VIVEKA VOLLYBALL TOURNAMENT -2024 సంపూర్ణం.*
స్వామీ వివేకానంద జయంతిని పురస్కరించుకుని GSF_సాధన కుటీర్ లో ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన వాలీబాల్ పోటీలు ఈ రోజుతో ముగిశాయి.*
లీగ్ పద్దతిలో జరిగిన పోటీలలో ఎంపిక చేసిన 12 జట్లకు మాత్రమే అవకాశం దక్కింది*.
ఈ నెల 7వ తేదీ ప్రారంభమై ఈ రోజు సెమీ ఫైనల్ & ఫైనల్ పోటీలతో టోర్నమెంట్ సపూర్ణమయిoది.
టోర్నమెంట్ *మొదటి స్థానంలో PC తండా*, *ద్వితీయ స్థానంలో నందివనపర్తి* & *తృతీయ స్థానంలో చింటపట్ల గ్రామాల జట్లు నిలిచాయి*. గెలుపొందిన జట్లకు అతిథుల ద్వారా. వాలీబాల్ క్రీడా సామాగ్రి అందించ బడింది.
ఫైనల్ *పోటీలకు శ్రీ రమేష్ గారు(IIT_Bombay, Ex TCS Employee,)* *శ్రీమతి భారతి దేవి గారు, GSF_SAADI Advisory Member,*
*Prof. హరిగోపాల్ garu(Retd. Director, IPEP,Hyd), శ్రీమతి. T.సుబ్బలక్ష్మి గారు, Retd. Principal, శ్రీ.బుచ్చయ్య, సామాజిక కార్యకర్త గార్లు అతిథులుగా పాల్గొని బహుమతుల అందజేశారు*.
అతిథులు తమాభిప్రాయం తెలుపుతూ పల్లెల్లోని ప్రతిభావంతులకు సరైన సమయంలో అండగా నిలబడాల్సిన అవసరం ఉంది, ఆవైపుగా GSF ప్రయత్నం అద్భుతంగా ఉన్నదని అన్నారు..
*GSF వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు మాట్లాడుతూ పల్లె ఆణిముత్యాల ప్రగతి కోసమే ఈ సాధన కుటీర్ పనిలో ఉన్నది*. *పల్లెల్లోని ప్రభుత్వ బడులలో చదివే ఆర్థిక నిరుపేద ప్రతిభావంతులకు సమయంలో ఆసరా ఉండాలని ఆశించి GSF_SAC @ Sports l, Academic & Cultural విభాగాలలో నిరుపేద ప్రతిభావంతులను ఎంపిక చేసుకుని శిబిరాల ద్వారా శిక్షణ ఇస్తామని తెలిపారు*. *Sports లో కబడ్డీ & వాలీబాల్ లలో పిబ్రవరి మొదటి వారంలో జిల్లా స్థాయి ఎoపకలు నిర్వహించి అనంతరం శిబిరాలు నిర్వహిస్తాము, అందులో ఈ వాలీబాల్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు కూడా శిబిరాలలో సహకారం అందించాలని అభ్యర్థన చేశారు*.
*ఈ పోటీలు నిర్వహించిన GSF_SAC Sports Wing incharge శంకర్ , వెంకటేష్ మరియు జనార్ధన్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
:~ Shankar, Sports Wing of GSF_SAC*
No comments:
Post a Comment