వందే మాతరం – జాతి గౌరవానికి చట్టబద్ధ రక్షణ
భారతదేశ స్వాతంత్ర్యోద్యమానికి ప్రాణం పోసిన మహోన్నత జాతీయ గీతం **"వందే మాతరం"**కు కేంద్ర ప్రభుత్వం మరింత గౌరవాన్ని కల్పించే దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. పూర్తి వందే మాతరం గేయాన్ని అధికారిక సందర్భాల్లో తప్పనిసరిగా ఆలపించేలా, అలాగే దానిని ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా గానం చేయడాన్ని అడ్డుకోవడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవడం దేశభక్తిని బలోపేతం చేసే గొప్ప ముందడుగు.
"వందే మాతరం" అనేది కేవలం ఒక గీతం కాదు; అది భారతమాతకు అర్పించే వందనం, స్వాతంత్ర్య సమరయోధుల ప్రేరణ, జాతీయ చైతన్యానికి చిరస్థాయి ప్రతీక. బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఈ గేయం స్వాతంత్ర్యోద్యమ కాలంలో లక్షలాది భారతీయుల హృదయాల్లో దేశభక్తి జ్వాలను రగిలించింది. అనేక మంది వీరులు "వందే మాతరం" నినాదాన్ని తమ చివరి శ్వాస వరకు గర్వంగా పలికారు.
(వందేమాతర పూర్తి గేయంపై గౌరవ అప్పాల ప్రసాద్ గారి సందేశం👇🏻
https://youtu.be/a89b1FjdgUc?si=wGNYYBU5LcTK0SEz )
ఈ నిర్ణయం మరింత ఆనందాన్ని కలిగించడానికి మరో కారణం కూడా ఉంది. జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ (GSF) 2008వ సంవత్సరం నుంచే పాఠశాల విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించాలనే సంకల్పంతో పూర్తి వందే మాతరం గేయంపై పోటీలు నిర్వహిస్తోంది. కేవలం పోటీలకే పరిమితం కాకుండా, అనేక పాఠశాలలకు పూర్తి గేయ సాహిత్యాన్ని (Lyrics), సంగీతాన్ని (Music) ఉచితంగా అందించి విద్యార్థులు సంపూర్ణంగా నేర్చుకునేలా నిరంతరం కృషి చేసింది. నేడు ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేయడం GSF వంటి సంస్థల దీర్ఘకాలిక ప్రయత్నాలకు ఒక గుర్తింపుగా భావించవచ్చు.
(GSF కార్యక్రమాలలో వందేమాతరం పూర్తి గేయం👇🏻
https://youtu.be/06MvlDpTNwQ?si=CtKYtUQ9meRjwQcI)
జాతీయ గీతాలు, జాతీయ చిహ్నాలు కేవలం చట్టాల ద్వారా మాత్రమే కాదు, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించినప్పుడే వాటి గొప్పతనం నిలుస్తుంది. అందుకే ప్రతి పాఠశాలలో, ప్రతి విద్యార్థి హృదయంలో పూర్తి వందే మాతరం మారుమోగాలి. అదే నిజమైన దేశభక్తి, అదే భారతమాతకు మనం అందించే అత్యున్నత వందనం.
వందే మాతరం!
భారత్ మాతాకీ జై!
No comments:
Post a Comment