Thursday, February 22, 2024

SPORTS SELECTION LIST

*GSF_ SAC- Sports Wing ద్వారా కబడ్డీ & వాలీబాల్ క్రీడలలో ఎంపికయిన విద్యార్థుల వివరాలు.............విడుదల*
*ప్రతిభను గర్తిద్దాం - ప్రతిభావంతులకు చేయూతనిద్దాం* అనే సదాశయంతో ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు సరైన సమయంలో వారి ప్రతిభకు అండగా నిలవాలని ఉద్దేశ్యంతో GSF_SAC (Sports Academics & Cultural) ద్వారా 12 అంశాలతో విద్యార్థికి అభిరుచి ఉండి ప్రతిభ కనబరిచిన అంశంలో ఎంపిక చేసి Residential Camps నిర్వహించి, మంచి శిక్షకులచే వారికి శిక్షణ ఇవ్వాలనే నిర్ణయం జరిగింది.

అందులో భాగంగా స్పోర్ట్స్ లో కబడ్డీ & వాలీబాల్ క్రీడలలో 7వ తరగతి చదివే విద్యార్థుల ఎంపిక ఈ నెల 7వ తేదీ GSF - సాధన కుటీర్ లో జరిగింది.
జిల్లాలోని  50 పాఠశాలల నుండి సుమారు 350 మoది విద్యార్థులు ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు..

పాల్గొన్న వారినుండి  కబడ్డీలో 75 & వాలీబాల్  లో 75 మంది విద్యార్థులను SELECTION కమిటీ ద్వారా ఎంపిక చేశారు.
*ఎంపికయిన విద్యార్థుల వివరాలను  22.02.2024 రోజున  రంగారెడ్డి జిల్లా విద్యాధికారి శ్రీ సుశీoదర్ రావు గారి ద్వారా విడుదల గావిoచారు.*
ఈ కార్యక్రమంలో MEO లు శ్రీ వెంకట్ రెడ్డి గారు, శ్రీ కృష్ణ గారు పాల్గొన్నారు.
ఎంపికయిన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తూ వేసవి సెలవులలో 20రోజుల Camp నిర్వహిస్తామని GSF ఫౌండర్ సదా వెంకట్ గారు తెలిపారు.
*ఎంపికయిన విద్యార్థులకు మార్చ్ చివరి వారంలో 3 రోజుల Preparatory Camp నిర్వహించి, తల్లిదండ్రుల ద్వారా, పాఠశాల యాజమాన్యం ద్వారా MOU తీసుకుంటారు, అదే విధంగా విద్యార్థులకు అందించే DRESS CODE నిర్ణయిస్తారు.*
కావున ఎంపికయిన పాఠశాల PET లు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలపగలరు.
సమయానుకూలంగా మరిన్ని వివరాలతో తెలిపబడుతుంది..
:~ సదా వెంకట్
Founder, GSF.

No comments:

Post a Comment