Tuesday, November 24, 2026

SGF CHAMPIONS

🏆 రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన రంగారెడ్డి జిల్లా Under-14 బాలుర కబడ్డీ జట్టుకు హృదయపూర్వక శుభాభినందనలు! 💐
ఈ అద్భుత విజయాన్ని అందించిన క్రీడాకారులకు, వారిని తీర్చిదిద్దిన కోచ్‌లకు, రంగారెడ్డి జిల్లా SGF బృందానికి ప్రత్యేక అభినందనలు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ముందు నాలుగు రోజుల పాటు సాధన కుటీర్‌లో శిక్షణ పొందిన ఈ క్రీడాకారులు విజయం సాధించడం మాకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ఈ విజయ ప్రస్థానంలో సాధన కుటీర్‌కు కూడా భాగస్వామ్యం కల్పించిన జిల్లా SGF బృందానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.

ముఖ్యంగా, ఈ విజయానికి సాధన కుటీర్ అందించిన సహకారాన్ని గుర్తించి, మాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన SGF బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు. పరస్పర సహకారం, ప్రోత్సాహం ద్వారానే గ్రామీణ క్రీడా ప్రతిభను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలం.

ఈ విజయం ఆరంభం మాత్రమే కావాలి. విద్యార్థులు క్రీడల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ... ఆశీర్వదిద్దాం!

వారి ప్రతిభకు ప్రోత్సాహం... వారి విజయాలకు మన సహకారం!

సదా వెంకట్
GSF

No comments:

Post a Comment