*వక్త _ Publuc Speaking Cource 9రోజుల శిక్షణ ముగింపు*..
*జ్ఞానసరస్వతి ఫౌండేషన్ & ఎస్పీ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన వక్త 9రోజుల ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంచి వక్త, రచయిత, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు శ్రీ రాక సుధాకర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సమాజంలో ఒక గొప్ప వక్తగా ఎదగాలంటే ముఖ్యంగా మూడు అంశాలను ఆచరించాలని ప్రస్తావించారు. అవి 1. వక్త ఎల్లప్పుడూ తన యొక్క హృదయంతో మాట్లాడాలని, 2. ఆచరించిన మాటలేనే చెప్పాలని , 3. ఆ చెప్పే మాటలు సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడాలని వారు చెప్పారు. అదేవిధంగా ప్రతినిత్యం కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలని, హనుమంతుని ఆదర్శంగా తీసుకొని అతని యొక్క వ్యక్తీకరణ నైపుణ్యాలను అలవర్చుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జిఎస్ఎఫ్ వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు మాట్లాడుతూ మంచి నిష్ణా తులైన శిక్షకుల అధ్వర్యంలో ఈ వక్త కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహి స్తామన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సెలబ్రిటీ కోచ్ ఆనంద్ గారు, స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ డైరెక్టర్ పొలే సంజయ్ కుమార్ గారు మరియు శిక్షార్థులు పాల్గొన్నారు*
:~ Team PSTC.
No comments:
Post a Comment