*శత వసంతాల జ్ఞానయజ్ఞానికి శతదా ప్రణామాలు!*
*విద్యారంగంలో తనదైన ముద్ర వేసి, వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన విద్యాకుసుమం, విజ్ఞాన ఘని శ్రీ చుక్కా రామయ్య గారు. ఎందరో విద్యావేత్తలకు మార్గదర్శిగా, తరతరాల విద్యార్థులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచిన మహనీయులు*. *అందుకే ఆయనకు మరో పేరు… IIT రామయ్య గారు!*
*GSF ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థుల కోసం గురుకుల విద్యాపీఠ్‌లో నిర్వహించిన 40 రోజుల ప్రత్యేక లక్ష్య సాధన శిబిరాల్లో 2014 సంవత్సరం నుంచే పాల్గొంటూ, విద్యార్థులకు విలువైన మార్గదర్శనం అందించి, తన ఆశీస్సులతో వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేవారు.*
*ఆరోగ్యం సహకరించకపోవడంతో సాధన కుటీర్‌లో నిర్వహించిన తదుపరి శిబిరాలకు ఎక్కువగా రాలేకపోయినా, విద్యార్థుల పట్ల ఆయనకున్న ఆప్యాయత మాత్రం తగ్గలేదు. 2019లో ఆరోగ్యం పూర్తిగా సహకరించని పరిస్థితుల్లోనూ తొలిసారిగా సాధన కుటీర్‌ను సందర్శించి, విద్యార్థులను ఆశీర్వదించడం GSF కుటుంబానికి ఎప్పటికీ మధురస్మృతి.*
*నవంబర్ 20న నిండు నూరేళ్ల జీవిత మైలురాయిని చేరుకున్న ఈ జ్ఞాన తపస్వికి GSF కుటుంబం హృదయపూర్వక శుభాకాంక్షలు, శతకోటి వందనాలు.*
*వయసు శరీరానికే… విజ్ఞానానికి కాదు. ఒక వ్యక్తి జీవితం ఎంత గొప్పదో చెప్పడానికి ఆయన సాధించిన విజయాలే కాదు, ఆయన ద్వారా వెలుగులోకి వచ్చిన జీవితాలే నిదర్శనం*
*శ్రీ చుక్కా రామయ్య గారు… మీ విద్యా తపస్సుకు, మీ నిరాడంబర జీవనానికి, తరతరాలకు మీరు అందించిన స్ఫూర్తికి GSF శతదా ప్రణామాలు!*
:~ సదా వెంకట్,GSF.
No comments:
Post a Comment