Friday, January 16, 2026

పద్యాల తో రణం @ విద్యార్థులకు

🌹జ్ఞానసరస్వతి పౌండేషన్ ఆధ్వర్యంలో  
తెలుగు భాషోపాధ్యాయులు, పద్యాభిమానుల ఆత్మీయ సమ్మేళనం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 తెలుగు భాషామ తల్లి కంఠ సీమనలంకరించిన దివ్య మణిమాల పద్యం.  కావ్యం, శతకం, ప్రబంధం, నాటకం, ఖండకావ్యం మొ॥న ప్రక్రియల ద్వారా వేయి సంవత్సరాలుగా అపారమైన సారస్వతాన్ని మనకందిస్తున్న సాధనం పద్యం. ఇటువంటి *పద్యాన్ని ఆరాధించే, ఆదరించే వారందరూ ఒకచోట కలవాలనే లక్ష్యం తో, తెలుగు భాషను భవిష్యత్తుకు భద్రoగా అందించాలనే ఆశయంతో, విద్యార్థులకు పద్యాల పట్ల అభిరుచిని పెంచడం కోసం "పద్యాల తోరణం"  కార్యక్రమ సమాలోచన  కోసం*..

 *01-02-2026 ఆదివారం* ఉదయం 8:30గంటలకు జరుగనున్న సమావేశానికి  పద్యాభిమానులందరికీ సాదర స్వాగతం. 
*స్థలం:- సాధన కుటీర్, జ్ఞానసరస్వతి ఫౌండేషన్, వీరపట్నం*

*ఈ కార్యక్రమం అభినవ దాశరధి దోరవేటి చెన్నయ్య గారు మరియు తెలుగు ఉపాధ్యాయుల నిర్వహణలో కొనసాగుతుంది*

మరిన్ని వివరాలకు:  
+919704139144,
+919951392714,
+919640755648.

*ఆహ్వానించు వారు*:
🙏🏼సదా వెంకట్ రెడ్డి,  వ్యవస్థాపకులు.
 *జ్ఞానసరస్వతి ఫౌండేషన్*.
9553234351, 9441054351.

*https://sadavenkat.blogspot.com/2026/01/blog-post.html*

Friday, January 9, 2026

బడి వజ్రోత్సవం..

అందరం గమనిద్దాం...    

*ఊరి బడి వజ్రోత్సవం జరపుదాo _ చదువు నేర్పిన ఋణం తీర్చుకుందాం*. 

 నందివనపర్తి లో బడి ప్రారంభమై 60ఏండ్లకు పైనే అయి ఉండొచ్చు.. 
ఎందరికో ఓనమాలు దిద్దించి విద్యావంతులను చేసింది ఈ బడే..
 వారంతా జీవితంలో గొప్పగా ఎదిగిన వారుగా ఉన్నారు... అందరినీ మల్లా ఆ బడికి పిలిచి వారికి ఆనందం పెంచడంతో పాటు, ఆ బడికి కొండంత అండ వచ్చేలా చేయొచ్చు.

ఊరి బడి వజ్రోత్సం పేర  ఒక మంచి కార్యక్రమ నిర్వహణతో అత్యద్భుత ఫలితాలు రావొచ్చు.   
 *మానవ సంస్కార నిలయాలు అమ్మ ఒడి, బడి, గుడి* అని మన పెద్దలు చెప్పిన మాట అక్షర సత్యం.

ఈ క్షేత్రంలో అనేక గుడులన్నాయి, వాటి ద్వారా అనేక ఉత్సవాలు జరుగుతున్నాయి.. 
అదే విధంగా బడి ఉన్నది, అది ఎంతో మందికి చదువు నేర్పింది, బతుకు నేర్పింది. ఆ ఆ బడి ఋణం తీర్చుకునే అవకాశం తీసుకుందాం. 
 అందుకే ఈ బడిలో చదివిన అందరినీ కలిపి ఒక అద్భుత ఉత్సవం  చేసి ఒక గొప్ప ఆనవాయితీనీ ప్రారంభించవచ్చు. అది రేపటి తరం పిల్లలకు ఆసరా, అభయ హస్తం కావచ్చు.

