Monday, April 1, 2024

SPORTS Praporatry Camp


Sports Preparatory Camp 

ప్రాంభమైన పల్లె ఆణిముత్యాల సాధన శిబిరం.
 ఆర్థిక నిరుపేద ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూత అందించాలనే ఉద్దేశంతో GSF_SAC ద్వారా ఎంపిక చేసిన ప్రభుత్వ బడుల విద్యార్థులకు సెలవు రోజులలో నిపుణులైన శిక్షకులచే ఇవ్వాలని Feb 7వ తేదిన కబడ్డీ &  వాలీబాల్ లో 150 విద్యార్థులకు శిక్షణ శిబిరం ఈ రోజు  ప్రారంభం జరిగింది.
ఈ రోజు సాధన కుటీర్ లో విద్యార్థుల వారి తల్లిదండ్రుల & ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి శిబిరం నియమ నిబంధనలు తెలిపారు.
ఈ మూడు రోజుల శిబిరం అనంతరం April 25వ తేదీ నుండి 20 రోజుల పాటు పూర్తి స్థాయి శిబిరం ఉంటుందని GSF వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు తెలిపారు*.

అదే విధంగా తెలంగాణలో  పనిచేస్తున్న వివిధ  స్వచ్ఛంద సంస్థల  ప్రతినిధుల సమ్మేళనం జరిగింది. సంఘమిత్ర క్లబ్ పేరున ప్రతీ నెలలో చివరి ఆదివారం జరిగే సమావేశం ఈ రోజు సాధన కుటీర్ లో జరిగింది.
ఈ రోజు సాధన కుటీర్ జరిగిన 159వ వారం భారత మాత హారతి కార్యక్రమoలో పాల్గొన్న సంఘమిత్ర  ప్రతినిధుల బృందం సమక్షంలో కబడ్డీ & వాలీబాల్ క్రీడల శిక్షణ ప్రారంభం జరిగింది.
సంఘమిత్ర బృందంలో వందేమాతరం ఫౌండేషన్ కార్యదర్శి శ్రీ మాధవ రెడ్డి గారు, శ్రీ బుచ్చన్న, Dr. రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Wednesday, March 20, 2024

Bycicles Dirlstribution to GIRLS


రోటరీ క్లబ్ హైదరాబాద్ మిడ్ టౌన్ (RI 3150), అధ్యక్షురాలు శ్రీమతి నిధి ఆనంద్, సీనియర్ సభ్యులు
Rtn సీమా కుమార్, Rtn రినేష్ గారి సారధ్యంలో *జ్ఞానసరస్వతి మహిళా విభాగమైన సాద్రి సమన్వయ సహకారంతో రంగారెడ్డి జిల్లా రంగాపూర్ గ్రామం వద్ద బాలికలకు మరిన్ని 6 సైకిళ్ల పంపిణీని అమలు చేశారు.  RCH నార్త్‌కు చెందిన Rtn శ్రీ హరి హర పరాద్ గారి మార్గదర్శకత్వంలో జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్ట్ వెల్జన్‌ను అమలు చేసారు. ఈ సైకిల్ ప్రాజెక్ట్ ద్వారా ఆడపిల్లలకు సాధికారత కల్పించడం కింద, RC హైదరాబాద్ మిడ్ టౌన్ మరియు RC హైదరాబాద్ నార్త్ ద్వారా ఇప్పటివరకు మొత్తం *26 సైకిళ్లను zphs జాపాలా l,zphs మంచాల( బాలికలు) ,zphs రంగాపూర్ పాఠశాల లకుపంపిణీ చేశారు.*
ఈ కార్యక్రమంలో ghm నిర్మల బాయ్ గారు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని రోటరీ క్లబ్ midtown వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. లబ్ది పొందిన విద్యార్థినులు ప్రత్యేక ధన్యవాదాలతో హర్షాన్ని న్ని వ్యక్తం చేశారు. జ్ఞాన సరస్వతి ఫౌండేషన్( GSF )ద్వారా జరుగుతున్న ఎన్నో కార్యక్రమాల ద్వారా గ్రామీణ  విద్యార్థులు  లబ్ది పొందుతున్నారని GSF వ్యవస్థాపకులు సదా వెంకట్  గారికి పాఠశాల యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.

Thursday, March 7, 2024

SAC_ CULTURAL Selections

#YOGA, #SINGING &  #PAINTING ఎంపిక పూర్తి.
#ప్రతిభనుగుర్తిద్దాం_ప్రతిభావంతులకుచేయూతనిద్దాం అనే సదాశయంతో ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు సరైన  సమయంలో చేయూత అందించాలనే ఉద్దేశ్యంతో
#GSF_SAC( #Sports, #Academics, #Cultural) ద్వారా విద్యార్థుల అభిరుచి ఉండి నైపుణ్యం ఉన్న అంశంలో ఎంపిక చేసి ప్రత్యేక శిబిరాల్లో శిక్షణ ఇస్తున్నది.
అందులో భాగంగా #YOGA, #SINGING, #PAINTING విభాగాలలో ఈ రోజు ఎంపిక జరిగింది.
ఎంపికైన విద్యార్థులకు వేసవి సెలవులతో పాటు సెలవు రోజులలో ప్రత్యేక శిబిరాల ద్వారా శిక్షణ ఇవ్వబడుతుంది.
Feb 7వ తేదీ ఎంపిక జరిగిన #కబడ్డీ & #వాలీబాల్ విద్యార్థులతో పాటు ఈ మూడు అంశాల వారికి కూడా శిబిరాల్లో శిక్షణ ఉంటుంది.
https://www.facebook.com/share/p/ceLjwkHyTVB4d7od/?mibextid=oFDknk

:~ #సదావెంకట్,
#GSF.

Friday, March 1, 2024

SAADRI SHE Sessions

  GSF_SAADRI conducted SHE Awareness Session at ZPHS Rangapur on 29.02.2024.

The students were provided training in Pranayama, Yoga postures, and Super brain exercises by Miss Saritha, a Yoga trainer from  SAADRI yoga team.Students actively involved the session.Additionally, Ms. Pramoda, the incharge of GSF_SAADRI, expertly conducted sessions on Self Awareness and Nutrition.

Thursday, February 29, 2024

బాలికలకు సైకిళ్ల అందజేత

                                                           బాలికల చదువు భారతావనికి వెలుగు అనే ఆశయంతో..
*బాలికలకు ఉచిత సైకిల్ పంపిణీ.*       
               
రోటరీ క్లబ్ హైదరాబాద్ గారి ఆధ్వర్యంలో మరియు సాద్రి _ జ్ఞానసరస్వతి ఫౌండేషన్ మహిళా విభాగం వారి సమన్వయ సహకారంతో ఈరోజు రంగాపూర్  మరియు మంచాల పాఠశాలలో చదువుతూ దూర ప్రాంతం నుండి వచ్చే విద్యార్థినిలకు ఉచితoగా ZPHS  రంగాపూర్ కి 5 సైకిళ్ళు, ZPHS  మంచాలకి 6 మరియు ZPHS జాపాల కోసం 9 సైకిళ్ళు అందించడం జరిగింది.
 ఈ రోజు ZPHS రంగాపూర్ & ZPHS మంచాల పాఠశాలలో జరిగిన  కార్యక్రమంలో *జ్ఞానసరస్వతి ఫౌండేషన్-సాద్రి* ఇంఛార్జి శ్రీమతి ప్రమోద మేడం గారు మరియు పాఠశాల ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు  ఇన్చార్జి ఉపాధ్యాయులు ర ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు 
 మరియు పి ఈ టి వెంకటేష్ గారు పాల్గొని విద్యార్థులకు సైకిల్ అందించి రోటరీ క్లబ్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
 ప్రమోద గారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ద్వారా గ్రామీణ విద్యార్థుల వికాసం కోసం SAC అనే ప్రోగ్రాం ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించ బడుతున్నాయి.అందులో మహిళా విభాగమైన  SAADRI ద్వారా బాలికా సాధికారత కార్యక్రమాలు( "SHE" ) ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు నిర్వహిస్తున్నామని, ఎల్లవేళలా బాలికా సాధికారతకు తోడ్పడతామని  తెలియచేశారు బాలికల ఉన్నతి కోసం రోటరీ క్లబ్ మరియు జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఎల్లవేళలా తోడ్పడుతుంది అని తెలియజేశారు. జ్ఞానసరస్వతి ఫౌండేషన్ చైర్మన్ సదా వెంకట్ గారికి పాఠశాల తరపున  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపాధ్యాయ బృందం వారిని కొనియాయడం జరిగింది.
:~ wటీచర్స్ & స్టూడెంట్స్ @ ZPHS రంగాపూర్ & ZPHS మంచాల.

