Saturday, August 20, 2022

ప్రతిభావంతులకు చేయూతనిద్దాం

క్రీడాభిమానులారా స్వాగతం....

*ప్రతిభను గుర్తిద్దాం- ప్రతిభావంతులకు చేయూతనిద్దాం* 
*సమాజ ఆస్తిని కాపాడుకుందాం*

సరైన సమయంలో ఆపన్న హస్తాల ప్రోత్సాహం అందక, ఏ గుర్తింపుకు నోచుకోక ఎందరో ప్రతిభావంతుల ప్రతిభలు మొగ్గలోనే వాడిపోయి, మరుగున పడ్డాయన్నది నిష్ఠురసత్యం..

మనలోని అనాసక్తుల వల్ల ఎందరో ప్రతుభావంతులకు కొంతనష్టమే జరిగినా తద్వారా సమాజానికి మాత్రం తీరనిలోటు ఏర్పడుతుందని నమ్మకతప్పని నిజం.. అందుకే అలాంటివారిని గుర్తిoచి, వెన్నుతట్టి ప్రోత్సహిస్తే దేశప్రగతికి కరదీపికలవుతారు. అంతేకాదు తమలాంటి ప్రతిభాకనికలెందరినో పుట్టిస్తారు. వారికి మనం సరైన సమయంలో అందించే చేయూత వారి జీవితాల్లో వెలుగులు నింపి, తమ ప్రాంత ప్రతిభా రూపాలను ప్రోత్సహించి ఆ ప్రాంత అభివృద్ధికి...దేశ ప్రగతికి బాటలు వేస్తారు.  
మన ప్రోత్సాహమే పలు దీపాలను వెలిగిసున్నప్పుడు మనలో కలిగే తృప్తి అపూర్వo... అమూల్యం.. అనంతo...

ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూతనందిద్దాం అనే సదాశయంతో.......
తనకు ఇష్టమైన అంశంలో  ప్రతిభావంతుడైన విద్యార్థి యొక్క ప్రతిభను సరైన సమయంలో గుర్తించి ప్రోత్సహిస్తూ, అండగా నిలబడాలని జ్ఞానసరస్వతి ఫౌండేషన్ #SAC_Sports, Academic, Cultural)  ద్వారా విద్యార్థులను ఎంపిక చేసి, శిక్షణ శిబిరాల ద్వారా శిక్షణ అందిoచి వారికి చేయూతనివ్వాలనే  ఆశయానికి మీ సంపూర్ణ సహకారం అందిస్తారని ఆశిస్తుతున్నాం*.

 ఆశించిన అందరికీ ఆపన్న హస్తo ఇవ్వలేకున్నా....   *పల్లెల్లోని ఆర్ధిక నిరుపేదల నిగూడ ప్రతిభను గుర్తించి, అవసరమైన వారికి సరైన సమయంలో చేయూతనివ్వడం ఆవశ్యకం*. *అలాంటి వారి ప్రతిభ సమాజపు ఆస్తిగా బావిద్దాం.. గుర్తించి చేయూతనివ్వడం మన  సామాజిక బాధ్యతగా గుర్తిదాం.*

*పల్లె మట్టిలో దాగున్న అసంఖ్యాక ఆణిముత్యాలను వెలికితీసి మెరుగులు దిద్దే పవిత్ర కార్యంలో నేను సైతం అంటూ అందరం బాగస్తులవుదాం*.

ప్రస్తుతం Sports లో బాగoగా కబడ్డీ & వాలీబాల్ క్రీడలలో  ఎంపిక జరుగుతున్నది. ఈ రెండు క్రీడలలో మంచి నైపుణ్యం ఉన్నవారు  శిక్షకులుగా, ప్రోత్సహించాలనుకున్న  క్రీడాభిమానులు  సహకరించవచ్చును. 

భవదీయ:
సదా వెంకట్,B.A., LL.B, PGDCJ.
Founder_
GNANA SARASWATHI FOUNDATION.

No comments:

Post a Comment