Tuesday, September 22, 2026
నిస్వార్ధ నిశ్శబ్ద సేవ
🌿 GSF పద్యాల తోరణ బృందానికి శుభాకాంక్షలు… శుభాభినందనలు!
💐
మన ద్వారా వెచ్చించిన ప్రతి నిమిషం ఎంత విలువైనదో నిన్నటి పద్యాల తోరణం మహోత్సవం మరోసారి నిరూపించింది. ఒకటి రెండు విభాగాలు మినహా, అన్ని విభాగాల పనులు అనుకున్న విధంగా విజయవంతంగా సాగాయి.
ఉత్సవానికి విచ్చేసిన ఉపాధ్యాయులలో కనిపించిన సంతృప్తి, ఆశ్చర్యం, ఆనందం మ వ్యవస్థకు లభించిన గొప్ప ప్రశంస. వారు అందించిన అభిప్రాయ పత్రాలు కూడా అదే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
ఈ ఫలితం ఒక్కరి కృషి కాదు… ఎవరికి వారు ప్రచారానికి దూరంగా, నిస్వార్థంగా, నిశ్శబ్దంగా తమ బాధ్యతను నిర్వర్తించిన ప్రతి కార్యకర్త సమష్టి శ్రమకు ప్రతిఫలం.*
*ఆ నిశ్శబ్ద సేవే ఈ పద్యాల తోరణానికి అసలైన తోరణం!* 🌿
ఈ కార్యక్రమానికి ఆర్థికంగా, వస్తు రూపంలో, సమయం, శ్రమతో సహకరించిన ప్రతి హృదయానికి మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు.
మన వ్యవస్థ ఇతర జిల్లాలకు కూడా ఒక స్ఫూర్తిగా నిలవాలనే మన ఆకాంక్షకు మంచి స్పందన లభించింది. మూడు జిల్లాల నుంచి న్యాయనిర్ణేతలుగా విచ్చేసిన భాషా పావీణ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మనకు మరింత శక్తిని, బాధ్యతను ఇచ్చాయి.
మన్ననలు పొందింది ఒక కార్యక్రమం కాదు…
దాని వెనుక నిలిచిన నిస్వార్థ సేవా భావం.
ఈ మహోత్సవం విజయానికి తమ వంతు బాధ్యతను నిశ్శబ్దంగా, నిస్వార్థంగా నిర్వర్తించిన ప్రతి సేవకుడికీ
జిల్లా పద్యాల తోరణం మహోత్సవం బృందం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. 💐🙏
త్వరలో ఒక రోజు Online సమీక్ష నిర్వహిద్దాం. ముందుగా ఉపాధ్యాయుల సమీక్ష పూర్తయిన వెంటనే GSF బృందం సమీక్షను కూడా నిర్వహించుకుందాం.
బాధ్యత తీసుకోకుండా ఫలితాలను ఆశించలేము - సేవను బాధ్యతగా చేయాలన్న GSF నినాద స్ఫూర్తిని కొనసాగిద్దాం.
మన సేవ నిశ్శబ్దంగా ఉండొచ్చు… కానీ దాని ప్రభావం తరతరాలకు వినిపించాలి. 🌿
అందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. 💐
::~ #సదావెంకట్ GSF
Saturday, September 5, 2026
ఉపాధ్యాయ దినోత్సవం -2026
🌸 *ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు* 🌸
“ *అక్షరాలను నేర్పించేవారు ఉపాధ్యాయులు…కానీ ఆ అక్షరాలకు అర్థం చెప్పి, జీవితాన్ని తీర్చిదిద్దేవారు గురువులు*.”
*ఒక విద్యార్థి చేతిలోని పుస్తకాన్ని జ్ఞానదీపంగా మార్చేది ఉపాధ్యాయుడు.*
*ఒక సాధారణ విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, దానికి సరైన దిశను చూపేది ఉపాధ్యాయుడు.*
*విజయం వచ్చినప్పుడు అభినందించి, వైఫల్యం ఎదురైనప్పుడు ధైర్యం చెప్పి, జీవితంలో ముందుకు నడిపించే నిజమైన మార్గదర్శి గురువు*.
*డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం, ఉపాధ్యాయుల సేవలను స్మరించుకునే ఒక సందర్భం మాత్రమే కాదు… జ్ఞానాన్ని, విలువలను, బాధ్యతను భవిష్యత్ తరాలకు అందించే మహోన్నత వృత్తికి మనం ఇచ్చే గౌరవానికి ప్రతీక.*
*ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ, పరిమిత వనరుల మధ్య కూడా గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం*. *వారి కృషి వల్లే ఎన్నో ప్రతిభలు వెలుగులోకి వస్తున్నాయి; ఎన్నో జీవితాలు కొత్త దిశను అందుకుంటున్నాయి.*
*జ్ఞానసరస్వతి ఫౌండేషన్* (GSF) ఎప్పటినుంచో నమ్ముతున్నది ఒక్కటే
“ప్రతిభ ఎక్కడ ఉన్నా గుర్తించాలి… సరైన సమయంలో చేయూతనివ్వాలి… సరైన దిశలో నడిపించాలి.”
*ఈ మహత్తర లక్ష్యంలో ఉపాధ్యాయులు మా అత్యంత విలువైన భాగస్వాములు.*
*విద్యార్థుల్లో జ్ఞానంతో పాటు క్రమశిక్షణ, సంస్కారం, దేశభక్తి, సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించే ప్రతి ఉపాధ్యాయుడికి GSF హృదయపూర్వక వందనాలు*.
*ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని మాత్రమే మార్చడు*…
*ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, చివరికి ఒక దేశ భవిష్యత్తును మార్చగలడు*.
*అటువంటి మహోన్నత ఉపాధ్యాయులందరికీజ్ఞానసరస్వతి ఫౌండేషన్(GSF) తరఫున హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు*.
🙏*గురువులకు వందనాలు!* 🙏
*జ్ఞానం పంచుదాం… ప్రతిభను ప్రోత్సహిద్దాం*…
*భవిష్యత్ భారతాన్ని నిర్మిద్దాం*!
:~
*సదా వెంకట్, GSF*
Thursday, September 3, 2026
పద్యానికి తోడ్పాటు - ఆహ్వానం
🌺 పద్యాల తోరణం – తెలుగు పద్య పరిరక్షణకు మనందరి తోడ్పాటు 🌺
“తెలుగు భాషను భవిష్యత్ తరాలకు భద్రంగా అందిద్దాం”* అనే సదాశయంతో, *పాఠశాల స్థాయి నుంచే ప్రారంభమైన పద్యాల తోరణం కార్యక్రమం నేడు ఒక సాంస్కృతిక ఉద్యమంగా ముందుకు సాగాలన్నది ప్రతి తెలుగు భాషాభిమాని ఆకాంక్ష.*
*మన తెలుగు భాషకు, సాహిత్యానికి, పద్య సంపదకు ఉన్న గొప్పతనాన్ని భావితరాలకు పరిచయం చేస్తూ, వారిలో పద్యంపై ఆసక్తి, భాషపై అభిమానం, సాహిత్యంపై ప్రేమ పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.*
📢 పోటీల వివరాలు:
🔸 *సెప్టెంబర్ 6వ తేదీ నుండి ఆయా మండల కేంద్రాలలో మండల స్థాయి పద్యాల తోరణం పోటీలు జరుగుతాయి.*
🔸 *సెప్టెంబర్ 21వ తేదీన జిల్లా స్థాయి పద్యాల తోరణం పోటీలు, GSF సాధన కుటీర్లో నిర్వహించబడతాయి*.
*ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా స్థాయిలో, అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక📚 మరియు తెలుగు పండిత పరిషత్📖 సహకార–సమన్వయంతో, జ్ఞానసరస్వతి ఫౌండేషన్(GSF)📝 ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.*
*ఈ ప్రయత్నం కేవలం ఒక జిల్లా స్థాయికే పరిమితం కాకుండా, ఇతర జిల్లాలకు స్ఫూర్తిగా నిలిచి, రాష్ట్రవ్యాప్తంగా తెలుగు పద్య వైభవాన్ని చాటే ఉద్యమంగా రూపుదిద్దుకోవాలి అన్న ఆశయంతో నిర్వాహక బృందం ముందుకు సాగుతోంది*.
🙏 *ఈ మహత్తర సాహిత్య యజ్ఞంలో భాగస్వాములు కావాలని ఆహ్వానం*…
*తెలుగు సాహితీవేత్తలు, పండితులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, పద్య పఠకులు, పద్య గాయకులు, కళాకారులు, విద్యార్థులు మరియు తెలుగు భాషాభిమానులందరూ తమ వంతు సహకారం అందించాలని మనవి.*
*మీకు అవకాశం మేరకు*:
⏳ సమయాన్ని
💰 సంపదను
📚 జ్ఞానాన్ని
🤝 సహకారాన్ని
సమర్పించి, ఈ పద్యాల తోరణం ఉత్సవ నిర్వహణలో భాగస్వాములు కావచ్చు.
*ఒక్కరి ప్రయత్నం ఒక కార్యక్రమం కావచ్చు*…
*అందరి భాగస్వామ్యం ఒక ఉద్యమం అవుతుంది!*
📞 వివరాలకు:
+91 99513 92714
+91 96407 55648
+91 90002 51604
🌿 *పద్యం తెలుగు భాషకు ప్రాణం… పద్యాన్ని అందిపుచ్చుకుందాం*
🌿 *తెలుగు భాషను భద్రంగా భావితరాలకు అందిద్దాం!*
ధన్యవాదములతో,
తెలుగు భాషాభిమాని
:~ *సదా వెంకట్, GSF*
Subscribe to:
Posts (Atom)