01-02-2026 ఆదివారం జ్ఞాన సరస్వతీ ఫౌండేషన్ మరియు అనంత సాహితీ సంస్థ రికగ్నైజేడు ఉపాధ్యాయ పండిత పరిషత్తు ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడిన పద్యాల తోరణం సన్నాహక సమావేశంలో చర్చించబడి ఒక నిర్ణయానికి వచ్చిన అంశాలు...
# ప్రతి మండలానికి ఇద్దరు భాషా ప్రతినిధులను ఎంపిక చేసుకోవాలి
#వారి ద్వారా పాఠశాల స్థాయిలో 6 నుంచి 10 తరగతుల వరకు ఏ తరగతి స్థాయికి ఆ తరగతి విద్యార్థులతో పోటీ నిర్వహించాలి
#తరగతికి ఇద్దరు చొప్పున పాఠశాల నుంచి 10 మందిని ఎంపిక చేయాలి.
# పాఠశాలలలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులతో మండల స్థాయి పోటీ నిర్వహించాలి.
#ప్రతి మండలం నుంచి గెలుపొందిన పదిమంది విద్యార్థులను జిల్లాస్థాయికి పంపించాల్సి ఉంటుంది.
#జిల్లా స్థాయిలో రెండు రోజులకు తగ్గకుండా భాషా వేడుక నిర్వహించబడుతుంది ఇందులో ఉత్సాహంగా పాల్గొనే ఉపాధ్యాయులకు చక్కని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతిగా పారితోషికాలు కూడా అందించబడతాయి.
#సెప్టెంబర్ 9 తెలంగాణ భాషా దినోత్సవానికి ముందుగానే పాఠశాల స్థాయి మండల స్థాయి లలో పోటీలు ముగించుకొని భాషా దినోత్సవానికి రెండు మూడు రోజులు అటు ఇటుగా జిల్లాస్థాయి కార్యక్రమం నిర్వహించడానికి నిశ్చయించడమైనది
# పద్య ప్రియులకు అంత్యాక్షరి పోటీ పద్యాలతోనే ఉంటుంది. ఉత్సాహం కలిగిన వాళ్లు ఇందులో పాల్గొనవచ్చు
#మళ్లీ భాషాభిమానులం అందరం ఒక 15 రోజులలో గూగుల్ మీట్ వేదికగా సమావేశమై ఈ నిర్ణయాలను పునః సమీక్షించి తుది తీర్మానం చేయవలసి ఉంటుంది.
No comments:
Post a Comment