Tuesday, September 22, 2026

నిస్వార్ధ నిశ్శబ్ద సేవ

🌿 GSF పద్యాల తోరణ బృందానికి శుభాకాంక్షలు… శుభాభినందనలు!
 💐
https://gnanasaraswathifoundation.blogspot.com/2026/09/2026_01943167953.html
మన ద్వారా వెచ్చించిన ప్రతి నిమిషం ఎంత విలువైనదో నిన్నటి పద్యాల తోరణం మహోత్సవం మరోసారి నిరూపించింది. ఒకటి రెండు విభాగాలు మినహా, అన్ని విభాగాల పనులు అనుకున్న విధంగా విజయవంతంగా సాగాయి.
ఉత్సవానికి విచ్చేసిన ఉపాధ్యాయులలో కనిపించిన సంతృప్తి, ఆశ్చర్యం, ఆనందం మ వ్యవస్థకు లభించిన గొప్ప ప్రశంస. వారు అందించిన అభిప్రాయ పత్రాలు కూడా అదే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

ఈ ఫలితం ఒక్కరి కృషి కాదు… ఎవరికి వారు ప్రచారానికి దూరంగా, నిస్వార్థంగా, నిశ్శబ్దంగా తమ బాధ్యతను నిర్వర్తించిన ప్రతి కార్యకర్త సమష్టి శ్రమకు ప్రతిఫలం.*
*ఆ నిశ్శబ్ద సేవే ఈ పద్యాల తోరణానికి అసలైన తోరణం!* 🌿

ఈ కార్యక్రమానికి ఆర్థికంగా, వస్తు రూపంలో, సమయం, శ్రమతో సహకరించిన ప్రతి హృదయానికి మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు.

మన వ్యవస్థ ఇతర జిల్లాలకు కూడా ఒక స్ఫూర్తిగా నిలవాలనే మన ఆకాంక్షకు మంచి స్పందన లభించింది. మూడు జిల్లాల నుంచి న్యాయనిర్ణేతలుగా విచ్చేసిన భాషా పావీణ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మనకు మరింత శక్తిని, బాధ్యతను ఇచ్చాయి.

మన్ననలు పొందింది ఒక కార్యక్రమం కాదు…
దాని వెనుక నిలిచిన నిస్వార్థ సేవా భావం.

ఈ మహోత్సవం విజయానికి తమ వంతు బాధ్యతను నిశ్శబ్దంగా, నిస్వార్థంగా నిర్వర్తించిన ప్రతి సేవకుడికీ
జిల్లా పద్యాల తోరణం మహోత్సవం బృందం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. 💐🙏

త్వరలో ఒక రోజు Online సమీక్ష నిర్వహిద్దాం. ముందుగా ఉపాధ్యాయుల సమీక్ష పూర్తయిన వెంటనే GSF బృందం సమీక్షను కూడా నిర్వహించుకుందాం.
బాధ్యత తీసుకోకుండా ఫలితాలను ఆశించలేము - సేవను బాధ్యతగా చేయాలన్న GSF నినాద స్ఫూర్తిని కొనసాగిద్దాం.

మన సేవ నిశ్శబ్దంగా ఉండొచ్చు… కానీ దాని ప్రభావం తరతరాలకు వినిపించాలి. 🌿
అందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. 💐
::~ #సదావెంకట్ GSF





No comments:

Post a Comment