Friday, April 26, 2024

సాధన శిబిరం - 2024

ప్రతిభను గుర్తిద్దాం - ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూత అందిద్దాం 

సరైన సమయంలో ఆపన్న హస్తాల ప్రోత్సాహం అందక, ఏ గుర్తింపుకు నోచుకోక ఎందరో ప్రతిభావంతుల ప్రతిభలు మొగ్గలోనే వాడిపోయి మరుగున పడ్డాయన్నది నిష్టురసత్యం.
మనలోని అనాసక్తుల వల్ల ఎందరో ప్రతిభావంతులకు కొంత నష్టమే జరిగినా తద్వారా సమాజానికి మాత్రం తీరనిలోటు ఏర్పడుతుందని నమ్మక తప్పని నిజం.
 అందుకే వీళ్ళను గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహిస్తే దేశ ప్రగతికి కరదీపికలవుతారు. అంతేకాదు తమలాంటి ప్రతిభా కణికలెందరినో పుట్టిస్తారు. 
సరైన సమయంలో వారికి మనం అందించే ఆత్మీయ ప్రోత్సాహం వారి జీవితాల్లో వెలుగులు నింపి, తమ ప్రాంత ప్రతిభా రూపాలను ప్రోత్సహించి, ఆ ప్రాంత అభివృద్ధికి...దేశ ప్రగతికి బాటలు వేస్తారు.

మన ప్రోత్సాహమే పలు దీపాలను వెలుగిస్తున్నప్పుడు మనలో కలిగే తృప్తి అపూర్వం..అమూల్యం..అనంతం... అజరామరం...

రండీ, పల్లె మట్టిలో దాగున్న అసంఖ్యాక ఆణిముత్యాలు వెలికి తీసి,మెరుగులు దిద్దే పవిత్ర కార్యంలో నేను సైతం అంటూ అందరం భాగస్వాములం అవుదాం.
:~ భవదీయ
సదా వెంకట్, 
జ్ఞానసరస్వతి ఫౌండేషన్,

No comments:

Post a Comment