Thursday, July 30, 2026

SAADRI Session 30.07.2026

Nutrition Awareness Sessions – 30/07/2026
On 30/07/2026,
 GSF SAADRI conducted Nutrition Awareness Sessions at "PM SHRI ZPHS Kongara Kalan", 
ZPHS NaganPally, 
and ZPHS Chennareddy Guda.
The programme began with an introduction by 
Smt. Pramoda, In-charge of SAADRI, followed by nutrition sessions conducted by 
Smt. Mamtha Bagade and Smt.Mamatha .
Students actively participated in the interactive role-play activity.

We thank the school managements for providing students with the opportunity to learn about healthy eating habits and the importance of a balanced diet for adolescents.Special thanks to Smt. Nandini Ma'am for arranging lunch for our team.
At the end of the session, the #GSF_SAADRI team led the students in taking the Pledge written  by Dr. A.P.J. Abdul Kalam, encouraging them to become responsible, disciplined, and dedicated citizens.
~: team #SAADRI.

వందేమాతరం

వందే మాతరం – జాతి గౌరవానికి చట్టబద్ధ రక్షణ
భారతదేశ స్వాతంత్ర్యోద్యమానికి ప్రాణం పోసిన మహోన్నత జాతీయ గీతం **"వందే మాతరం"**కు కేంద్ర ప్రభుత్వం మరింత గౌరవాన్ని కల్పించే దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. పూర్తి వందే మాతరం గేయాన్ని అధికారిక సందర్భాల్లో తప్పనిసరిగా ఆలపించేలా, అలాగే దానిని ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా గానం చేయడాన్ని అడ్డుకోవడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవడం దేశభక్తిని బలోపేతం చేసే గొప్ప ముందడుగు.

"వందే మాతరం" అనేది కేవలం ఒక గీతం కాదు; అది భారతమాతకు అర్పించే వందనం, స్వాతంత్ర్య సమరయోధుల ప్రేరణ, జాతీయ చైతన్యానికి చిరస్థాయి ప్రతీక. బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఈ గేయం స్వాతంత్ర్యోద్యమ కాలంలో లక్షలాది భారతీయుల హృదయాల్లో దేశభక్తి జ్వాలను రగిలించింది. అనేక మంది వీరులు "వందే మాతరం" నినాదాన్ని తమ చివరి శ్వాస వరకు గర్వంగా పలికారు.

(వందేమాతర పూర్తి గేయంపై గౌరవ అప్పాల ప్రసాద్ గారి సందేశం👇🏻 
https://youtu.be/a89b1FjdgUc?si=wGNYYBU5LcTK0SEz )

ఈ నిర్ణయం మరింత ఆనందాన్ని కలిగించడానికి మరో కారణం కూడా ఉంది. జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ (GSF) 2008వ సంవత్సరం నుంచే పాఠశాల విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించాలనే సంకల్పంతో పూర్తి వందే మాతరం గేయంపై పోటీలు నిర్వహిస్తోంది. కేవలం పోటీలకే పరిమితం కాకుండా, అనేక పాఠశాలలకు పూర్తి గేయ సాహిత్యాన్ని (Lyrics), సంగీతాన్ని (Music) ఉచితంగా అందించి విద్యార్థులు సంపూర్ణంగా నేర్చుకునేలా నిరంతరం కృషి చేసింది. నేడు ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేయడం GSF వంటి సంస్థల దీర్ఘకాలిక ప్రయత్నాలకు ఒక గుర్తింపుగా భావించవచ్చు.

(GSF కార్యక్రమాలలో వందేమాతరం పూర్తి గేయం👇🏻 
https://youtu.be/06MvlDpTNwQ?si=CtKYtUQ9meRjwQcI) 

జాతీయ గీతాలు, జాతీయ చిహ్నాలు కేవలం చట్టాల ద్వారా మాత్రమే కాదు, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించినప్పుడే వాటి గొప్పతనం నిలుస్తుంది. అందుకే ప్రతి పాఠశాలలో, ప్రతి విద్యార్థి హృదయంలో పూర్తి వందే మాతరం మారుమోగాలి. అదే నిజమైన దేశభక్తి, అదే భారతమాతకు మనం అందించే అత్యున్నత వందనం.
వందే మాతరం!
భారత్ మాతాకీ జై!