అవకాశం ఉన్న కొందరు అప్పడప్పుడు పూర్వ విద్యార్థుల సమ్మేళనాల ద్వారా కలుస్తున్నారు..
దానిని సామూహికం చేసి నందివనపర్తి పాఠశాల వజ్రోత్సవం జరిపితే అద్భుతంగా ఉంటుంది.
ఈ ఆలోచన అందరి మనసుల్లో ఉంటుంది.
నాకైతే గత కొన్నేళ్లుగా ఏళ్లుగా నిరoతరంగా ఉంటుంది, కొందరి పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళాం..
ఇప్పుడు సమయం వచ్చినట్టుంది..
 కావున గ్రామంలోని *యువజన సంఘాలు, ముఖ్యంగా జ్యోతి యూత్ అసోసియేషన్ మరియు గ్రామ పంచాయతీ మరియు ZPHS పాఠశాల సిబ్బంది  సహకార సమన్వయంతో ఈ ఉత్సవం జరిగి అద్బుత ఫలితాలుo టాయి.*

కొంత ఎక్కువ సమయం తీసుకుని, అద్బుత ప్రణాళికతో ఉత్సవం జరుపొచ్చు..
రాష్ట్రానికి ఒక గొప్ప మోడల్ ఇవ్వొచ్చు.

కావున యువజన సంఘాల పెద్దలు సమయం తీసుకుని, *పూర్వ  SSC Batches నుండి కొందరిని తీసుకుని ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తే ఒక అద్బుత ప్రణాళికతో ముందుకెళ్ళొచ్చు*..
వ్యక్తిగతంగా నా వైపు నుండి కూడా సమయం ఇవ్వగలను..
*ఊరి బడి వజ్రోత్సవం జరపుదాo - చదువు నేర్పిన ఋణం తీర్చుకుందాం*
జరగాలి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు - అవి కావాలి పల్లె ఆణిముత్యాల అభయ హస్తాలు.

:~ సదా వెంకట్,
B.A., LL.B, PGDCJ.
(ZPHS NWP పూర్వ విద్యార్థి)

Saturday, January 3, 2026

SHATABDI TEAM

అద్బుత క్రీడా స్పూర్తికి వేదికైన GSF సాధన కుటీర్
సాధన కుటీర్ లో అట్టహాసంగా ప్రారంభమైన వివేకా బ్యాడ్మింటన్ టోర్నీ* - 2026.

టీం శతాబ్ది ఆధ్వర్యంలో  *వందేమాతరం రచించబడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు  పురస్కరించుకొని జ్ఞాన సరస్వతి ఫౌండేషన్, కలాం ఫౌండేషన్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ సహకారంతో "వివేకా బ్యాట్మింటన్ టోర్నమెంట్" ను అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది*
 ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిద్ధార్థ విద్యా సంస్థల  చైర్మన్ శ్రీ నాగయ్య గారు,  ముఖ్య వక్తగా ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారక్ శ్రీ అచ్చుత్ గారు పాల్గొనడం జరిగింది.
 టోర్నమెంట్ ని ఉద్దేశించి వచ్చిన పెద్దలు బ్యాడ్మింటన్ ఆట ద్వారా యువ క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని, అదే మాదిరిగా మధ్య వయస్సు ఉన్న వాళ్లకు  ఫిట్నెస్ లెవెల్స్ పెంచుతుందని, క్రీడల ద్వారా దేశ ప్రతిష్టత పెరుగుతుందని తెలిపారు. గ్రామీణ క్రీడా కారుల ప్రతిభను గురించి ప్రోత్సహించాలనే సదాశయ స్పూర్తితో GSF ద్వారా క్రీడా శిబిరాలు నిర్వహించ బడుతున్నాయి. అదే స్పూర్తితో ఈ అద్బుత టోర్నమెంట్ కోసం సాధన కుటీర్ వేదిక కావడం మంచి అవకాశంగా  భావిస్తున్నామని GSF సాదనా కుటీర వ్యవస్థాపకులు, సదా వెంకట్ గారు తెలిపారు.
టోర్నమెంట్ లో 60 టీమ్స్ రెండు విభాగాల్లో వయస్సు 40లోపు మరియు 40 పై పాల్గొనడం జరిగింది.
ఈ రోజుతో లీగ్ మ్యాచ్స్ ముగియడం జరిగింది.
 jan 6 మంగళవారం రోజు ఉదయం ఫైనల్స్ నిర్వహించిన తర్వాత గెలిచిన వారికి 2 విభాగాల్లో  మొదటి బహుమతి ₹5000/- రెండవ బహుమతి ₹2000/– తో పాటు మేమెంటోస్, ప్రశంస పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమంలో  కలాం ఫౌండేషన్ సభ్యులు బుచ్చయ్య గారు, టేకీ రైడ్ ప్రతినిధులు మహేష్ గరినే మరియు టీం శతాబ్ది సభ్యులు 40 మంది పాల్గొనడం జరిగింది.
:~ టీమ్ శతాబ్ది.