Monday, October 5, 2026

రామ నామ ఉచ్చారణ భలం

అఖండ కార్యకర్తలు, సభ్యులు, శ్రేయోభిలాషులందరం గమనిద్దాం..
లోకకళ్యాణం కోసం, వీరపట్నం పరిసర ప్రాంతాలు సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని కాంక్షిస్తూ, *2015వ సంవత్సరం పవిత్ర కార్తీక పౌర్ణమి రోజున  జగద్గురు శంకరాచార్యులు, శ్రీ హంపీ వీరుపాక్ష విద్యారణ్య భారతి స్వామిజీ కరకమలములచే పెద్ద చెరువులో గంగమ్మకు అఖండ హారతి – రాచకొండలో శివయ్యకు అఖండజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించాము.* నాటి నుంచి ఆ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది.

అదేవిధంగా, *ఆంజనేయస్వామి దివ్య అనుగ్రహంతో మరో మహత్తర కార్యంగా 108 అడుగుల శ్రీ పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణానికి సంకల్పం జరిగింది.*

*పనుల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ, ఈ పవిత్ర కార్యాన్ని ఆ దైవమే మన ద్వారా పూర్తి చేయించుకుంటుందనే విశ్వాసం మనకుంది. లోకకళ్యాణం కోసం సంకల్పించిన కార్యంలో జాప్యం జరిగిందంటే, అది మరింత గొప్పగా, మరింత వైభవంగా జరగాలనే దైవ సంకల్పంగా భావిద్దాం.*

*బహుశా… ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైనట్టుంది*.

*మనందరి భాగస్వామ్యంతో తన కార్యాన్ని పూర్తి చేయించుకోవాలని ఆంజనేయస్వామి మనకు అవకాశం కల్పిస్తున్నాడని భావిద్దాం. రాబోయే కొన్ని రోజుల్లో ఆ దైవ కార్యం వైపు మన పయనం ప్రారంభిద్దాం.*

*అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన సమయాన్ని ఈ పవిత్ర కార్యం కోసం వెచ్చించేందుకు సిద్ధం కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణను సమయానుకూలంగా తెలియజేస్తాము.*

*దైవ కార్యంలో… ధర్మ కార్యంలో అందరూ సామాన్యులే, అందరూ సమానులే.*
*హోదాలకు,స్థాయులకు, భేదాలకు అతీతంగా మనమంతా ఒక్కటై, ఆంజనేయస్వామి కార్యానికి మన వంతు సమర్పిద్దాం.*

*దైవ సంకల్పానికి మన సంకల్పం తోడవుదాం*. 
*ధర్మ కార్యానికి మన సమయం, శ్రమ, సహకారం అందిద్దాం. ఆ పవిత్ర కార్యం కోసం సిద్ధంగా ఉందాం*.

జై శ్రీరామ్!
జై హనుమాన్!

భవదీయులు,
సదా వెంకట్,
హరివర అఖండక్షేత్ర సమితి.

No comments:

Post a Comment