ఆర్థిక బీదరికం కారణంగా ఏ విద్యార్థి తన ప్రతిభను కోల్పోరాదు, అలాంటి వారికి సమాజం అండగా ఉండాలి.*
ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూత అందిద్దాం అనే ఆశయ స్ఫూర్తితో GSF_SAC( Sports ,Academics & Cultural) ద్వారా తమకు అభిరుచి ఉండి నైపుణ్యo ఉన్న అంశంలో ఎంపిక చేసిన విద్యార్థులకు సెలవు రోజులలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నది ఙ్ఞాన సరస్వతి పౌండేషన్.
అందులో బాగంగా CULTURAL విభాగంలో YOGA, Singing, Painting అంశాలలో విద్యార్థుల ఎంపిక కార్యక్రమం 06.03.2024, బుదవారం రోజున ఇబ్రహీంపట్నం, వినోబా నగర్ లోని GSF_సాధన కుటీర్ లో నిర్వహించబడింది.
రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ బడులలో 7వ తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
ఉదయం 10 నుండి సాయంత్రం 4.30 వరకు జరిగిన ఎoపిక ప్రక్రియలో ప్రతీ అంశానికి 50 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఎంపికయిన వారికి ఈ వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించబడుతాయి.
ఈ ఎంపిక ప్రక్రియ కోసం అనుమతి ఇచ్చి సహకరిస్తున్న రంగారెడ్డి జిల్లా విద్యాశాఖధికారికి ధన్యవాదాలు..
ఎంపిక ప్రక్రయకు మరియు శిక్షణా శిబిరాలకు సమన్వయ సహకారం అందిస్తున్న Madhu kuruva Arts Academy, శృతిలయ మ్యూజిక్ అకాడమీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఎంపిక ప్రక్రియ కోసం సహకారం అందిస్తున్న SGF RR dist వారికి కూడా ధన్యవాదాలు.
*ప్రతిభావంతులకు సరైన సమయంలో అండగా ఉoదాo అన్న ఆశయానికి సహకరిస్తున్న ప్రతీ హృదయానికి ధన్యవాదాలు*.
*ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూత అందిద్దాం*.
:~ సదా వెంకట్,
GSF
No comments:
Post a Comment