Wednesday, October 15, 2025

మారని వ్యక్తిత్వం @ శివధర్ రెడ్డి IPS.

*ఎంత ఎత్తుకు ఎదిగినా మారని వ్యక్తిత్వం* —
*పదవులు మారవచ్చు, బాధ్యతల పరిధి విస్తరించవచ్చు. కానీ మనసు మారకపోవడమే నిజమైన విజయo*.
 శివధర్ గారు, ఎన్ని ఉన్నత స్థాయిలకు వచ్చినా, సామాన్య ప్రజలతో కూడా సామరస్యంగా ఉండటం, ప్రజల వ్యాపారాల పట్ల సేవా భావం చూసేదే వారి గౌరవానికి మూలం.
అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) స్థాయిలో విశాఖపట్నం జిల్లాలో సేవ చేయడం మొదలుకుని, వివిధ స్థాయిలో  ఆయన బాధ్యతలు పెరిగాయి.  గౌరవనీయమైన విధుల్లో, Greyhounds యూనిట్‌లో చురుకైన పాత్ర వహించడం ద్వారా ఆయన తీవ్ర ప్రభావాన్ని చూపించారు. 
చిర్రూపమైన వ్యక్తిత్వం — చరిత్రలో నిలిచే ప్రమాణం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 2014లో అట్రైరుగా ఏర్పడిన ఇంటెలిజెన్స్ శాఖ-చీఫ్‌గా నియమితులయ్యే అవకాశం పొందిన శివధర్ గారు, తమ విధుల్లో కఠినతను, నిబద్ధతను ప్రదర్శించారు.
*2025లో, శివధర్ గారిని తెలంగాణ DGP గా నియమితులైనారు. అయినా వారి వ్యక్తివంతో లో ఏమాత్రం మార్పు లేదు అదే ఓపిక, ఒద్దిక, వినయం, సహనం*.

*గత పుష్కర కాలం( 12ఏళ్లుగా)  నుండి గుడి బడి కేంద్రంగా *జ్ఞానసరస్వతి సేవాసంస్థల ద్వారా విద్యార్థుల వికాసం కోసం జరుగుతున్న కార్యక్రమాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి, అంతే స్థాయిలో అభిమానం చూపారు.*

మీ లాంటి వారు పల్లె ఆణిముత్యాలను ఆశీర్వదించి, వారికి ప్రేరణ ఇవ్వాలి అని ఎప్పుడు ఆహ్వానం  పలికినా 2015 నుండి ప్రతీ సంవత్సరం జరిగే కార్యక్రమాలకు విచ్చేసి పల్లె ఆణిముత్యాలను ఆశీర్వదించారు.

*వారు DGP గా నియమితులైన సందర్భంగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మేము వెళితే, పుష్కర కాలం క్రితం నుండి మా పట్ల చూపుతున్న అభిమానం, వినయమే వారిలో స్పష్టంగా కనబడింది.*
*ఎంత ఎత్తుకు ఎదిగినా మారని వారి వ్యక్తితానికి మరోసారి వినయ పూర్వక శుభాభినందలు తెలుపుదాం*.

*అత్యున్నత పదవిలో వారు తమ విధులను సంపూర్ణంగా నిర్వహించాలని, వారికి భగవంతుడు ఆ శక్తి సామర్థ్యాలను అందివ్వాలని జ్ఞాన సరస్వతి సేవాసంస్థల తరపున ఆశిద్దాం*.
:~ సదా వెంకట్, GSF.

No comments:

Post a Comment