GNANA SARASWATHI FOUNDATION
A PLATFORM TO DISCOVER HIDDEN TALENTS OF RURAL GOVT SCHOOL STUDENTS
Thursday, October 8, 2026
Wednesday, October 7, 2026
పల్లె ఆణిముత్యాల పద్యగానం
అందరికి శుభోదయం. నిన్న మా పాఠశాల కు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి మేడం వచ్చారు.వారి ముందు మా పిల్లలు చక్కగా పద్యాలు పాడారు. వాటి భావాలు కూడా అడిగారు పిల్లలు చక్కగా చెప్పారు పద్యాల తోరణం కార్యక్రమం గురించి చెప్పాము.అభినందనలు తెలియచేసారు. జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వారికి వేవేల కృతజ్ఞతలు. ZPHS బాలికల పాఠశాల, షాద్నగర్.
Monday, October 5, 2026
రామ నామ ఉచ్చారణ భలం
Tuesday, September 22, 2026
నిస్వార్ధ నిశ్శబ్ద సేవ
Saturday, September 5, 2026
ఉపాధ్యాయ దినోత్సవం -2026
Thursday, September 3, 2026
పద్యానికి తోడ్పాటు - ఆహ్వానం
Monday, August 31, 2026
DEO పుస్తకావిష్కరణ
Thursday, August 27, 2026
సాధన Camp - September Spell
Tuesday, August 25, 2026
గోపాల్ జీ @ పద్యాల తోరణం
Tuesday, August 11, 2026
PSSR LAXMI ji Session
Friday, August 7, 2026
సాకులు విజయాన్ని సృష్టించవు
వ్యక్తిత్వం లేని ప్రతిభ ప్రమాదకరం.ప్రతిభ లేని వ్యక్తిత్వం అసంపూర్ణం.
వ్యక్తిత్వం – ప్రతిభ రెండూ కలిసినప్పుడే మనిషి నిజమైన మహోన్నతుడవుతాడు.
అయితే ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి...
మన ప్రతిభను, మన వ్యక్తిత్వాన్ని ఎదగనివ్వడం గానీ, ఎదగకుండా ఆపడం గానీ మరెవరి చేతుల్లో ఉండదు. అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది."అవకాశాలు రాలేదు...", "ఎవరూ ప్రోత్సహించలేదు...", "పరిస్థితులు అనుకూలించలేదు...", "వాళ్ల వల్ల నేను ఎదగలేకపోయాను..." అంటూ కుంటి సాకులు చెప్పుకుంటూ కాలాన్ని వృథా చేసుకోవద్దు.
ఎందుకంటే...
సాకులు విజయాన్ని సృష్టించవు; సాధనే విజయాన్ని సృష్టిస్తుంది.
నెపాలు వ్యక్తిత్వాన్ని నిర్మించవు; బాధ్యత నిర్మిస్తుంది.
ప్రతిరోజూ మనల్ని మనం కొంచెం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగితే, ఒక రోజు మనమే మన విజయానికి నిదర్శనంగా నిలుస్తాం.
సాకులు చెప్పడం ఆపేద్దాం...బాధ్యతను స్వీకరిద్దాం...
వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుందాం...
ప్రతిభను పదును పెట్టుకుందాం...
ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో ముందుకు సాగిపోదాం!
ఎందుకంటే...
మన జీవితానికి శిల్పి మనమే.
మన వ్యక్తిత్వానికి నిర్మాత మనమే.
మన విజయానికి బాధ్యులం కూడా మనమే.