వట్టి రాతలు కావాలి.. ఎందరో తలరాతలు మార్చిన అక్షరాల తురుపుముక్కలు.
మనం చదివిన పుస్తకాలలోనుండి లేదా ఇతరులు ఉదహరించిన కొన్ని వాక్యాలు మనమూ ఎదో ఒక సందర్భంలో, జోష్ లో ఉన్నప్పుడు మాట్లాడుతాము...
జీవితంలో ఎదగడానికి అవే మార్గాలు అని ఇతరులకు చెప్పి మనం మరిచిన వాటిని
మన సాధన కుటీర్ లోని సాధకులు తట్టిలేపి మరీ యాది జేస్తరుగా...
అడుగడుగునా మన మనకు స్వాగతం పలుకుతూనే_ మన జ్ఞాపకాలను తట్టిలేపుతరు...
చెట్టును,బండను,గుండును, కంబాలనూ వదలక మన లక్ష్యాలను నెమరేస్తరు*..
*మనకు దారి చూపుతూనే మన గమ్యాన్ని గుర్తుచేస్తరు*.
*ఏపుగా ఎదిగిన చెట్టును వదలక, ఎదుగుతున్న మొక్కనూ వదలక మన లక్ష్యాలను వేలాడదీస్తరు*...
*వట్టి రాతలు కావవి ఎంతో మంది తలరాతలు మార్చిన అక్షరాల తురుపు ముక్కలని వెక్కిరిస్తరు*.
*ఉదయించే సూర్యుడి సాక్షిగా ఇది మనపనే అని నొక్కి వక్కానిస్తరు*..
*అందుకేనేమో సాధకులు అంటే అట్లనే ఉంటారనీ మనకూ ఓ రకమైన భయంకరమైన భక్తి భావన కలుగుతుంది*.
No comments:
Post a Comment