గౌరవ లోకాయుక్త ఆదేశానుసారం జ్ఞానసరస్వతి పౌoడేషన్ సాధన కుటీర్ ను సందర్సించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం.
గత సంవత్సరం @ *28.02.2022 రోజున వినోభానగర్ లోని జ్ఞానసరస్వతి పౌoడేషన్ సాధన కుటీర్ లోని పురాతన కట్టడాలను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేసిన సందర్భంలో GSF వారు లోకాయుక్తని సంప్రదించారు*, ఆ వెంటనే ముందస్తు సమాచారం లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేయరాదు అని మునిసిపల్ వారికి ఆర్డర్ ఇచ్చిన విషయం తేలిసిందే.
గత యాడాదిగా లోకాయుక్తలో జరిగిన వాదనల అనంతరం, *లోకాయుక్త జడ్జ్ గారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆర్డర్ ఇచ్చారు. వారి ఆదేశానుసారం ఈ రోజు Dr T. Venkat Rao, Director (Investigation) Institution of Lokayukta తో పాటు ఐదు మందితో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం GSF సాధన కుటీర్ సందర్సించారు..
28.02.2022 రోజున అక్రమంగా కూల్చబడ్డ అన్ని కట్టడాలను దగ్గరుండి చూసి, సాక్ష్యాలను తీసుకున్నారు.
*ముందస్తు సమాచారం ప్రకారం స్థానిక మునిషపల్ కమీషనర్, రెవిన్యూ నుండి RI, పోలీష్ శాఖ నుండి స్థానిక CI & SI లు కూడా పాల్గొన్నారు.*
తమ పర్యవేక్షణ తరువాత Dr T. Venkat Rao, Director (Investigation) Institution of Lokayukta మాట్లాడుతూ... అతి త్వరలో పూర్తి నివేదికను లోకాయుక్త జడ్జ్ గారికి సమర్పిస్తాము. ఆ తరువాత జడ్జ్ మెంట్ వస్తుందని అన్నారు.
కార్యక్రమంలో GSF పౌండర్ సదా వెంకట్, మరియు వెంకటేష్ తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment