Facebook Post of 22.04.2019
Inauguration of GSF
SADHANA CAMP for RURAL GENIUS @ SADHANA KUTEER
–జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పల్లె ఆణిముత్యాలకు శిక్షణా శిభిరం.
– మన చదువు,మన కళ నలుగురికి ఉపయోగపడాలి– స్టేట్ రీసోర్స్ సెంటర్ , డైరక్టర్ డాక్టర్ బండి సాయన్న
–ఉన్నత లక్ష్యాన్ని ఎన్నుకోవాలి– యువ సామాజిక కార్యకర్త శ్రావ్యా రెడ్డి
మన చదువు నలుగురికి ఉపయోగపడాలని స్టేట్ రీసోర్స్ సెంటర్ , డైరక్టర్ డాక్టర్ బండి సాయన్న తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వినోభానగర్లోని జ్ఞానసరస్వతి ఫౌండేషన్_ #GSF సాధన కుటీర్ లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎంపికచేసిన 150 మంది విద్యార్థులకు పల్లె ఆణిముత్యాలకు సాధన శిబిరం పేరుతో 21 రోజుల శిక్షణను ఇవ్వడం జరుగుతోంది. మొత్తం 90 రోజుల శిక్షణలో మొదటి విడత 21రోజుల శిక్షణ.
ఈ శిక్షణ కార్యక్రమంలో బాగంగా జ్ఞానసరస్వతి ఫౌండేషన్ విద్యార్థులకు #చిత్రలేఖనం #PAINTING యోగ #YOGA పాటలు #SINGING, ఉపన్యాసం #SPEECH ,వ్యాసరచన #EssayWritting అంశాలలో నిష్ణాతులచే శిక్షణను ఇవ్వడం జరుగుతుంది.
ఆదివారం పల్లె ఆణిముత్యాల శిక్షణ శిభిరానికి ముఖ్యఅతిధులుగా స్టేట్ రీసోర్స్ సెంటర్ , డైరక్టర్ డాక్టర్ బండి సాయన్న, యువ సామాజిక కార్యకర్త శ్రావ్యా రెడ్డి లు హాజరై విద్యార్థులతో ముచ్చటించారు.
Dr. బండి సాయన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎంత కష్టంలో ఉన్నా కష్టాన్ని నమ్ముకుంటే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చున్నారు. ప్రతి ఒక్కరూ ముళ్లబాటలోనే పూలవనానికి చేరుకోవచ్చున్నారు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కళ దాగి ఉంటుందన్నారు. తెలుగుబాష ఎంతో గొప్పదని తెలిపారు. మనం ఎంతచదివినా మన చదువు నలుగురికి ఉపయోగపడాలని తెలిపారు.- వేసవి సెలవుల్లో ఎన్నో విషయాలు నేర్చికోవచ్చు.. అందుకోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు అవసరమన్నారు. ఈ చక్కని అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
----యువ సామాజిక కార్యకర్త శ్రావ్యా రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏంచుకోవాలన్నారు. అన్యాయాన్ని ఎవరైతే ఎదుర్కొంటారో వారే ధైర్యవంతులన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే స్వచ్చభారత్ కార్యక్రమం లాంటివి అవసరం ఉండదన్నారు. ప్రభుత్వ పాఠశాలల విధ్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఈ క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వరియోగం చేసుకోవాలని సూచించారు. జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సదావెంకటరెడ్డి మాట్లాడుతూ ----పల్లె ఆణిముత్యాల ప్రతిభ ప్రపంచానికి చాటడం కోసమే ఈ కార్యక్రమని తెలిపారు. పల్లెబడుల విద్యార్థుల ప్రతిభకు సరియైన శిక్షణ,ప్రోత్సాహాన్ని అందించే కార్యశాలలు లేక వారి ప్రతిభ ప్రపంచానికి పరిచయం కావడం లేదన్నారు. పల్లెబడుల విద్యార్థుల్లో ఏంతో ప్రతిభ దాగిఉందన్నారు. కేవలం సానెపట్టే కార్యక్రమాన్ని మాత్రమే ఫౌండేషన్ చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న సహృదయులందరికీ, శిక్షకులు, నిస్వార్థంగా పనిచేస్తున్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో #సాధన శిబిర నిర్వహణలో A A A_ విభాగాల ఇంఛార్జీలు దామోదర్,నరేష్,శ్రీశైలం సాద్రి ఇంచార్జ్ ప్రమోద మరియు ఆయా అంశాల శిక్షకులు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment