బాలికల చదువు భారతావనికి వెలుగు అనే ఆశయంతో..
*బాలికలకు ఉచిత సైకిల్ పంపిణీ.*
రోటరీ క్లబ్ హైదరాబాద్ గారి ఆధ్వర్యంలో మరియు సాద్రి _ జ్ఞానసరస్వతి ఫౌండేషన్ మహిళా విభాగం వారి సమన్వయ సహకారంతో ఈరోజు రంగాపూర్ మరియు మంచాల పాఠశాలలో చదువుతూ దూర ప్రాంతం నుండి వచ్చే విద్యార్థినిలకు ఉచితoగా ZPHS రంగాపూర్ కి 5 సైకిళ్ళు, ZPHS మంచాలకి 6 మరియు ZPHS జాపాల కోసం 9 సైకిళ్ళు అందించడం జరిగింది.
ఈ రోజు ZPHS రంగాపూర్ & ZPHS మంచాల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో *జ్ఞానసరస్వతి ఫౌండేషన్-సాద్రి* ఇంఛార్జి శ్రీమతి ప్రమోద మేడం గారు మరియు పాఠశాల ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇన్చార్జి ఉపాధ్యాయులు ర ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు
మరియు పి ఈ టి వెంకటేష్ గారు పాల్గొని విద్యార్థులకు సైకిల్ అందించి రోటరీ క్లబ్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
ప్రమోద గారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ద్వారా గ్రామీణ విద్యార్థుల వికాసం కోసం SAC అనే ప్రోగ్రాం ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించ బడుతున్నాయి.అందులో మహిళా విభాగమైన SAADRI ద్వారా బాలికా సాధికారత కార్యక్రమాలు( "SHE" ) ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు నిర్వహిస్తున్నామని, ఎల్లవేళలా బాలికా సాధికారతకు తోడ్పడతామని తెలియచేశారు బాలికల ఉన్నతి కోసం రోటరీ క్లబ్ మరియు జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఎల్లవేళలా తోడ్పడుతుంది అని తెలియజేశారు. జ్ఞానసరస్వతి ఫౌండేషన్ చైర్మన్ సదా వెంకట్ గారికి పాఠశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపాధ్యాయ బృందం వారిని కొనియాయడం జరిగింది.
No comments:
Post a Comment