Saturday, March 14, 2026

వరుణుడి ఆజ్ఞతో జలధార

వరుణుడి ఆజ్ఞతో నింగి నుండి నేల జారుతున్న  నిరంతర జలదారతో 🌦️
(అదే... ఇరామ్ లేకుండా కురుస్తున్న వాన)  తడిసి ముద్దవుతున్న సాధన కుటీర్..  
ఓపికతో తన ఒడిలో ఉన్న ప్రతీ జీవి దాహం తీరుస్తూ రేపటి అవసరాలకూ దాచుకుంటున్న కుటీరం..   *నిశ్చల, నిర్మల స్థితిలో అన్నీ గమనిస్తున్న భారత మాత అభయంతో  ఆనంద డోలికల్లో ఇక్కడి నిత్య నివాసులు* @ కూర్మ🐢 _మయూరాలు🦚, శునక🐕_సర్పరాజులు🐉, క్రిమి🦗కీటక, పక్షాదులు🦇.... 
ఏపుగా ఎదిగి నీడనిచ్చే మాకు🌳 తోడుగా మరెన్నో ఔషధ మొక్కలు🪹, పండ్ల మొక్కలు🌱, దేవతా వృక్షాల మొక్కలు🪷 నాటడానికి అనువుగా కురుస్తున్న వర్షానికి🌧️ ధన్యవాదాలు చెపుతున్న కుటీర వన సంపద.*..
ఇదే ఇదే కుటీరం - మన సాధన కుటీరం.
(అరుదుగా దొరికే ఇలాంటి వీడియో రికార్డింగ్ అవకాశంతో  గంతులేస్తున్న  సెల్ ఫోన్😀)

No comments:

Post a Comment