by NAGARJU garu Famous Lyric Writter & Singer.
Fame of బాల్యమురా అమూల్యమురా.. తిరిగి చెరలేని తీరమురా..
బాల్యమురా అమూల్యమురా... తిరిగి చేరలేనీ తీరమురా..అంటూ అందరి బాల్యాన్ని జ్ఞాపకం చేసేలా పాటతో అలరించిన నాగరాజు గారు కరీంనగర్ నుండి పల్లెఆణిముత్యాల కోసం సాధనకుటీర్ కి వచ్చారు..
నాకుగేండ్ల క్రితం రోజుకు 5సార్లయినా మీడియా ద్వారా విన్నపాట అది. ప్రత్యక్షంగా వినడం గొప్ప అనుభూతి.
సుమారు 4 గంటల పాటు, తను రాసిన అన్ని పాటలను శిబిరానికి పరిచయంతో విద్యార్థుల తన్మయత్వం..
సర్టిఫికేట్ల కోసం చదివిన చదువు తక్కువే అయినా, సమాజాన్ని, సామాజిక అవసరాలను అసాంతం చదివిన మనిషే. రాత్రి 2 గంటల వరకు జరిగిన చర్చల ద్వారా నేను తెలుసుకున్న విషయం అది.
ఒక సాహిత్య అభిలాషి.. అంతకుమించి ఓ పుస్తకపఠకదారి.
గ్రందాలేం రాయకపోయినా, రాసిన అన్నీ పదాలు, పంక్తులూ పండితులకు, పామరులకూ సులభంగా తలకెక్కేలా ఉన్నాయి.. తన బతుకుకోసం పానలు, పట్కారాలు పట్టినా... సమాజ చైతన్యంకోసం అక్షరమూటలను భుజానెత్తుకున్న సాహసి... ఓ సాదా'రణ" సాహిత్య పిపాసి.
అన్ని పరిస్తితులకు తగ్గట్టు అలవోకగా అక్షరాల కూర్పు చేసి, పదునైన మాటలతో పసందుగా పాటలు పాడే నాగరాజు గారు సాధన శిబిర విద్యార్థులకోసం రావడం, పాడటం..... మల్లీ వస్తాననటం అందరికీ గొప్ప అనుభూతే.
అందరి ఆశీస్సులు మెండుగా అంది సాహిత్య చైతన్యంతో సమాజానికి ఇంకా ఉపయోగపడాలని ఆశిద్దాం..
No comments:
Post a Comment