Monday, July 27, 2026

దాశరథి సినారే జయoతి 2026

దాశరథి సినారె జయంతి వేడుకలు విజయవంతం చేయడంలో తోడ్పాటు అందించిన మాతా పితరుల సేవాసదనం పెద్దలందరికీ పాదాభివందనాలు!
    ఎంతో శ్రమకోర్చి కార్యక్రమం లో పాల్గొన్న అనంత పెద్దదిక్కు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. నామోజు బాలా చారి గారి ప్రేమకు అనేకానేక కృతజ్ఞతలు!!!
     పిలవగానే ఎంతో దూరం నుంచి ప్రేమ వాక్యాలను మోసుకొచ్చిన రంగన్నకు ఆత్మీయాలింగనాలు!!!
       నా మాట కాదనకుండా దాశరథి గురించి సైద్ధాంతిక ప్రసంగం చిలకరించిన పెద్దన్న మా వ్యవస్థాపక అధ్యక్షులు డా. తూర్పు మల్లారెడ్డి గారికి వందనమందారాలు!!!
    నా పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చిన సూర గిరి గారికి, సంధ్యమ్మకు వందనాలు! చిన్నారి జ్ఞానేశ్వరికి ఆశీస్సులు!!! మాలలో దారంలా కార్యక్రమానికి, ఈ కార్యానికి మూలాధారమైన మిత్రులు జానకి రామారావు గారికి పాదాభివందనాలు!!!
    పుస్తకాన్ని కవితాత్మకంగా పరిచయం చేసిన ప్రముఖ కవి, నా బిడ్డ చిగురాల్ కు ప్రేమపూర్వక ఆశీస్సులు!!!
      పుస్తకం ముఖచిత్రం తీర్చిదిద్దిన తమ్ముడు సాగర్లకు, తన చిత్రం ముఖచిత్రం గా మార్చుకునేందుకు అంగీకరించడమే గాక, తన తొలి కవి సమ్మేళనం లో నా పట్ల అపారమైన ప్రేమాభిమానాలు ప్రకటించిన మా సీతమ్మ కు ఆశీరభినందనలు!!!
      నా రాయపోల్ విద్యార్థినీవిద్యార్థులు వేదికను పాఠశాలగా మార్చి, నన్ను 37 ఏళ్ళు చిన్న వాణ్ణి చేసినారు. చెరగని వాళ్ళ ప్రేమాభిమానాలకు ఆనందబాష్పాల ఆశీస్సులు!!!
    తెలుగు భాష, పద్య వికాసాల కోసం కృషి చేస్తున్న మిత్రులు, పద్యాల తోరణం నిర్వహిస్తున్న జ్ఞానసరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సదా వెంకటరెడ్డి గారికి ఆదరపూర్వక ధన్యవాదాలు!
  బహుమతి విజేతలుగా కార్యక్రమానికి వన్నె తెచ్చిన 
*కోటం చంద్రశేఖర్*
*పల్లె శ్రీనయ్య*
*మహ్మద్ షరీఫ్*
*సాగర్ల సత్తయ్య* లకు 
అభినందన చందనాలు!!!
ఈ కార్యక్రమంలో ప్రార్థనను అద్భుతంగా, అర్థవంతంగా గానం చేసిన పల్లె శ్రీనయ్యకు మనసునిండా ఆశీస్సులు!
     నా ఆత్మీయ మిత్రుడు మాధవకు, అక్క ధరణికి ఆత్మీయ వందనాలు!!!
     కార్యక్రమం లో పాల్గొన్న సంస్థ ప్రతినిధులకు, స్నేహితులకు , కవులకు, అనంత కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు!!!
      ఇంకా ఎవరినైనా మరచి ఉంటే... అందరికీ మరోసారి కృతజ్ఞతలు!!!
 🙏🙏🙏

Friday, July 24, 2026

పద్యాల తోరణం : దోరవేటి

*సంకల్ప బలమే విజయసాధనకు తొలిమెట్టు*.---- దోరవేటి
+++++++++++++++++++++++
ప్రభుత్వ పాఠశాల్లో చదివే పిల్లల సమగ్రాభివృద్ధి కోసం పాటుపడుతున్న సంస్థ జ్ఞాన సరస్వతి ఫౌండేషన్. వ్యవస్థాపకులు శ్రీ సదా వెంకట రెడ్డి గారు ఈ సదాశయంతో తన సమస్తాన్ని వర్ధమాన సమాజానికి అంకితం చేస్తూ  అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా తెలుగు పద్యాలను ఈ తరం విద్యార్థులకు కంఠస్థం చేయించాలని దానివల్ల తెలుగు భాష మాధుర్యం, తెలుగు భాష ఉన్నతి, విస్తృతి సక్రమంగా జరుగుతాయని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పద్యాల తోరణం కార్యక్రమం నిర్వహించేందుకు  మాతో కలిసి చర్చించడం జరిగింది. ఈ ఆశయ సాధనకు తప్పకుండా మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ఇప్పటికే మూడు నాలుగు సార్లు ఈ విషయం మీద చర్చించడం కూడా అయింది. ఇదే సందర్భంలో ఇటీవలి కాలంలో భవాని జగదీశ్వర్ రెడ్డి ద్వారా ఒక విషయం తెలిసింది. 
    తమ్ముడు కందాడ రంగరాజు తన విద్యార్థుల కోసం శతకాల నుండి భారత భాగవతాది గ్రంథాల నుండి ఆణిముత్యాలు వంటి పద్యాలను సేకరించి పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు కోసం ఒక పుస్తకాన్ని రూపొందించినారని అది ప్రజాల తోరణం నిర్వహణకు బాగా ఉపకరిస్తుందని ఈ విషయంలో తనతో మాట్లాడాలని కూడా చెప్పినారు. 
    సదా వెంకటరెడ్డి ఆశయం, కండాడై రంగరాజు ఆలోచన రెండూ ఒకటైతే పద్యాల తోరణం కార్యక్రమం నిర్వహణ తేలికవుతుందని అనిపించి ఈ పుస్తకాన్ని జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ద్వారా ప్రకటించాలని కోరడం జరిగింది. అందుకు వెంకట రెడ్డి గారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తప్పకుండా మేమే దాన్ని ప్రచురిస్తామని ప్రకటించారు. ఆ విధంగా సుమారు 200 పై చిలుకు పద్యాలు ఉన్న ఈ గ్రంథం మీ చేతుల్లోకి వచ్చింది.
     తొలి ప్రయత్నం గా పిల్లలకు కొన్ని పద్యాలు మాత్రం నేర్చుకొని, పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాం. దీని తర్వాత దశలో పద్యాల సంఖ్య పెంచడం;  పద్యాల అంత్యాక్షరి కార్యక్రమం చేపట్టడం;  సామూహికంగా పద్య సాధన చేయించడం; సామూహిక పద్యాల పోటీ నిర్వహించడం... ఈ తెలుగు పద్యాల ధారణ, విస్తృతి లో భాగంగా మాకు ఉన్న యోజన తప్పకుండా కార్యరూపం దాల్చి అనుకున్న ఫలితాలను సాధిస్తుందని, వెంకటరెడ్డి గారు కోరుకున్నట్లు జిల్లా అంతట పద్య పరిమళం వ్యాపించడమే కాకుండా ఇతర జిల్లాలకు ఇది స్ఫూర్తిగా నిలబడగలదని నా ప్రగాఢ విశ్వాసం. ఇందుకోసం తెలుగు పండితులు, పండిత పరిషత్తు, ఇతర ఉపాధ్యాయ సంఘాల మిత్రులు, విశేషించి మండల , జిల్లా విద్యాధికారులు ఎంతో సహృదయంతో సహకరిస్తుండటం మా ఆశయ సాఫల్యానికి ఊతమిస్తున్నది. అందుకు ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, వారి కృషికి, సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పుస్తక ప్రయోజనం కేవలం పిల్లలకు పరిమితం కాకుండా, పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా దీని ప్రయోజనాన్ని పొందాలని ఆశిస్తున్నాం.
     మున్ముందు తెలుగు పండితులకు, ఉపాధ్యాయులకు,  పెద్దవాళ్లకు కూడా ఈ పోటీల్లో అవకాశం కల్పించాలని , పద్యాల అంత్యాక్షరి, పద్యపఠన వైవిధ్యం, అష్టావధాన, శతావధాన కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచన ఉన్నది కాబట్టి ఈ విషయంలో పెద్దలు, విజ్ఞులు పద్యాభిమానులు, తెలుగు పండితులు అవసరమైన సూచనలు చేస్తే వాటిని మున్ముందు యోజనలో, పుస్తకం పునర్ ముద్రణలో అవకాశం ఉన్న మేర సవరణలు చేసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాం.
     *ఈ విషయంలో సహకరించడానికి మా అనంత సాహిత్య సంస్కృతిక వేదిక ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారని ప్రకటించడానికి గర్విస్తున్నాను.* 
    పద్యాభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు! ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు !

Wednesday, July 22, 2026

పద్యాల తోరణం :~ సదా వెంకట్

తెలుగు భాషను భవిష్యత్ తరాలకు భద్రంగా అందిద్దాం.
___సదా వెంకట్, జ్ఞానసరస్వతి ఫౌండేషన్.
అందరం భాగస్తులమవుదాం- మన వంతు సహకారం అందిద్దాం.
             
తెలుగు భాషను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలనే సదాశయంతో, పాఠశాల స్థాయి విద్యార్థుల్లో తెలుగు భాషపై మక్కువ, పట్టు, అభిరుచి పెంపొందించాలనే ఉద్దేశంతో "పద్యాలతో రణం" అనే కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పం కలిగింది.

    ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సమగ్ర వికాసం కోసం జ్ఞానసరస్వతి ఫౌండేషన్ (GSF) 2008 సంవత్సరం నుంచి రంగారెడ్డి జిల్లాలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వాటిలో దేశభక్తి గేయాల పోటీలు, ప్రతిభా పురస్కారాలు, ప్రభుత్వ పాఠశాలల వార్షికోత్సవాలు, పదవ తరగతి విద్యార్థుల కోసం "లక్ష్యం" పేరుతో 40 రోజుల శిబిరాలు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి, గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, సహృదయులైన పెద్దల సహకారంతో విజయవంతం గా నిర్వహించడం జరుగుతున్నది.

    ఈ కార్యక్రమాల ద్వారా వచ్చిన అనుభవ సారంతో GSF–SAC (Sports, Academics & Cultural) కార్యక్రమానికి రూపకల్పన చేయడమైంది.       
  ప్రతిభావంతుడైన      ఏ విద్యార్థి  కేవలం ఆర్థిక బలహీనత కారణంగా తన ప్రతిభను కోల్పోకూడదనే లక్ష్యంతో, అభిరుచి మరియు ప్రతిభ ఉన్న అంశాల్లో విద్యార్థులను ఎంపిక చేసి, సాధన కుటీర్‌లో నిరంతర శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నాము.

    వివిధ అంశాల్లో నిర్వహిస్తున్న ఈ శిబిరాల్లో భాగంగానే, ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భాష ఎదుర్కొంటున్న సవాళ్లను చూసి కలిగిన ఆవేదనతో, తెలుగు భాషను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలనే ఆశయంతో, పద్యం బతికి ఉంటే తెలుగు భాష జీవచైతన్యం తో వెలుగొందుతుందన్న సంకల్పం తో "పద్యాలతో రణం" కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది.

    ఈ ఆలోచనకు సరైన సమయంలో గౌరవనీయులు శ్రీ దోరవేటి  గారి మార్గదర్శనం, సహకారం , ఆశీస్సులు లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాను. అనంతరం శ్రీ భవాని జగదీశ్వర్ రెడ్డి గారి సమన్వయంతో, పలువురు తెలుగు ఉపాధ్యాయులు, తెలుగు భాషాభిమానులు, తెలుగు ఉపాధ్యాయ సంఘాల నాయకుల సహకారం లభించి ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చింది. అలాగే జిల్లా విద్యాశాఖ అనుమతి లభించడం మాకు మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించింది.

    ఇదే సమయంలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పద్యాలను సేకరించిన శ్రీ కాందాడై రంగరాజు గారు  పుస్తక రూపంలో తీసుకురావడం, ఇది ముద్రించే అవకాశం జ్ఞానసరస్వతి ఫౌండేషన్ కు ఇవ్వడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.

    పాఠశాల, మండల స్థాయిలలో "పద్యాలతో రణం"  కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న తెలుగు భాష ఉపాధ్యాయులకు, తెలుగు భాషాభిమానులకు జ్ఞానసరస్వతి ఫౌండేషన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భాగస్వామ్యంతో రంగారెడ్డి జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఇతర జిల్లాలకు కూడా స్ఫూర్తిగా నిలవాలని, విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరించి, తెలుగు భాషను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించే మహత్తర లక్ష్యానికి ప్రభుత్వ పాఠశాలలు బలమైన వేదికలుగా మారాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రత్యక్షంగా సహకరించిన గౌరవనీయులు శ్రీ దోరవేటి  గారికి, సోదర సమానులు, తెలుగు ఉపాధ్యాయులు శ్రీ భవాని జగదీశ్వర్ గారికి, మిత్రులు శ్రీ కందాడై రంగరాజు గారికి, తెలుగు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు, అలాగే ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన జిల్లా విద్యాశాఖ అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
###############
  ఈ పద్యాల తోరణం కార్యక్రమ నిర్వహణ కోసం తమ వంతు సహకారాన్ని అందించి, ఉత్సవం వైభవంగా జరగడoలో భాగస్తులు కావాలని అందరినీ ఆవనిస్తున్నాం.
###############

భవదీయుడు,
తెలుగు భాషాభిమాని,
సదా వెంకట్,
జ్ఞానసరస్వతి ఫౌండేషన్(GSF)

Monday, July 20, 2026

Parents Online Meet

GNANA SARASWATHI FOUNDATION.
SAC- Sports Wing
Successfully Completed the 
Google Meet with Parents of Sadhana Camp Students.

on 18.07.2026, Saturday 7 to 9pm
ఈ రోజు తొలిసారిగా Google Meet ద్వారా సమావేశంలో పాల్గొని, తమ విలువైన అభిప్రాయాలను పంచుకొని, తమ పిల్లల ప్రతిభను గుర్తించి, వారికి ఇష్టమైన క్రీడల్లో ప్రోత్సాహం అందించేందుకు ముందుకు వచ్చిన ప్రతి తల్లిదండ్రికి GSF కుటుంబం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన మీ ఈ చైతన్యం, మీ పిల్లల ఇష్టాల పట్ల ఉన్న బాధ్యత, నేటి సమాజానికి ఒక ఆదర్శం కావాలి.
 మీ ఆర్ధిక లేమిని మరిచి, మీ పిల్లల భవిష్యత్తు కోసం తపించే తల్లిదండ్రులుగా మీరు చూపిన శ్రద్ధ మాకు ఎంతో ప్రేరణ ఇచ్చిoది, మా సామాజిక బాధ్యతను మరింత పెంచుకోవాలసిన అవసరాన్ని చూసిoచిoది..
 తల్లిదండ్రులుగా మీరు, ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, సామాజిక బాధ్యతతో  మేము (GSF Sports team) తగినంత ప్రయత్నం చేసి పల్లె ఆణిముత్యాల ప్రతిభను ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేద్దాం..
ధన్యవాదాలతో
:~ సదా వెంకట్, GSF