Tuesday, August 25, 2026

గోపాల్ జీ @ పద్యాల తోరణం

పద్య పఠన పోటీలతో
సాహితీ  గుబాలింపు
శతక పద్యాల ధారణ తో నైతిక విలువల  పెంపుకు కృషి 

పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 
విద్యార్థులకు పద్యాల పోటీ లు


భవిష్యత్ తరాలకు తెలుగు భాషలోని సాహితీ సొగసు ను పద్యంలోని మాధుర్యంను
పట్టణ పల్లెల్లో వ్యాపింప చేయడానికి తెలుగు భాష బోధకులు నడుంబిగించారు. పద్యాల  తోరణం పేరిట పద్య పఠన పోటీలను పాఠశాల స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తరగతి  శ్రేణిగా  పాఠశాల స్థాయి మండల స్థాయి జిల్లాస్థాయిలలో పోటీలను నిర్వహించి పద్యం యొక్క గొప్పతనాన్ని పద్య పఠనం యొక్క ఆవశ్యకతను ధారణ శక్తిని. చాటడానికి  ఉద్యుక్తులవుతున్నారు

 రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ సౌజన్యంతో
అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక  రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ ల సౌజన్యంతో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్  పద్యాల తోరణం కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లాలో భారీ ఎత్తున నిర్వహించడానికి ఈ మేరకు సన్నాహాలు ప్రారంభించింది

 పద్యం ద్వారా నైతిక విలువలను ప్రబోధిస్తూనే  సుశిక్తులైనటువంటి ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దుటకు పద్య పటన పోటీలు దోహదం చేస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా రంగారెడ్డి జిల్లాలో సాహితీ సౌరభాన్ని మారుమూల ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతం వరకు వ్యాపింప చేయాలని తెలుగు భాషాభిమానులు భావిస్తున్నారు. 

ప్రముఖ సాహితీవేత్త విద్యావేత్త అనంత సాహితీ సాంస్కృతిక వేదిక వ్యవస్థాపకులు దోరవేటి చెన్నయ్య. జ్ఞానసరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సదా వెంకట్,
రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు భవాని జగదీశ్వర్ రెడ్డి. ల
పర్యవేక్షణలో పద్య పఠన పోటీలకు పాఠశాల స్థాయి కమిటీలు మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు.

జిల్లాలోని 27 మండలాలలో గల సాహితీ ప్రముఖులను ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా నిర్వాహకులు ప్రయత్నాలు ప్రారంభించారు. తెలుగు భాష సాహితికి  పద్యం ఒక కోహినూర్ వజ్రం లాంటిదని  పద్యం యొక్క రసస్వాదనం ను విద్యార్థులలో పెంపొందింప చేయడానికి రంగారెడ్డి జిల్లాలో గొప్ప ప్రయత్నం చేస్తున్నట్లుగా  సీనియర్ తెలుగు ఉపాధ్యాయులు పద్యాల తోరణం సమన్వయ సమితి సభ్యులు రంగరాజు శానమోని నర్సింహులు వెంకటస్వామి. మహేందర్ జగన్ నందిగామ కిషోర్  కుమార్ . వెంకటేశం 
బి శంకరయ్య ఎం డి బషీర్  చైతన్య భారతి భువనేశ్వరి కిషన్ చౌహాన్ బుచ్చయ్యా జయ ప్రకాష్ 
 మల్లికార్జున్ చుక్కా శ్రీనివాస్ ఆశీర్వాదం రాములు సుధాకర్ రెడ్డి కమలేష్ శంకరయ్యా 
లు  కృషీ చేస్తుండగా . పోతన వేమన  శ్రీనాథుడు కంచర్ల గోపన్న  బద్దెన మారద వెంకయ్య  లాంటి మహా కవుల పద్యాల తో పాటు 
రామాయణ మహాభారతం లాంటి ఇతిహాస గ్రంధాల నుంచి ప్రసిద్ధ పద్యాలను నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల నాలుకలపై ఆడుతున్నాయని వారు వివరించారు.

ప్రతి పాఠశాల నుంచి ఖచ్చితంగా విద్యార్థులు పాల్గొనే విధంగా పాఠశాల స్థాయిలో తరగతికి ఇద్దరు చొప్పున ఎంపిక  చేస్తూనే వారిలో సాహితీ గుబాలింపును పెంపొందిస్తూ మంచి బహుమతులతో  ప్రోత్సహించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. 
రంగారెడ్డి జిల్లా సాహితీ సౌరభాన్ని చాటుతూనే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ చొరవతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా మార్గదర్శనం కోసం జిల్లా తెలుగు బోధకులు సాహితీ అభిమానుల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 
సెప్టెంబర్ చివరివారం నాటికి   పద్య పటన పోటీలు నిర్వహించనున్నారు. 

ప్రతి గ్రామంలోని కవులు కళాకారులు పధ్య రచయితలు గేయాల రచయితలను  భాగస్వామ్యం చేసే విధంగా కార్యక్రమాన్ని ఖరారు చేశారు.

కె గోపాల్ జి 
కవి రచయిత 
సీనియర్ నేత
రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్ యు పి పి టి ఎస్)

No comments:

Post a Comment