Sports Preparatory Camp
ప్రాంభమైన పల్లె ఆణిముత్యాల సాధన శిబిరం.
ఆర్థిక నిరుపేద ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూత అందించాలనే ఉద్దేశంతో GSF_SAC ద్వారా ఎంపిక చేసిన ప్రభుత్వ బడుల విద్యార్థులకు సెలవు రోజులలో నిపుణులైన శిక్షకులచే ఇవ్వాలని Feb 7వ తేదిన కబడ్డీ & వాలీబాల్ లో 150 విద్యార్థులకు శిక్షణ శిబిరం ఈ రోజు ప్రారంభం జరిగింది.
ఈ రోజు సాధన కుటీర్ లో విద్యార్థుల వారి తల్లిదండ్రుల & ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి శిబిరం నియమ నిబంధనలు తెలిపారు.
ఈ మూడు రోజుల శిబిరం అనంతరం April 25వ తేదీ నుండి 20 రోజుల పాటు పూర్తి స్థాయి శిబిరం ఉంటుందని GSF వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు తెలిపారు*.
అదే విధంగా తెలంగాణలో పనిచేస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమ్మేళనం జరిగింది. సంఘమిత్ర క్లబ్ పేరున ప్రతీ నెలలో చివరి ఆదివారం జరిగే సమావేశం ఈ రోజు సాధన కుటీర్ లో జరిగింది.
ఈ రోజు సాధన కుటీర్ జరిగిన 159వ వారం భారత మాత హారతి కార్యక్రమoలో పాల్గొన్న సంఘమిత్ర ప్రతినిధుల బృందం సమక్షంలో కబడ్డీ & వాలీబాల్ క్రీడల శిక్షణ ప్రారంభం జరిగింది.
సంఘమిత్ర బృందంలో వందేమాతరం ఫౌండేషన్ కార్యదర్శి శ్రీ మాధవ రెడ్డి గారు, శ్రీ బుచ్చన్న, Dr. రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment