*ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారులను గుర్తించి, వారిని దేశం గర్వించదగ్గ వారిగా తీర్చిదిద్ది ప్రపంచ స్థాయిలో దేశ గౌరవం పెంపొందిoచాలనే ఆశయంతో నిండిన కసితో ఉన్న 78 ఏండ్ల యువకుడు శ్రీ CBR ప్రసాద్ గారు*..
తన 5 ఎండ్ల వయసు నుoడే దేశంకోసం ఏదైనా సాధించాలనే తపనతో మిలట్రీలో చేరి, దేశానికి కొంతకాలం సేవలందించి, చిన్న వయసులోనే ఉద్యోగ విరమణ చేసిన అనంతరం వ్యాపారం చేసి కసిగా డబ్బులు సంపాదించి, సంపాదనలో సగభాగం సమాజానికి సమర్పణ చేస్తున్న సమాజ హితకారి శ్రీ CBR ప్రసాద్ గారు.
*గ్రామీణ క్రీడాకారులను ఒలింపిక్స్ లో మెడల్స్ సాదిoచే విధంగా తయారు చేసి, 78 ఏండ్ల వయసులో కూడా అంతే ఉత్సాహంతో Sports Academy ల ద్వారా శిక్షణ ఇస్తున్న సాదారణంగా కనిపించే అసాధారణ స్ఫూర్తి ప్రదాత*..
*GSF_SAC లోని స్పోర్ట్స్ విభాగంలో వారి సమన్వయ సహకారం ఆశిస్తూ ఈ రోజు కలిసిన GSF బృందం.*
మొదటి విడతగా జరిగిన సమావేశంలో వారి స్పందన అద్బుతం..
జనవరి మొదటి వారంలో సాధన కుటీర్ లో నిర్వహించే క్రీడాకారుల ఎంపిక కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది*..
*వారి సమన్వయ సహకారంతో గ్రామీణ ఆర్థిక నిరుపేద క్రీడాకారులు కొందరికైనా మేలు జరగాలని, జరుగుతుందని ఆశిదాం.*
:~ సదా వెంకట్,GSF.
No comments:
Post a Comment