కూల్చబడ్డ పల్లె ఆణిముత్యాల శౌచాలయాల గోడల్లోని ఇటుకలు నిండు చైతన్యంతో మరో స్ఫూర్తివంతమైన కార్యసాధనకోసం నిర్మిoచే గోడల్లోకి పోతున్నాయి....
కూల్చిన క్రమం అంతా జ్ఞాపకాలు ఇక్కడి గోడల్లో పదిలంగా దాస్తాము, మనదంటూ ఓ రోజు వచ్చాక ఆ జ్ఞాపకాలు మల్లి అందిస్తాము అంటూ పోతున్నాయి. ప్రతి ఆదివారం ఉదయం భారతమ్మకు హారతి కోసం పూసే పూల మొక్కలు ఇప్పుడు కూలిన ఆ గోడల కింద నలిగి, పైకి చూస్తుంటే వాటికి ఓదార్పుతో ఇటుకలు చెప్పిన స్ఫూర్తి మాటలవి...
కూల్చింది గోడలే- చైతన్యాన్ని కాదు..
No comments:
Post a Comment