Wednesday, December 27, 2023

కాల నిర్ణయానికి స్వాగతం

*ప్రకృతికి శిరసా ప్రణామాలు🙏🏼*
బడుగు బలహీన వర్గాల పిల్లలే నేడు పల్లెల్లోని ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారనేది మనందరికీ తెలుసు...వారిలో ప్రతిభకు కొదవ లేదు..  
సరైన సమయంలో మార్గదర్శనంతో పాటు ఆపన్న హస్తాల ప్రోత్సహం  అందక, ఏ గుర్తింపుకు నోచుకోక ఎందరో ప్రతిభావంతుల ప్రతిభ మొగ్గలోనే వాడిపోయి మరుగున పడ్డాయన్నది నిష్టురసత్యం...
మనలోని అనాసక్తులవల్ల ఎందరో ప్రతిభావంతులకు కొంత నష్టమే జరిగినా, తద్వారా సమాజానికి మాత్రం తీరని లోటు ఏర్పడుతుందని నమ్మక తప్పని నిజం. అందుకే అలాంటి వారిని సరైన సమయంలో గుర్తించి, వెన్నుతట్టి ప్రోత్సహిస్తే దేశ ప్రగతికి కరదీపికలవుతారు. అంతేకాదు  తమలాంటి ప్రతిభా కణికలెందరికో ప్రేరణవుతారు.  వారికి మనం అందించే ప్రోత్సాహం, వారి జీవితాలలో వెలుగులు నింపి, తమ ప్రాంత ప్రతిభా రూపాలను ప్రోత్సహించి ఆ ప్రాంతపు అభివృద్ధికి...తద్వారా దేశ ప్రగతికి బాటలు వేస్తారు.. మన ప్రోత్సాహమే పలు దీపాలను వెలిగిస్తున్నప్పుడు మనలో కలిగే తృప్తి అపూర్వం...
అమూల్యం అనంతం...
పల్లె మట్టిలో దాగున్న అసంఖ్యాక ఆణిముత్యాల పతిభను సరైన సమయంలో మెరుగులు దిద్ది సమాజానికి పరిచయం చేయాలనే 
పవిత్ర కార్యాన్ని బాధ్యతగా బావించి గత 15 ఏళ్లుగా జ్ఞానసరస్వతి పౌండేషన్
 పల్లె ఆణిముత్యాల ప్రగతి కోసం ప్రయత్నం కొనసాగిస్తున్నది..
నిజాయితీగా జరిగే ఏ ఉద్యామానికైనా,  ఏ కార్యానికైనా ప్రకృతి తలవంచి సహకరిస్తుందని నమ్మి, ఆచరిస్తున్నది GSF..
    సదాశయంగా సంకల్పoతో  సేవను బాధ్యతగా నిర్వహిస్తున పనికి ప్రకృతి అండగా నిలబడింది..నిర్వహించిన ప్రతీ కార్యానికి తాను గుప్త సహకారిగా ఉన్నది.

*ఆటు_పొట్లను ఎదురిచ్చి, వాటిని ఎదుర్కొనే శక్తినీ తానే ప్రసాదించింది ప్రకృతి.. 

*పల్లె ఆణిముత్యాల ప్రగతి కోసం పుష్కరకాలం  నిర్వహించిన కార్యక్రమాల సారంగా అనేక కొత్త ఆలోచనలు మదిలో కలిగించి వాటి ఆచరణకూ శక్తిని ఇచ్చి, అవసరమైన ఉపకరణాలను తానే సమకూర్చుతుంది*...
ఇన్నేళ్ళ కార్యక్రమాల సారంగా *విద్యార్థులకు నిర్మాణాత్మకoగా ఉపయోగపడే కార్యాలను మదిలో చొప్పించి, నిర్వహణకు తన ఉపకరణాలుగా అనేక మంది సేవా తత్పరులను తోడిచ్చి పద పదరా సదా అని తోసేసింది.*
 *పది రూపాయలు జేబులో లేకున్నా 10 లక్షల పనులకు భరోసా ఇచ్చి పూర్తి చేయించిన ప్రకృతికి శిరసా ప్రణామాలు🙏🏼*.

*దేవతా కాలం నుండీ ఉన్న అసురుల మాదిరే, రూపం మారి అనేక రూపాల్లో ఉన్న అసూయ పరుల అనాలోచిత చర్యల కారణంగా  రెండేళ్ల క్రిత్రం అక్రమంగా కూల్చబడ్డ 
పల్లె ఆణిముత్యాల కలల సౌధం సాధన కుటీర్  మెల్లగా తన పూర్వ స్థితికి చేరుకుంటుంది, చేరుకోవాలి కూడా..
 *SAC_Sports,Academics, Cultural అంశాలలో ప్రతిభ గల ఆర్థిక నిరుపేదల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలనే సదాశయంతో ముందుకు సాగుతున్నది..

ఆశయంతో సాగుతున్న ఈ పవిత్ర కార్యానికి నేను సైతం అంటూ అండగా ఉంటున్న ప్రతీ వ్యక్తికి, వ్యవస్థకు హృదయ పూర్వక ధన్యవాదాలు. 

నిజాయితీగా జరిగే ప్రతీ కార్యానికి ప్రకృతి అండగా ఉంటుందని నమ్మి, ఆచరణలో ఇసుమంతైనా. నిజాయితీని సడలనివ్వని శక్తిని ఇమ్మని భవంతున్ని  మనసా కోరుతూ..

2022 పిబ్రవరిలో  అక్రమంగా కూల్చబడ్డ సాధన కుటీర్ స్వాగత ద్వారo మళ్లీ నిటారుగా నిలబడి పల్లె ఆణిముత్యాల ఆగమనం కోసం ఎదురు చూస్తున్నది*..

 ఈ రోజే ఏర్పాటు చేయబడ్డ స్వాగత ద్వారం(GATE).

:~ *సదా వెంకట్*
   Founder_GSF.
(అక్రమంగా కూల్చిన సమాచారం శ్రేయోిలాషులకూ, సమాజానికి తెలిపిన కారణంగా పున: నిర్మాణ స్థితులు తెలపాలనే ఉద్దేశ్యంతో)

No comments:

Post a Comment