వివిధ పత్రికలలో పద్యాల తోరణం -2026*

🌿 *GSF పద్యాల తోరణ బృందానికి శుభాకాంక్షలు… శుభాభినందనలు!* 💐
*https://gnanasaraswathifoundation.blogspot.com/2026/09/2026_01943167953.html*

*మన ద్వారా వెచ్చించిన ప్రతి నిమిషం ఎంత విలువైనదో నిన్నటి పద్యాల తోరణం మహోత్సవం మరోసారి నిరూపించింది.* ఒకటి రెండు విభాగాలు మినహా, అన్ని విభాగాల పనులు అనుకున్న విధంగా విజయవంతంగా సాగాయి.

*ఉత్సవానికి విచ్చేసిన ఉపాధ్యాయులలో కనిపించిన సంతృప్తి, ఆశ్చర్యం, ఆనందం మన వ్యవస్థకు లభించిన గొప్ప ప్రశంస. వారు అందించిన అభిప్రాయ పత్రాలు కూడా అదే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.*

*ఈ ఫలితం ఒక్కరి కృషి కాదు… ఎవరికి వారు ప్రచారానికి దూరంగా, నిస్వార్థంగా, నిశ్శబ్దంగా తమ బాధ్యతను నిర్వర్తించిన ప్రతి కార్యకర్త సమష్టి శ్రమకు ప్రతిఫలం.*
*ఆ నిశ్శబ్ద సేవే ఈ పద్యాల తోరణానికి అసలైన తోరణం!* 🌿

*ఈ కార్యక్రమానికి ఆర్థికంగా, వస్తు రూపంలో, సమయం, శ్రమతో సహకరించిన ప్రతి హృదయానికి మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు.*

*మన వ్యవస్థ ఇతర జిల్లాలకు కూడా ఒక స్ఫూర్తిగా నిలవాలనే మన ఆకాంక్షకు మంచి స్పందన లభించింది. మూడు జిల్లాల నుంచి న్యాయనిర్ణేతలుగా విచ్చేసిన భాషా పావీణ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మనకు మరింత శక్తిని, బాధ్యతను ఇచ్చాయి.*

*మన్ననలు పొందింది ఒక కార్యక్రమం కాదు…
దాని వెనుక నిలిచిన నిస్వార్థ సేవా భావం*.

ఈ మహోత్సవం విజయానికి తమ వంతు బాధ్యతను నిశ్శబ్దంగా, నిస్వార్థంగా నిర్వర్తించిన ప్రతి సేవకుడికీ
జిల్లా పద్యాల తోరణం మహోత్సవం బృందం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. 💐🙏

త్వరలో ఒక రోజు Online సమీక్ష నిర్వహిద్దాం. ముందుగా ఉపాధ్యాయుల సమీక్ష పూర్తయిన వెంటనే GSF బృందం సమీక్షను కూడా నిర్వహించుకుందాం.
*బాధ్యత తీసుకోకుండా ఫలితాలను ఆశించలేము - సేవను బాధ్యతగా చేయాలన్న GSF నినాద స్ఫూర్తిని కొనసాగిద్దాం.* 

*మన సేవ నిశ్శబ్దంగా ఉండొచ్చు… కానీ దాని ప్రభావం తరతరాలకు వినిపించాలి*. 🌿
అందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు*. 💐
::~ *సదా వెంకట్*
GSF*

No comments:

Post a Comment