రెండు రోజుల వక్త_PUBLIC SPEAKING TRINING* శిబిరం సంపూర్ణం.
జ్ఞానసరస్వతి ఫౌండేషన్ మరియు ఎస్పీ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన *రెండు రోజుల వక్త శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా నేషనలిస్ట్ హబ్ ఛానెల్ వ్యవస్థాపకులు శ్రీ సాయి కృష్ణ గారు, పాల్గొని ప్రసంగించారు*. మానవ సంబంధాలు కనుమరుగు అవుతున్న ఈ సమాజంలో నీతి, నిజాయితి & నిబద్దత తో బతకాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఈ దేశ ధర్మాన్ని అనుసరించి సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని సరి అయిన వ్యక్తులoదరూ సరైన వేదిక మీదకు వచ్చి సమాజ హితం కోసం కృషి చేయాలని వారు అన్నారు. నిన్నటి నుండి ఈ రోజు వరకు శిబిరంలో పాల్గొన్న 30 మంది శిక్షార్తులకు సుమారు 10అంశాలలో నిష్ణాతులైన వ్యవక్తులచే శిక్షణ ఇవ్వబడింది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న తమలాంటి వారికి ఇది అద్భుత అవకాశం లాంటిది, మాకు బాగా ఉపయోగ పడి oదని పాల్గొన్న అభ్యర్తులందరు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రతీ నెల రెండవ శని, ఆదివారాల్లో ఈ శిబిరం నిరహిస్తాం,
శిక్షార్తుల అవసరాలను బట్టి ఎక్కువ సార్లు కూడా నిర్వహిస్తామని జ్ఞానసరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు తెలిపారు.
ఈ రోజు జరిగిన ముగింపు కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ఏలేటి రాజారెడ్డి గారు, ఎస్పీ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ వ్యవస్థాపకులు సంజయ్ కుమార్ గారు మరియు GSF కార్యకర్తలు పాల్గొన్నారు..
:~ team PSTC.
No comments:
Post a Comment