జాతీయ బి.సి.కమీషన్ చైర్మన్ శ్రీ ఆచారి గారిని కలిసిన జ్ఞానసరస్వతి ఫౌండేషన్ శిబిరాలలో పాల్గొన్న బి.సి. కులాల విద్యార్థులు.
సాధన కుటీర్ అక్రమ కూల్చివేతపై తమ విన్నపాన్ని తెలిపి, సాధన కుటీర్ ని సందర్శించి అక్కడ జరిగిన అక్రమ కూల్చివేతలను ప్రత్యక్షంగా చూసి కమిషన్ ద్వారా సరైన న్యాయం,సహకారం అందించవలసిందిగా తమ విన్నపాన్ని అందించి న జ్ఞానసరస్వతి ఫౌండేషన్ లో శిబిరాలలో పాల్గొన్న బి.సి కులాలకు చెందిన విద్యార్థులు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే తమలాంటి అనేక మంది విద్యార్థుల నిగూడ ప్రతిభను సరైన సమయంలో గుర్తించి ప్రోత్సహిస్తూ, చేయూత అందిస్తున్న GSF సాధన కుటీర్ ని అక్రమంగా ధ్వంసం చేయడం ద్వారా అనేక మంది గ్రామీణ ఆర్ధిక నిరుపేద విద్యార్థులకు అన్యాయo జరుగుతుంది.. తమలోని నైపుణ్యాలను శిబిరాలలో నిష్ణాతులైన శిక్షకుల ద్వారా మెరుగుపరుచుకునే అవకాశం ఉండేది.
కావున గ్రామీణ ప్రతిభావంతులకు సరైన సమయంలో అండగా నిలుస్తున్న GSF సాధన కుటీర్ కు B.C. Commission ద్వారా సరైన న్యాయం జరగాలని అభ్యర్ధన చేశారు. స్పందిoచిన చైర్మన్ గారు త్వరలో సాధన కుటీర్ ను సందర్శించి అన్ని విషయాలు తెలుసుకుంటానని తెలిపారు.
No comments:
Post a Comment