జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పల్లె ఆణిముత్యాల ప్రగతికోసం సాధన శిబిరం ప్రారంభం.
Post of 19.04.2018
రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం(వినోభ నగర్) జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాసం, వ్యాసరచన యోగ, పాటలు పాడుట మొదలగు వాటిలో నిష్ణాతులైన బోధకులచే నిర్వహించే 15 రోజుల ప్రత్యేక శిక్షణ శిబిరం ఈ రోజు ప్రారంభమయింది. ఈ సాధన శిబిరంలో పాల్గొన్న ఇండియన్ ఐడల్ ప్రముఖ గాయకుడు కారుణ్య, విశ్రాంత ఐఏఎస్ మరియు అవేర్ సంస్థల చైర్మన్ పూజ్యశ్రీ మాధవంజి,గాంధీ గ్లోబల్ ఫామిలీ రాష్ట్ర కార్యదర్శి పురుషోత్తం రెడ్డి , విద్యావేత్త ప్రదీప్ రెడ్డి, శ్లోక విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సదా వెంకట్ రెడ్డి, సభ్యులు వెంకటేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజ్యశ్రీ మాధవంజి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకూ చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతోగొప్పదని కొనియాడారు. ఈ విద్యార్థుల ప్రతిభ ఆమోగమని తెలిపారు. ప్రభుత్వ బడుల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని, ఈ శిక్షణా శిబిరంలో శ్రద్ధగా వింటూ వివిధ అంచెలంచెలుగా విద్యార్థులు ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రముఖ గాయకుడు కారుణ్య మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు aఅన్ని రంగాల్లో రాణించే విధంగా తోడ్పాటు అవసరమని అదే తోడ్పాటు జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ అందించడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఏంతో మంది విద్యార్థులు పాటలు పాడటం లాంటి ఇతర రంగాల్లో రాణించడనికి ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సదా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పల్లె బడుల్లో ఆణిముత్యాల్లాంటి విద్యార్థులు ఉన్నారని ఎలాంటి పేదరికం వారికి అడ్డురాకుండా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమం ఈ ఫౌండేషన్ చేస్తోందని తెలిపారు.
Start the camp for the development of village riots under the guidance of Jnana Saraswati Foundation
The 15 day special training camp was opened today by Ranga Reddy District Ibrahimatnam (Vinobha Nagar) Gnana Saraswati Foundation for painting, lecture, essaying yoga and singing for public school students. The Indian Idol is the leading singer of the Indian Idol and Composite IAS and Aware Companies Pujyasri Madhavaji, Gandhi Global Family Secretary purushottham Reddy, educationalist Pradeep Reddy, SLOKA Educational Institution Director Srinivas Reddy, Gnana Saraswati Foundation Founders Sada Venkat Reddy, Members Venkatesh, Teachers, students etc participated. Speaking on this occasion, Pujyasri Madhavanji said that this program is specially organized for the students of rural areas of the public schools. These students' talents are acceptable. The program is being organized for the public school students and it is said that the students will be able to help the students in different stages of listening carefully at this training camp. The famous singer is compassionate, saying that the scholarship in the field of education, along with education, is needed to support the Gnana Saraswati Foundation. It is said that this program is useful for performing excellence in other areas such as singing songs. The founder of the Gnana Saraswati Foundation, Sada Venkat Reddy, said that the foundation is going on to promote students' talent in government schools without any poverty allegation that there are students like Auntu in the villages.
No comments:
Post a Comment