Wednesday, February 28, 2024

Re-Set & Re -Start @Sadhana Kuteer

A cordial invitation to supporters of GSF.
Sadhana Kuteer, a hub of rural excellence, is currently in the process of being built.
Abdul Kalam Nilayam (Cottage), Bathrooms (10), Annapurna Mandapam (Shed) were unlawfully demolished in 2022: Efforts are being made to rebuild.
Arrangements are being made to organize a summer sports camp for Volleyball & Kabaddi, as well as YOGA, Singing & Painting students who have been selected in January.
Information is being provided to individuals connected to Sadhana Kuteer in order to involve everyone in the reconstruction efforts. This will allow those with the capacity and willingness to contribute effectively to the reconstruction work. The necessary details have been furnished.
Sada Venkat,
Founder and Managing Trustee, GNANA SARASWATHI FOUNDATION.

Tuesday, February 27, 2024

YOGA, PAINTING SELECTIONS

ఆర్థిక బీదరికం కారణంగా ఏ విద్యార్థి తన ప్రతిభను కోల్పోరాదు, అలాంటి వారికి సమాజం అండగా ఉండాలి.*
ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూత అందిద్దాం అనే ఆశయ స్ఫూర్తితో GSF_SAC( Sports ,Academics & Cultural) ద్వారా తమకు అభిరుచి ఉండి నైపుణ్యo ఉన్న అంశంలో ఎంపిక చేసిన విద్యార్థులకు సెలవు రోజులలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నది ఙ్ఞాన సరస్వతి పౌండేషన్. 
అందులో బాగంగా CULTURAL విభాగంలో YOGA, Singing, Painting అంశాలలో విద్యార్థుల ఎంపిక కార్యక్రమం 06.03.2024, బుదవారం రోజున ఇబ్రహీంపట్నం, వినోబా నగర్ లోని GSF_సాధన కుటీర్ లో నిర్వహించబడింది.
రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ బడులలో 7వ తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.  
ఉదయం 10 నుండి సాయంత్రం 4.30 వరకు జరిగిన ఎoపిక ప్రక్రియలో  ప్రతీ అంశానికి 50 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఎంపికయిన వారికి ఈ వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించబడుతాయి.
ఈ ఎంపిక ప్రక్రియ కోసం అనుమతి ఇచ్చి సహకరిస్తున్న రంగారెడ్డి జిల్లా విద్యాశాఖధికారికి  ధన్యవాదాలు..
 ఎంపిక ప్రక్రయకు మరియు శిక్షణా శిబిరాలకు సమన్వయ సహకారం అందిస్తున్న  Madhu kuruva Arts Academy, శృతిలయ మ్యూజిక్ అకాడమీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఎంపిక ప్రక్రియ కోసం సహకారం అందిస్తున్న SGF RR dist వారికి కూడా ధన్యవాదాలు.

*ప్రతిభావంతులకు సరైన సమయంలో అండగా ఉoదాo అన్న ఆశయానికి సహకరిస్తున్న ప్రతీ హృదయానికి ధన్యవాదాలు*.

*ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూత అందిద్దాం*.

:~ సదా వెంకట్,
 GSF

Thursday, February 22, 2024

SPORTS SELECTION LIST

*GSF_ SAC- Sports Wing ద్వారా కబడ్డీ & వాలీబాల్ క్రీడలలో ఎంపికయిన విద్యార్థుల వివరాలు.............విడుదల*
*ప్రతిభను గర్తిద్దాం - ప్రతిభావంతులకు చేయూతనిద్దాం* అనే సదాశయంతో ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు సరైన సమయంలో వారి ప్రతిభకు అండగా నిలవాలని ఉద్దేశ్యంతో GSF_SAC (Sports Academics & Cultural) ద్వారా 12 అంశాలతో విద్యార్థికి అభిరుచి ఉండి ప్రతిభ కనబరిచిన అంశంలో ఎంపిక చేసి Residential Camps నిర్వహించి, మంచి శిక్షకులచే వారికి శిక్షణ ఇవ్వాలనే నిర్ణయం జరిగింది.

అందులో భాగంగా స్పోర్ట్స్ లో కబడ్డీ & వాలీబాల్ క్రీడలలో 7వ తరగతి చదివే విద్యార్థుల ఎంపిక ఈ నెల 7వ తేదీ GSF - సాధన కుటీర్ లో జరిగింది.
జిల్లాలోని  50 పాఠశాలల నుండి సుమారు 350 మoది విద్యార్థులు ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు..

పాల్గొన్న వారినుండి  కబడ్డీలో 75 & వాలీబాల్  లో 75 మంది విద్యార్థులను SELECTION కమిటీ ద్వారా ఎంపిక చేశారు.
*ఎంపికయిన విద్యార్థుల వివరాలను  22.02.2024 రోజున  రంగారెడ్డి జిల్లా విద్యాధికారి శ్రీ సుశీoదర్ రావు గారి ద్వారా విడుదల గావిoచారు.*
ఈ కార్యక్రమంలో MEO లు శ్రీ వెంకట్ రెడ్డి గారు, శ్రీ కృష్ణ గారు పాల్గొన్నారు.
ఎంపికయిన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తూ వేసవి సెలవులలో 20రోజుల Camp నిర్వహిస్తామని GSF ఫౌండర్ సదా వెంకట్ గారు తెలిపారు.
*ఎంపికయిన విద్యార్థులకు మార్చ్ చివరి వారంలో 3 రోజుల Preparatory Camp నిర్వహించి, తల్లిదండ్రుల ద్వారా, పాఠశాల యాజమాన్యం ద్వారా MOU తీసుకుంటారు, అదే విధంగా విద్యార్థులకు అందించే DRESS CODE నిర్ణయిస్తారు.*
కావున ఎంపికయిన పాఠశాల PET లు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలపగలరు.
సమయానుకూలంగా మరిన్ని వివరాలతో తెలిపబడుతుంది..
:~ సదా వెంకట్
Founder, GSF.

GSF_ Sports Wing Selection list.

GSF_ SAC- Sports Wing ద్వారా కబడ్డీ & వాలీబాల్ క్రీడలలో ఎంపికయిన విద్యార్థుల వివరాలు.............విడుదల.
*ప్రతిభను గర్తిద్దాం - ప్రతిభావంతులకు చేయూతనిద్దాం* అనే సదాశయంతో ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు సరైన సమయంలో వారి ప్రతిభకు అండగా నిలవాలని ఉద్దేశ్యంతో GSF_SAC (Sports Academics & Cultural) ద్వారా 12 అంశాలతో విద్యార్థికి అభిరుచి ఉండి ప్రతిభ కనబరిచిన అంశంలో ఎంపిక చేసి Residential Camps నిర్వహించి, మంచి శిక్షకులచే వారికి శిక్షణ ఇవ్వాలనే నిర్ణయం జరిగింది.

అందులో భాగంగా స్పోర్ట్స్ లో కబడ్డీ & వాలీబాల్ క్రీడలలో 7వ తరగతి చదివే విద్యార్థుల ఎంపిక ఈ నెల 7వ తేదీ GSF - సాధన కుటీర్ లో జరిగింది.
జిల్లాలోని  50 పాఠశాలల నుండి సుమారు 350 మoది విద్యార్థులు ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు..

పాల్గొన్న వారినుండి  కబడ్డీలో 75 & వాలీబాల్  లో 75 మంది విద్యార్థులను SELECTION కమిటీ ద్వారా ఎంపిక చేశారు.
*ఎంపికయిన విద్యార్థుల వివరాలను  22.02.2024 రోజున  రంగారెడ్డి జిల్లా విద్యాధికారి శ్రీ సుశేoదర్ కుమార్ గారి ద్వారా విడుదల గావిoచారు.*
ఈ కార్యక్రమంలో MEO లు శ్రీ వెంకట్ రెడ్డి గారు, శ్రీ కృష్ణ గారు పాల్గొన్నారు.
ఎంపికయిన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తూ వేసవి సెలవులలో 20రోజుల Camp నిర్వహిస్తామని GSF ఫౌండర్ సదా వెంకట్ గారు తెలిపారు.
*ఎంపికయిన విద్యార్థులకు మార్చ్ చివరి వారంలో 3 రోజుల Preparatory Camp నిర్వహించి, తల్లిదండ్రుల ద్వారా, పాఠశాల యాజమాన్యం ద్వారా MOU తీసుకుంటారు, అదే విధంగా విద్యార్థులకు అందించే DRESS CODE నిర్ణయిస్తారు.*
కావున ఎంపికయిన పాఠశాల PET లు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలపగలరు.
సమయానుకూలంగా మరిన్ని వివరాలతో తెలిపబడుతుంది..
:~ సదా వెంకట్
Founder, GSF.